For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అమెరికాలోని చికాగోలో తెలుగు తారల సెక్స్ రాకెట్ విషయాన్ని కండోమ్స్ పట్టించాయి.. ఇంటి నిండా అవే

  |

  సినీ తారలతో అమెరికాలో వ్యభిచారం చేయించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వివాదం నడుస్తున్న క్రమంలో ఇలాంటి విషయం తెరపైకి రావడంతో అంతటా దీనిపైనే చర్చిస్తున్నారు.

  ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిషన్‌ మోదుగుమూడి, చంద్రకళ మోదుగుమూడి దంపతులపై రోజుకొక వార్త వస్తూనే ఉంది. ఇక వీరి వీసా గడువు ముగిసిన కూడా అమెరికాలోనే ఉండడంతో తాజాగా అరెస్టయ్యారు. వీసా విషయంతో పాటు వ్యభిచారం చేయించిన విషయాలపై కూడా త్వరలోనే విచారించనున్నారు. ఇక కిషన్‌ మోదుగుమూడి, చంద్రకళ మోదుగుమూడిలకు సంబంధించిన విషయాలు మన తారలు చాలానే చెప్పారు.

  డాన్స్‌ షోలో పాల్గొనడానికి పిలిచారు

  డాన్స్‌ షోలో పాల్గొనడానికి పిలిచారు

  ‘‘నేను డిసెంబరు 26న అమెరికా వచ్చాను. న్యూ ఇయర్‌ సందర్భంగా పెన్సిల్వేనియాలో ఓ డాన్స్‌ షోలో పాల్గొనడానికి రాజుగారు (కిషన్‌) నన్ను పిలిచారు. దీనితో పాటు నన్ను బలవంతంగా లైంగిక కార్యకలాపాల్లోకి దింపేందుకు ప్రయత్నించారు. నిజానికి నేను వ్యభిచారం చెయ్యను. కానీ కస్ట్టమర్లున్న ఉన్న ఒక గదిలో బలవంతంగా అరగంట సేపు ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. వారితో మాట్లాడానంతే... బయటికి పోవడానికి దారి చూపాలని వారిని కోరాను. ఏ విషయమైనా కిషన్‌ భార్య విభ (చంద్రకళ )తో చెప్పుకోవాలని, ఆమె మాత్రమే అమెరికా నుంచి వెళ్లడానికి రిటర్న్‌ టికెట్‌ ఏర్పాటు చేయగలదని వారు చెప్పారు.'' -కిషన్‌ చేతిలో చిక్కుకున్న ఓ ప్రముఖ నటి ఇచ్చిన వాంగ్మూలం ఇది.

  లైంగిక వ్యాపారానికి

  లైంగిక వ్యాపారానికి

  కిషన్‌ ద్వారా వీసాలు అందుకున్న నటీమణుల్లో అనేక మంది ప్రముఖ తారలు, కొందరు టీవీ యాంకర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎంత మందిని కిషన్‌ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళ తమ లైంగిక వ్యాపారానికి వాడుకున్నారనేది తేలాల్సి ఉంది. అయితే కొందరు డబ్బుల కోసం స్వచ్ఛందంగా సెక్స్‌ రాకెట్లో పాల్పంచుకున్నవారు ఉండగా, మరికొందరు ఒత్తిడితో సెక్స్ లో పాల్గొనాల్సి వచ్చిందట.

  42 పేజీల అభియోగపత్రంలో

  42 పేజీల అభియోగపత్రంలో

  ఇక ఇలినాయిస్‌ జిల్లా కోర్టులో హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్‌ విభాగానికి చెందిన బ్రియాన్‌ జిన్‌ అనే స్పెషల్‌ ఏజెంట్‌ దాఖలు చేసిన 42 పేజీల అభియోగపత్రంలో ఈ కేసుకు సంబంధించిన అనేక వివరాలు లభించాయి.

  హోటల్‌ రూమ్‌ల్లోనూ ఉంచి వ్యభిచారం

  హోటల్‌ రూమ్‌ల్లోనూ ఉంచి వ్యభిచారం

  ఇక కిషన్‌ మోదుగుమూడికి శ్రీరాజ్‌ చెన్నుపాటి, రాజు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయన భార్య అసలు పేరు చంద్రకళా పూర్ణిమ. ఆమెకు విభ, విభ విజయం, విభ జయం అనే పేర్లు ఉన్నాయి. ‘‘భారత్‌కు చెందిన చెందిన ఐదుగురు తారలను కిషన్‌, ఆయన భార్య కలిసి వ్యభిచారం, ఇతర అనైతిక, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. షికాగోలోని కిషన్‌ ఇంట్లోనూ, వివిధ నగరాల్లోని కొన్ని హోటల్‌ రూమ్‌ల్లోనూ ఉంచి వ్యభిచారం చేయించారు.' అని ఛార్జిషీటులో పేర్కొన్నారు.

  మాట్లాడే తీరు నచ్చకనే

  మాట్లాడే తీరు నచ్చకనే

  ఈ ఉదంతంపై యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ తాజాగా స్పందించిన విషయం తెలిసిందే."చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. 2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్‌ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్‌ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్‌లో నాఫొటోను ప్రచురించారు. ఆ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని అప్పట్లో నేను ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశాను' అని అనసూయ కొన్ని రోజుల క్రితం చెప్పారు.

  పాపులారిటీని బట్టి

  పాపులారిటీని బట్టి

  ‘అవకాశాల్లేని హీరోయిన్లను ఈవెంట్స్‌ కోసం అమెరికాకు రప్పించి.. అక్కడ వారిని మభ్యపెట్టి వ్యభిచారాంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు సుమారు 1000 అమెరికా డాలర్లు ఆఫర్‌ చేస్తున్నారు. ఈ ఆఫర్‌ వారి పాపులారిటీని బట్టి ఉంటుంది.' శ్రీరెడ్డి చెప్పారు.

  వ్యభిచార ఉచ్చులో

  వ్యభిచార ఉచ్చులో

  చికాగో సెక్స్ రాకెట్ గురించి హీరోయిన్ సంజన కూడా స్పందించారు. ఈవెంట్ల పేరుతో అమెరికాకు హీరోయిన్లను, నటీమణులను రప్పిస్తుంటారు. ఇందులో కొందరు సి, డి గ్రేడ్ ఆర్టిస్టులు ఈ వ్యభిచార ఉచ్చులో చిక్కుకుంటున్నారు. కొందరు డబ్బు ఆశపడి కూడా ఇలా చేసే అవకాశం ఉందని సంజనా చెప్పారు.

  వీసా గడువు పూర్తి కావడంతో

  వీసా గడువు పూర్తి కావడంతో

  2018 జనవరి 23వ తేదీన మోదుగుమూడి దంపతులను ఓహియోలో యునైటెడ్‌ స్టేట్స్‌ బోర్డర్‌ పెట్రోల్‌ (యు.ఎస్‌.బి.పి.) అధికారులు అడ్డగించారు. 2016 ఆగస్టు 8వ తేదీన వారి వీసా గడువు పూర్తయినట్లు గుర్తించి ఇద్దర్నీ అరెస్టు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన విచారణ ఈ ఏడాది నవంబరుకు వాయిదా పడింది. ఇదిలా ఉండగా..కిషన్‌ దంపతులను అరెస్టు చేసినప్పుడు వారి నుంచి యు.ఎస్‌.బి.పి. అధికారులు అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

  సోదాలు నిర్వహించారు

  సోదాలు నిర్వహించారు

  అందులో మారియట్‌ హోటల్‌ పేరుతో ముద్రించి ఉన్న కాగితంలోని చేతిరాత అక్షరాలు అధికారుల దృష్టిని ఆకర్షించాయి. అందులో ఒకచోట "వాషింగ్‌టన్‌ డి.సి..దాని పక్కన ఓ సినీనటి పేరు, జనవరి 19న ఉదయం రూం.నెంబర్‌ 207 అని, మరోచోట జనవరి 19, వెంకట్‌, రూం. నెంబర్‌ 404 అని ఇలా..అనేక మంది పేర్లు, హోటల్‌ గదుల నెంబర్లు రాసి ఉండటాన్ని గుర్తించిన దర్యాప్తు అధికారులకు ఇదేదో వ్యభిచారానికి సంబంధించిన వ్యవహారమేనన్న" అనుమానం వచ్చింది. దాన్ని ఖరారు చేసుకునేందుకే సోదాలు నిర్వహించారు.

  కండోమ్‌లు పట్టించాయి

  కండోమ్‌లు పట్టించాయి

  అప్పుడు 70 కండోమ్‌లు దొరికాయి. వీటిని వేర్వేరు జిప్‌లాక్‌ బ్యాగ్‌లలో పెట్టి సీలు చేశారు. వీటితో పాటుగా నకిలీ పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డు దొరికింది. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌కు ఒక తెలుగు అసోషియేషన్‌ ఇచ్చిన మూడు లేఖలు, కొన్ని డైరీలు, లెడ్జర్‌లు దొరికాయి. ఈ డైరీలు, లెడ్జర్‌లలో ఎవరికి ఎంతెంత ఇచ్చినదీ స్పష్టంగా రాసి ఉంది. దాని ఎదురుగా వారి సంతకాలు కూడా ఉన్నాయి. అలా కండోమ్ లు, డైరీలు, చిత్తుకాగితాలు కూడా రాజును పట్టించడానికి కారణం అయ్యాయి. మొత్తానికి ఆయన ఇంటి నిండా అన్నీ ఇలాంటివివే దొరికాయంట.

  స్నానం చెయ్యి

  స్నానం చెయ్యి

  "నీ దగ్గరకొచ్చిన వారు దండిగా టిప్పిస్తారు... నువ్వు చేయాల్సిందే... ఒక్క సారి చెయ్యి... క్లయింట్లు (విటులు) మారేటపుడు మధ్య దొరికే సమయంలో స్నానం చెయ్యి" అంటూ ఒక నటికి చంద్రకళ మెసేజ్‌ పెట్టినట్లు కూడా అధికారులకు ఆధారాలు దొరికాయంట.

  చంద్రకళే ఫిక్స్‌ చేసేది

  చంద్రకళే ఫిక్స్‌ చేసేది

  "వ్యభిచారానికి సంబంధించిన డేట్లన్నీ చంద్రకళే ఫిక్స్‌ చేసేది. తానే నన్ను ఓ హోటల్‌కు తీసుకెళ్లి కస్టమర్లకు పరిచయం చేసేది. ఓ పదినిమిషాల తరువాత తాను అక్కడ నుంచి వచ్చేసేది. ఆ తరువాత నన్ను వెనక్కి రప్పించేది. కిషన్‌ ఇల్లు రెండు ఫ్లాట్లతో ఉంటుంది. ఒక దాంట్లో కిషన్‌, చంద్రకళ ఉండేవారు. మరొక దానిలో నన్ను, ఓ మహిళతో కలిసి ఉంచేవారు...కొందరు విటులను ఆ ఇంట్లోకే పంపేవారు" ఒక నటి చెప్పడం గమనార్హం.

  మెహరీన్‌ను ప్రశ్నించింది

  మెహరీన్‌ను ప్రశ్నించింది

  ఇక కెనెడా నుంచి అమెరికాకు వెళ్లిన నటి మెహరీన్‌ను అక్కడి ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రశ్నించింది. ఆమె ఏ పని మీద అమెరికాకు వెళ్లారన్న విషయాన్ని వివరంగా అడిగింది. మెహరీన్‌ మాత్రం తన కుటుంబాన్ని కలవడానికి తాను వాంకోవర్‌ నుంచి అమెరికాకు వెళ్లానని చెప్పింది.

  సెక్స్‌ రాకెట్‌కు సంబంధించిన ప్రశ్నలు

  సెక్స్‌ రాకెట్‌కు సంబంధించిన ప్రశ్నలు

  "నేను తెలుగు నటిని అని తెలుసుకుని నన్ను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆపి, పలు ప్రశ్నలు అడిగారు. సెక్స్‌ రాకెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు విస్తుపోయాను. నా కుటుంబీకులు అక్కడ ఉండటం వల్ల తరచూ ప్రయాణిస్తుంటానని వారితో చెప్పాను. దాంతో వారు అసౌకర్యానికి క్షమించమని అడిగారు. ఈ కేసుకు సంబంధించి సంపూర్ణ వివరాలు తెలిసేవరకు, అక్కడికి వెళ్లే వారందరినీ ఇలాగే విచారిస్తామన్నారు. తెలుగు హీరోయిన్ల మీద వారికున్న అభిప్రాయం చూసి ఇబ్బందిగా అనిపించింది" అంటూ మెహరీన్‌ ఈ మధ్య చెప్పింది.

  సెక్స్ దందా

  సెక్స్ దందా

  ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. ఏడాది కాలంలో వీరు వర్దమాన తారల కోసం 76 విమాన టికెట్లు బుక్ చేశారంటే.. సెక్స్ దందా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రకళ స్వయంగా విటులకు ఫొటోలు పంపి రేట్లు ఫిక్స్ చేసేది. షాట్స్ ప్రకారం గంటల ప్రకారంగా రేట్లు ఫిక్స్ చేసేది. అందులో అధిక మొత్తం డబ్బు వీళ్లే తీసుకునే వారు. తారలకు చాలా తక్కువ అమౌంట్ ఇచ్చేవారు.

  English summary

  us cops bust telugu sex racket thriving under cultural cover

  us cops bust telugu sex racket thriving under cultural cover
  Story first published: Monday, June 18, 2018, 17:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more