Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
పిజ్జా కార్నర్ లో బ్యాక్ టచ్ చేసిన పోకిరిని ఆడుకున్న అమ్మాయి, భార్య ముందే పరువు తీసింది (వీడియో)
ఆమె పేరు ఈమెలియా హోల్డెన్. వయస్సు 21. జార్జియాలోని సవన్నాలోని ఒక పిజ్జా రెస్టారెంట్ లో ఆమె వెయిటర్ గా పని చేస్తోంది. పిజ్జా కార్నర్ లో బ్యాక్ టచ్ చేసిన పోకిరిని ఆడుకున్న అమ్మాయి.
రెస్టారెంట్లలో, మాల్స్, పెట్రోల్ బంక్ తదితర ప్రాంతాల్లో పని చేసే అమ్మాయిలంటే ప్రతి ఒక్కరికీ చులకనే. అలాంటి అమ్మాయిలను చాలా చీఫ్ గా కొందరు పోకిరీలు. కానీ వాళ్లు నీతి నిజాయితీగా పని చేసుకుని బతుకుతుంటారు. అలాంటి వాళ్లను ఏమన్నా కూడా మనల్ని ఎవరూ పీకుతారులే అనుకుంటారు కొందరు కంత్రీగాళ్లు.

అమ్మాయిలకు వేధింపులు
అందుకే బయట అలాంటి చోట్ల పని చేసే అమ్మాయిలకు వేధింపులు ఎక్కువగా ఉంటాయి. ఇక పిజ్జా సెంటర్లలో పని చేసే అమ్మాయిలంటే మనవాళ్లు కాస్త తక్కువగా అంచనా వేస్తుంటారు. మనమే కాదు విదేశాల్లోనూ కొందరు ఆకతాయిలు అలాంటి అమ్మాయిలను చాలా చులకనగా చూస్తుంటారు.

పిజ్జా రెస్టారెంట్ లో వెయిటర్
ఆమె పేరు ఈమెలియా హోల్డెన్. వయస్సు 21. జార్జియాలోని సవన్నాలోని ఒక పిజ్జా రెస్టారెంట్ లో ఆమె వెయిటర్ గా పని చేస్తోంది. ఇక ఆమె పని చేసే పిజ్జా సెంటర్ కు ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. అతని పేరు ర్యాన్ చెర్‌విన్‌స్కీ. వయస్సు 31 సంవత్సరాలు.

కాస్త కింద బెండ్ కాగానే
ర్యాన్ రెస్టారెంట్ లో తినడానికి పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. తిన్నాడు. తర్వాత అతను బయటకు వెళ్లడానికి బయల్దేరాడు. ఆ సమయంలో ఈమెలియా హోల్డెన్ ఏవో పేపర్స్ తీసుకుని ఒక స్టాండ్ పెడుతోంది.. తర్వాత టేబుల్ డ్రాయర్ ను ఓపెన్ చేసేందుకు కాస్త కింద ఒంగుతుంది.
బ్యాక్ ను టచ్ చేశాడు
అప్పుడే అటుగా వెళ్తున్న ర్యాన్ చెర్‌విన్‌స్కీ ఆమె బ్యాక్ ను టచ్ చేశాడు. పనిలో నిమగ్నమైన ఈమెలియా వెంటనే తేరుకుని అతని షర్ట్ కాలర్ పట్టుకుని కింద పడేసింది. ఆ దెబ్బకు అతను టేబుల్ పై పడిపోయాడు. ఆ టేబుల్ అలాగే జారుకుంటూ ముందుకెళ్లిపోయింది. దీంతో అక్కడున్న ఒక రెడ్ షర్ట్ లోని వ్యక్తితో పాటు మరికొందరు అక్కడికి పరుగున వచ్చారు.
భార్య పిల్లల ముందే అరెస్ట్
ఈమెలియా గట్టిగా అరవడంతో వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ర్యాన్ చెర్ విన్‌స్కీ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ఈమెలియా, సిబ్బంది అస్సలు వదలకుండా పట్టుకున్నారు. తర్వాత అతని భార్య పిల్లల ముందే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

వీడియో వైరల్
ర్యాన్ చెర్ విన్‌స్కీ రెండు రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. కాగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రెడ్డిట్ లో ఈ వీడియో అప్ లోడ్ అయిన వెంటనే కొన్ని మిలియన్ల మంది జనాలు దీన్ని చూశారు. ఇక ఈమెలియా చేసిన ధైర్యాన్ని చూసి అందరూ ఆమెను అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

డ్రెస్ అలా ఉండడం వల్లే
ప్రతి మహిళా ఇలా ధైర్యం చేస్తే వెదవలకంతా తిక్క కుదురుతుందని అంటున్నారు నెటిజన్లు. కాగా ఆమె వేసుకున్న డ్రెస్ అలా ఉండడం వల్లే అతను అలా ప్రవర్తించాడని కొందరు కామెంట్స్ చేస్తుండగా, డ్రెస్ లను సాకు చూపకండి మొదట మీ బుద్ది మార్చుకోండి అని కొందరు కామెంట్స్ చేశారు.



Click it and Unblock the Notifications
