Latest Updates
-
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
రద్దీగా ఉండే సూపర్ మార్కెట్లో ఏం జరిగిందో తెలుసా? వీడియో చూస్తే నవ్వుకోలేక చస్తారు
మొదటి సారి సీసీ కెమెరాకు గౌరవం ఇచ్చిన వ్యక్తి అంటూ కొన్ని రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చేసింది. అందులో ఒక వ్యక్తి.. రహదారిపై బైక్ ఆపిన వ్యక్తి జేబులో నుంచి పర్స్ తీస్తాడు.
మొదటి సారి సీసీ కెమెరాకు గౌరవం ఇచ్చిన వ్యక్తి అంటూ కొన్ని రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చేసింది. అందులో ఒక వ్యక్తి.. రహదారిపై బైక్ ఆపిన వ్యక్తి జేబులో నుంచి పర్స్ తీస్తాడు. అక్కడే సీసీ కెమెరా ఉండడాన్ని గమనించి కెమెరా వైపు తిరిగి దణ్ణం పెట్టుకుని మళ్లీ దాన్ని అతనికే తిరిగి ఇస్తాడు. అయితే ఇలాంటి ఘటనే మళ్లీ కొన్ని రోజుల క్రితం ఇంకొకటి జరిగింది.
ముందు వ్యక్తి పర్స్ కొట్టేస్తాడు
ఒక వ్యక్తి రద్దీగా ఉండే ఒక సూపర్ మార్కెట్లో ముందు వ్యక్తి పర్స్ కొట్టేస్తాడు. తర్వాత మళ్లీ అతనికే ఇస్తాడు. అసలు ఏం జరిగిందంటే... సాధారణంగా కాస్త రద్దీగా ఉందంటే చాలు జేబు దొంగల బెడద మొదలవుతుంది. ఇటీవల ముంబైలో ఒక సూపర్ మార్కెట్లో ఇలాగే రద్దీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ముందు నిలబడ్డ వ్యక్తి జేబులో నుంచి పర్స్ తీశాడు.

పర్స్ పడిపోయిందంటూ కవర్ చేశాడు
కానీ అతని టైమ్ బాలేదు. వెంటనే అక్కడ సీసీ టీవీలున్నట్లు గుర్తించాడు. కెమెరా వైపు తిరిగి దణ్నం పెట్టుకున్నాడు. నేను చేసింది తప్పే అన్నట్లు ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. తర్వాత తన ముందు నిల్చున్న వ్యక్తిని పిలిచి మీ పర్స్ ఇక్కడ పడిపోయిందంటూ కవర్ చేశాడు. దానికి అతను థ్యాంక్స్ చెప్పగా సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన దొంగ చిరునవ్వులు చిందిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పర్స్ వెనక్కి ఇచ్చి బతికి పోయాడు
ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఫన్నీగా కామెంట్స్ చేశారు.సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ వీడియోను ముంబై పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీకు ఈ వీడియో ఫన్నీగా అనిపించొచ్చు. చోరీ చేసిన పర్స్ వెనక్కి ఇచ్చి అతను బతికి పోయాడు. ఎవరైనా సరే ఇలా నిజంగా చేస్తే మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
జాగ్రత్తగా ఉండండి
సో... ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ కెమెరాలుంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కక్కుర్తి పడి ఏదైనా చేశారంటే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. తర్వాత మళ్లీ మీరు ఆ తప్పుని సరిదిద్దుకోవాలని ప్రయత్నించినా లాభం ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండండి.



Click it and Unblock the Notifications
