Latest Updates
-
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
వీడియో: షాప్లో దొంగతనం చేసే ముందు సంతోషంగా డాన్స్ చేసిన దొంగ
వీడియో: షాప్లో దొంగతనం చేసే ముందు సంతోషంగా డాన్స్ చేసిన దొంగ
సంతోషంగా ఉన్నప్పుడు లేదా, సంతోషం కోసమో డాన్స్ వైపు మొగ్గు చూపడం సర్వసాధారణం. వృత్తిగా డాన్స్ నే ఎంచుకున్న వాళ్ళ గురించైతే ఇక చెప్పనవసరం లేదు. వారి నరనరాన డాన్స్ కోసమే అన్నట్లు అంకితమైపోయి ఉంటారు. కానీ ఈ కథనంలో సుమారుగా 20 ఏళ్ళ వయసు కలిగిన దొంగ, షాప్లో దొంగతనానికి వచ్చి ముందస్తు విజయ సంకేతంగానో ఏమో కాని డాన్స్ చేస్తూ సిసిటీవీ కెమరాల్లో అడ్డంగా దొరికాడు.
కెమెరాలో దొరికిన ఈ సరదా సంఘటన గురించిన మరిన్ని వివరాలు చూడండి. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది.
వీడియో: షాప్లో దొంగతనం చేసే ముందు సంతోషంగా డాన్స్ చేసిన దొంగ
ఈ దొంగ, బటన్లు తీసిన చొక్కా మరియు కండువాతో కనిపించాడు, మరియు ఈ కండువా అతని మెడ చుట్టూ కట్టబడి, ఒక టై వలె కనిపిస్తుంది; ఆ వ్యక్తి హఠాత్తుగా బాలీవుడ్ చిత్రాలలో కనిపించే కొన్ని స్టెప్పులేస్తూ షాప్ వద్దకు సమీపించాడు.

కానీ ఆ వ్యక్తి ప్రవర్తన చూస్తే, సీసీ టీవీ కెమరా గురించి తెలిసే, సరదాగా ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే క్రమంలోనే డాన్స్ చేసాడని తెలుస్తోంది.
మనలో ఎంతోమంది విజయం తర్వాత నృత్యం చేయడాన్ని చూస్తూనే ఉంటాం, ఇది కాస్త భిన్నమైనది.
కొన్ని సెకన్ల ప్రదర్శన తర్వాత, ఆ వ్యక్తి తన ముఖాన్ని కప్పి, దొంగతనానికి సంకల్పించిన దుకాణంలోకి ప్రవేశించుటకు కదిలినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది.
వీడియో:
అయితే దురదృష్టవశాత్తూ సి.సి.టి.వి ఫుటేజ్ను విడుదల చేసిన తర్వాత అతడిని అరెస్టు చేసినంత సమయం పట్టలేదు అతని సంతోషానికి.
దొంగతనానికి వస్తే, పని పూర్తి చేసుకుని వెళ్ళాలి కాని డాన్సులూ గట్రా చేసి దొరికిపోకూడదు అంటూ నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికరఅంశాలు, జీవన శైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
