Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సిలిండర్ గడువు అయిపోయినా కూడా వినియోగిస్తే చాలా ప్రమాదం, సిలిండర్ గడువు ఎలా తెలుసుకోవాలి?
ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. అయితే అందరూ దాన్ని కేవలం ఖాళీ అయినప్పుడు మాత్రమే చూస్తారు. తర్వాత ఫుల్ సిలిండర్ తీసుకుంటారు. దాన్ని వినియోగిస్తూ ఉంటారు.సిలిండర్ గడువు.
ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. అయితే అందరూ దాన్ని కేవలం ఖాళీ అయినప్పుడు మాత్రమే చూస్తారు. తర్వాత ఫుల్ సిలిండర్ తీసుకుంటారు. దాన్ని వినియోగిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా దానికి సంబంధించిన విషయాలు అస్సలు తెలుసుకోరు. అలా చేయకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉంది.

సిలిండర్ పైన ఒక డేట్
అయితే వాటిని కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
ప్రతి సిలిండర్ పైన ఒక డేట్ ఉంటుంది. అదే ఎక్స్పైరీ డేట్.
దాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అది గడువు దాటాక కూడా ఉపయోగిస్తే గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పెద్ద ఎత్తున ప్రమాదం సంభవిస్తుంది. అయితే ఈ విషయం తెలియకుండానే చాలా మంది వాటిని నిత్యం ఉపయోగిస్తూ ఉంటారు.

వంటింట్లోకెళ్లి సిలిండర్ ను చెక్ చేసుకుంటే
అయితే సిలిండర్ కు ఇలా ఒక గడువు ఉంటుందనే విషయం సంబంధిత శాఖ అధికారులకు కూడా సరిగ్గా తెలియదు. దాదాపు చాలా మంది ఇలాంటి సిలిండర్లను వినియోగిస్తుంటారు. మీరు మీ వంటింట్లోకెళ్లి సిలిండర్ ను చెక్ చేసుకుంటే కనీసం వంద సిలిండర్లలో ఒక పది అయినా ఇలాంటివి ఉండే అవకాశం ఉంది.

రౌండ్ గా ఒక హ్యాండిల్
సిలిండర్ ను పట్టుకునేందుకు రౌండ్ గా ఒక హ్యాండిల్ ఉంటుంది. దానికి సపోర్ట్ గా సిలిండర్ కు అటాచ్డ్ గా ఉండే వాటికి లోపలి భాగంలో కొన్ని అంకెలు ఉంటాయి. ఆ మూడు అక్షరాలు కూడా సిలిండర్ గడువు తేదిని సూచిస్తాయి. ఒక కోడ్ రూపంలో దానిపై సంవత్సరం, నెలకు సంబంధించిన వివరాలుంటాయి. ఆ సిలిండర్ ను అంత వరకు ఉపయోగించుకోవొచ్చు అని అర్థం.

గడువు తేదీ ముగిసేలోపు
ఆ గడువు వరకు సిలిండర్ ఉపయోగించుకున్న తర్వాత దాన్ని మళ్లీ తనిఖీ చేసేందుకు పంపించాలి. ఇలా గడువు తేదీ ముగిసేలోపు ప్రతి సిలిండర్ ను భద్రతా ప్రమాణాల కోసం తనిఖీ చేయాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం ఇలా కచ్చితంగా చేయాలి.

కోడ్ ఆధారంగా
దానిపై ఉన్న కోడ్ ఆధారంగా ఆ ఏడాది ఆ నెలలో సిలిండర్ ను కచ్చితంగా పరీక్షించాలి. దాన్ని పరీక్షించాక బీఐఎస్ నుంచి అంటే భారతీయ ప్రమాణాల సంస్థ ఒక సర్టిఫికెట్ పొందాలి. అప్పుడు ఆ సిలిండర్ ను మళ్లీ వాడేందుకు అనుమతి ఉన్నట్లు లెక్క. తర్వాత ఆ సిలిండర్ లో గ్యాస్ నింపి వినియోగదారుడికి పంపిణీ చేస్తారు.

సిలిండర్లను టెస్టింగ్ చేసేందుకు
ఇక సిలిండర్ల టెస్టింగ్స్ ను కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా చేస్తుంటాయి. వాళ్లు కాంట్రాక్ట్ ద్వారా సిలిండర్లను టెస్టింగ్ చేసేందుకు అనుమతులు పొందుతారు. ఇలా ఒకసారి సిలిండర్ కు టెస్ట్ చేశాక దాన్ని మరో ఐదేళ్ల పాటు వినియోగించుకోవచ్చు.

కోడ్ రూపంలో సిలిండర్ పై రాస్తారు
ఒకసారి టెస్టింగ్ పూర్తయ్యాక దాన్ని మళ్లీ టెస్టింగ్ చేయాలో కూడా ఒక కోడ్ రూపంలో సిలిండర్ పై రాస్తారు. ఇయర్, మంత్ వివరాలను దానిపై రాస్తారు. ఇక కొత్త సిలిండర్ అయితే పదేళ్ల వరకు టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సిలిండర్లను కాస్త ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు.

లోపాలు కనిపిస్తే
ప్రత్యేకమైన ఉక్కు ద్వారా సిలిండర్ లోపలి భాగాన్ని తయారు చేస్తారు. ప్రతి సిలిండర్ ను కూడా బీఐఎస్ ప్రమాణాల మేరకు ఇలా తయారు చేస్తుంటారు. టెస్టింగ్ సమయంలో సిలిండర్ లో లోపాలు కనిపిస్తే దాన్ని ఇక వాడకూడకుండా చేసేస్తారు. అలాంటి సిలిండర్లను గ్యాస్ కంపెనీలు మళ్లీ వినియోగించకూడదు.

ఎలా గుర్తు పట్టాలి
ఇక సిలిండర్ ఉండే కోడ్ ను ఎలా గుర్తు పట్టాలి అని అందరికీ సందేహం వస్తుంది. దానిపై ఉన్న కోడ్ ఆధారంగా మీరు సంవత్సరం, నెలను ఈజీగా గుర్తు పట్టేయొచ్చు. సిలిండర్ కు ఉండే రౌండ్ హ్యాండిల్ దగ్గర లోపల గమనిస్తే మీకు కొన్ని కోడ్స్ ఉంటాయి.

సిలిండర్ పై A.18 అని ఉంటే
ఉదాహరణకు మీ ఇంటిలోని సిలిండర్ పై A.18 అని ఉంటే అదే ఎక్పైరీ తేదీ అని గుర్తించుకోవాలి. A అంటే జనవరి నెల నుంచి మార్చి నెల వరకు అని అర్థం. అంటే 2018 మార్చి లోపల దాన్ని టెస్టింగ్ కు పంపించాలి అని అర్థం. టెస్టింగ్ పూర్తయిన తర్వాతే మళ్లీ దాన్ని గ్యాస్ కంపెనీలు వినియోగించాలి. అలాకాకుండా 2018 మార్చి తర్వాత కూడా వినియోగిస్తే దాని వల్ల ప్రమాదం పొంచి ఉందని అర్థం. దాన్ని టెస్టింగ్స్ కు పంపించలేదని అర్థం.

B.18 అని ఉంటే
ఇక B.18 అని ఉంటే B అనేది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉండే నెలలను సూచిస్తుంది. అలాగే 18 అనేది ఆ సంవత్సరాన్ని సూచిస్తుంది. అంటే 2018 జూన్ వరకు దాని గడువు ఉందని అర్థం. ఆ తర్వాత దాన్ని వినియోగించకూడదు. C-18 ఉంటే C అనేది జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న గడువును సూచిస్తుంది. అంటే 2018 సెప్టెంబర్ వరకు దాని గడువు ఉందని అర్థం. ఇక D.18 అని ఉంటే.. D అనేదిఅక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే నెలలను సూచిస్తుంది. అంటే 2018 డిసెంబర్ వరకు ఆ సిలిండర్ గడువు ఉన్నట్లు లెక్క.

మూడు నెలల గ్రేస్ పిరియడ్
అంటే ప్రతి సిలిండర్ కూడా మూడు నెలల గ్రేస్ పిరియడ్ ను కలిగి ఉంటుంది. A కోడ్ జనవరి నుంచి మార్చి వరకు కలిగి ఉన్నట్లు ప్రతి కోడ్ కూడా మూడు నెలల పిరియడ్ కలిగి ఉంటుంది. వినియోగదారుడి నుంచి డీలర్ వద్దకు చేరేందుకు గానీ అలాంటి పిరియడ్ ఫిక్స్ చేసి ఉంటారు.
ఇక A 2018 కోడ్ తో ఉన్న సిలిండర్ ను మీరు మార్చి తర్వాత అస్సలు తీసుకోకూడదు. దాని బదులు మరో సిలిండర్ ఇవ్వండని మీరూ ధైర్యంగా అడగండి. ఆ రైట్ మీకుంది. అయితే కొందరు డీలర్లు ఆ కోడ్స్ ను కూడా మార్చుతున్నారని ఆరోపణలున్నాయి. సో.. మీరు వాటిని కూడా జాగ్రత్తగా పరిశీలించండి.



Click it and Unblock the Notifications











