మీ ముక్కు కలిగి ఉన్న ఆకారాన్ని బట్టి - మీరెలాంటి వారో సులభంగా తెలుసుకోవచ్చు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాళ్ళ నడకతీరు నుంచి - గోళ్ళ ఆకారం వరకూ ఉన్న అన్ని రకాల విషయాలను మనము బాగా అర్థం చేసుకోవడం వల్ల వారి గూర్చి సులభంగా అర్థం చేసుకోవచ్చు.

మీ ప్రియమైన వ్యక్తిని విశ్లేషించడంలో మీరు ఎక్స్పర్ట్ కావాలని కోరుకునేవారికి ఒక సులభమైన ట్రిక్కు గురించి మేము మీకు తెలియజేస్తాము. దానితో మీరు ఇతరుల కొన్ని వ్యక్తిత్వ లక్షణాలను గూర్చి తెలుసుకోగలుగుతారు.

What Does Your Nose Shape Reveal About You

ఉదాహరణకు :- ముక్కు ఉండే పరిమాణం, నిర్మాణం, ఆకారాలు బట్టి వ్యక్తి కలిగివుండే లక్షణాలను వెల్లడిస్తుంది. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా ?

మీ ముక్కు ఉన్న ఆకారాన్ని బట్టి మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోందని మీరు తెలుసుకోవాలి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.

మీ ముక్కు

మీ ముక్కు "a" ఆకారంలో ఉంటే :

ఈ ఆకారాన్ని "ది టర్న్ అప్ నోస్" అని కూడా పిలుస్తారు. మీ ముక్కు పొడవుగా, వక్రంగా అలాగే ఎగువ కొనను సూచించేదిగా ఉన్నట్లయితే, మీరు ఆశావాదులుగా, సానుకూలం ధోరణిని కలిగేవారిగా, మీరు కోరుకునే రంగంపై ఎక్కువ మక్కువను కలిగి వారిగా ఉంటారు. మీరు మీ కుటుంబముతో పాటు, స్నేహితులతో కూడా ఒక బలమైన అనుబంధాన్ని కలిగి చాలా దగ్గరగా ఉంటారు.

మీ ముక్కు

మీ ముక్కు "b" ఆకారంలో ఉంటే :

ఈ ముక్కు ఆకారమును "గ్రీక్ నోస్" అని కూడా పిలుస్తారు. మీ ముక్కు తిన్నగా, పొడవుగా ఉన్న రూపంలో గాని ఉంటే, మీరు బాగా కష్టపడి పనిచేసేవారిగా, కోప స్వభావంతో, లాజికల్గా ఆలోచించే వ్యక్తని చెబుతారు. ఇతరుల దగ్గర మీరు మీ భావోద్వేగాలను బయటపడనీయరు.

మీ ముక్కు

మీ ముక్కు "c" ఆకారంలో ఉంటే :

ఈ ముక్కు ఆకారమును "ది స్నబ్ నోస్" అని పిలుస్తారు. మీ ముక్కు ఈ ఆకారంలో గాని ఉంటే, మీరు ఎలాంటి విషయాన్నైనా తొందరగా గ్రహించి తెలివిగా వ్యవహరించే వారికి మంచి పేరును పొందుతారు. ఒక వ్యక్తిగా, మీరు మీ వ్యవహారాలలో తొందరగా స్పందించడంతో పాటు, దూకుడుగా కూడా వ్యవహరిస్తారు.

మీ ముక్కు

మీ ముక్కు "d" ఆకారంలో ఉంటే :

ఈ ముక్కు ఆకారాన్ని "ది రోమన్ నోస్" అని కూడా పిలుస్తారు. మీ ముక్కు ఈ ఆకారంలో ఉన్నట్లయితే, మీ ముక్కు సగభాగం వరకూ వంపుగా వచ్చి, ఆ తర్వాత సగభాగం తిన్నగా ఉంటుంది. దీనిబట్టి మీరు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే, మీరు సపోర్ట్ చేసే వారిగా కూడా ఉంటారు. ఒక వ్యక్తిగా మీరు బలమైన దృక్పథాన్ని కలిగి, ప్రభావవంతులుగా కూడా ఉంటారు.

మీ ముక్కు

మీ ముక్కు "e" ఆకారంలో ఉంటే :

ఈ ఆకారంలో ఉన్న ముక్కును "ది న్యుబియన్ నోస్" అని పిలుస్తారు. ఈ ఆకారంలో మీ ముక్కు తక్కువ పొడవును కలిగి, వెడల్పులో కాస్తా విస్తారంగా ఉంటుంది. అప్పుడు మీరు క్రియేటివిటీగా ఉంటూ, స్థిరమైన రంగంలో ఎక్కువ మక్కువతో అందమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని తెలియజేస్తుంది.

మీ ముక్కు

మీ ముక్కు "f" ఆకారంలో ఉంటే :

ఈ ఆకారంలో ఉన్న ముక్కును "ది ఆక్విలైన్ నోస్" గా పిలుస్తారు. మీ ముక్కు సూటిగా, తిన్నగా 90 డిగ్రీల కోణాన్ని కలిగి ఉన్నట్లయితే, మీరు వ్యాపారపరమైన ఆలోచనలతో, ఆధిపత్య ధోరణిని కలిగి, చాలా ఆకర్షణీయంగా ఉంటారని తెలియజేస్తుంది.

మీ ముక్కు

మీ ముక్కు "g" ఆకారంలో ఉంటే :

ఈ ఆకారంలో ఉన్న ముక్కును "ది హాక్ నోస్" అని కూడా పిలుస్తారు. మీ ముక్కు ఆకారంలో పొడవుగా ఉంటూ, ముక్కు చివర్లలో హుక్కు ఉన్న మాదిరిగా ఉంటుంది. ఇలాంటి వారు, ఇతరులు ఏమనుకుంటున్నారో అనేది అస్సలు పట్టించుకోరు. ఒక వ్యక్తిగా, మీరు పోటుగాడి వంటి స్వభావాన్ని కలిగి, చాలా కష్టపడి పనిచేసేవారిగా కూడా ఉంటారు.

మీ ముక్కు

మీ ముక్కు "h" ఆకారంలో ఉంటే :

ఈ ముక్కు ఆకారమును "ది సెలెస్టియల్ నోస్" అని కూడా అంటారు. ఈ రకమైన ముక్కు చాలా సాధారణంగా కనబడుతుంది. ఇలాంటివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండడంతో పాటు, వారి జీవితాల్లో ఆధ్యాత్మికతను, శారీరక పరిపక్వత సాధించడానికి వీరు నిరంతరం కృషి చేస్తారు.

English summary

What Does Your Nose Shape Reveal About You?

There are many different ways in which a person's characteristics can be understood. From their way of walking to even the shape of their nails, a lot can be understood by looking at these minute details in a person.