Latest Updates
-
ఒత్తిడితో కంటి మీద కునుకు కరువు.. ఈ యోగాసనాలతో ఇట్టే నిద్ర పట్టేస్తుంది.! -
సియా పాయింట్ ఎక్కడ? కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు తర్వాత ఆ కోటకి పోటెత్తిన పర్యాటకులు -
బంధంలో పెరుగుతున్న ప్రైవేట్ ‘స్పేస్’.. దూరం చేస్తుందా లేక ప్రేమను పెంచుతుందా.? -
వ్యాధినిరోధక శక్తిని పెంపు, ఎముకలకు కొండంత బలం..హైదరాబాదీ పెళ్లిళ్ల స్పెషల్ మటన్ మరాగ్ -
మీ పిల్లల్లో చుండ్రు సమస్య.. ఈ జెల్‌ను కాసేపు తలకు పట్టిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.? -
రోజుకు ఎన్ని పండ్లు తినాలి? డాక్టర్ చెబుతున్న చేదు నిజాలివే! -
పెళ్లి కాలేదా? క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువే! -
ఇడ్లీ,దోశలు వేస్ట్..ఇది తింటేనే అసలైన శక్తి..టేస్ట్ కేకో కేక! -
కొబ్బరి చెట్లు తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఎందుకు పెరుగుతాయో తెలుసా.? -
మీ పిల్లలు ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారా? ఈ ట్రిక్ తెలిస్తే అసలు ఫోన్ జోలికే వెళ్లరు!
2019లో ఈ రాశుల వారి జీవితాలు ఇలా ఉంటాయి, చాలా విషయాల్లో మార్పు వస్తుంది
2019 లో కన్యరాశి వారికి కెరీర్ పరంగా, బాంధవ్యాల పరంగా అనుకూలంగా ఉంటుంది. మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి. దాదాపు ప్రతి విషయంలోనూ మీకు మంచే జరుగుతుంది.
2019లో రాశుల ప్రకారం ఒకొక్కరి జాతకం ఎలా ఉందో చూసుకోండి.
మకరరాశి డిసెంబరు 22 నుంచి జనవరి 20 వరకు
2018లో మకరరాశి వారు కాస్త ఇబ్బందులను ఎదుర్కొని ఉండవచ్చుగానీ 2019లో మాత్రం పరిస్థితులు వీరికి అనుకూలంగానే ఉంటాయి. మీరు చేపట్టబోయే చాలా పనులు సఫలం అవుతాయి. ఇక ప్రేమబంధం కూడా వైవాహిక బంధంగా మారే అవకాశం ఉంటుంది.

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 18 వరకు)
మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యల తాలుకా చిన్నచిన్న ప్రాబ్లమ్స్ ను 2019లో కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు సమస్యల్ని శక్తివంతంగా ఎదుర్కొంటారు. అందరి నుంచి మీకు మంచి సపోర్ట్ ఉంటుంది. కొన్ని ఆటంకాలు ఏర్పడిన వాటి నుంచి గట్టెక్కడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయండి.

మీనం (ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు)
2019లో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించనున్నారు. అలాగే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. వాటన్నింటినీ మీరు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.

మేషం (మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 వరకు)
మేషరాశి వారు ఈ ఏడాది బాగా పని చేయాల్సి వస్తుంది. మీ ప్రతిభాపాఠవాలను గుర్తించే సమయం రానుంది. మీకు కొత్తకొత్త అవకాశాలు రానున్నాయి. మీరు ఈ ఏడాది స్వేచ్ఛగా ఉండడంతో పాటు బాధ్యతగా మెలుగుతారు.

వృషభం (ఏప్రిల్ 20 నుంచి మే 21 వరకు)
ఈ సంవత్సరం మీరు చాలా విషయాల్లో ముందజంలో ఉంటారు. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఈ ఏడాది మొత్తం మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మంచి మంచి బంధాలు ఏర్పడుతాయి. కొత్త కొత్త స్నేహాలు ఏర్పడుతాయి.

మిథునం (మే 22 నుంచి జూన్ 21 వరకు)
ఈ ఏడాది ప్రారంభంలో మీకు కొన్ని ఇబ్బందికరపరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకండి. మీపై మీరు నమ్మకం పెంచుకోండి.

కర్కాటకం (జూన్ 22 నుంచి జూలై 22 వరకు)
కర్కాటక రాశి వారి జీవితంలో 2019లో వారి జీవితభాగస్వామి రానుంది. మీ అభిరుచులకు దగ్గరగా ఉన్న వారిపట్ల మీరు ఆకర్షితులయ్యే అవకాశం ఉంి.
ఇక ఈ ఏడాది ముగిసేలోపు మీ బంధం బలపడి మీరు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

సింహరాశి (జూలై 23 నుంచి ఆగష్టు 22 వరకు)
సింహరాశి వారు చాలా నమ్మకస్తులు. వీరు కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలవారు. సింహరాశి వారికి ఈ ఏడాది అంతా మంచే జరుగుతుంది. వారు తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. మీరు చేసే పనిపై ఎంత ఎక్కువ శ్రద్ధపెడితే అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. అందరితో బాగుంటే మీ బాంధవ్యాలు బాగుంటాయి.

కన్య (ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు)
2019 లో కన్యరాశి వారికి కెరీర్ పరంగా, బాంధవ్యాల పరంగా అనుకూలంగా ఉంటుంది. మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి. దాదాపు ప్రతి విషయంలోనూ మీకు మంచే జరుగుతుంది.

తులరాశి (సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు)
మీరు ఈ ఏడాది మంచి విషయాలతో పాటు చెడు విషయాలను కూడా చూస్తారు. మీరు గట్టిగా అనకుంటే చాలా వరకు జరుగుతాయి. వైవాహిక సంబంధం విషయంలోనూ మీరు గట్టిగా తలుచుకుంటే జరిగిపోతుంది.

వృశ్చికం (అక్టోబర్ 23 నుంచి నవంబరు 22 వరకు)
2019 మీరు మీ కెరీర్ విషయంలో అలాగే వ్యక్తిగత ప్రాజెక్టుల విషయంలో కొత్తఅవకాశాలను వెతికే క్రమంలో మీరు బిజీగా ఉంటారు. అయితే ప్రతి క్షణం మిమ్మల్ని మీరు ఒక అంచనా వేసుకుంటూ ఉండండి. ఏం చెయ్యాలి.. ఎలా కష్టపడాలి.. ఏ మార్గంలో వెళ్లాలనే విషయాలపై మీరు ఒక అవగాహనకురండి. తర్వాత ప్రయత్నాలు మొదలుపెట్టండి. విజయం మీనదే.

ధనస్సు నవంబర్ 23 నుంచి డిసెంబరు 21 వరకు)
2019 లో ధనస్సు రాశి వారు విజయఢంకా మోగిస్తారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి. విజయం సాధించండి. అయితే మీ విజయం వెనకున్న మనుషులను ఎప్పటికీ కూడా దూరం చేసుకోకండి.



Click it and Unblock the Notifications