Latest Updates
-
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.!
ఎయిర్ పోర్ట్ లో బిడ్డను మర్చిపోయిన తల్లి, వెనుదిరిగిన విమానం!
విమాన ప్రయాణాలలో మీకెప్పుడైనా అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయా ?
పిల్లలతో కలిసి ప్రయాణ౦ చేయడ౦ ఒక చక్కని అనుభూతిగా ఉండవచ్చు. కానీ బోర్డింగ్ ము౦దు మీ బిడ్డను మర్చిపోతే ఏమవుతుంది?

వినడానికి తిక్కగా అనిపిస్తుందా ? ఈ సంఘటన వింటే కొంచం ఇంచుమించు అలాగే అనిపిస్తుంది. మామూలుగా బోర్డింగ్ ముందు తరచుగా ఎవరైనా వస్తువులను మర్చిపోవడం చూస్తుంటాం. ఇటువంటి సమయాల్లో విమానం వెనుదిరగడం ఉండదు. కానీ ఈ మహిళ ఏకంగా తన బిడ్డనే మర్చిపోయింది.

విమానం గాలిలో ఎగిరాక కానీ గుర్తురాలేదు. . .
ఈ మహిళ తన బిడ్డను మర్చిపోయిన ఈ అరుదైన సంఘటన సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి మలేషియాలోని కౌలాలంపూర్ బయలుదేరిన విమానంలో జరిగింది.

ఆడియో విడుదలయింది…
అరబిక్ భాషలో ఎయిర్ కంట్రోల్ ఆపరేటర్లు మాట్లాడుకున్న ఈ ఆడియో రికార్డింగ్ బయటకు విడుదల కావడంతో విషయం నలుగురికీ తెలిసింది. ఆ ఆడియో రికార్డింగ్ వివరాల ప్రకారం, ఎయిర్ కంట్రోల్ ఆపరేటర్లు విమానం వెనుకకు రావడానికి గల కారణం ఏమిటని పైలట్ ను ప్రశ్నించి సమాధానం తెలుసుకున్నట్లుగా ఉంది. జరిగిన తప్పిదం గురించి వివరాలు తెలుసుకునేందుకు ఎయిర్పోర్ట్ స్టాఫ్ తెలుసుకునే ప్రయత్నాలలో ఉన్నారు.

ఈ కథనాన్ని ధృవీకరించాలని ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది పైలట్ను కోరారు . .
ఈ విషయాన్ని పైలట్ ధృవీకరించడానికి ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది పట్టుబట్టారు. ఈ విషయానికి పైలెట్ ఇలా సమాధానమిచ్చాడు, "మేము మీకు చెప్పాము, ఒక ప్రయాణీకురాలు తమ బిడ్డను విమానాశ్రయంలోనే మరచిపోయిందని, మరియు విమానాన్ని వెనుకకు మరల్చేందుకు పట్టుపడుతుందని" అని ఆ మెసేజ్ సారాంశం.

ఫ్లైట్ వెనక్కి మళ్లింది..!
నిర్ధారణ అయిన తర్వాత విమానం తిరిగి "కింగ్ అబ్దుల్ అజీజ్" అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరుగుముఖం పట్టడంతో, ఎట్టకేలకు తన బిడ్డను కలుసుకోగలిగింది.
కావున విమాన ప్రయాణాల సమయంలో ఒకటికి రెండుసార్లు పూర్తిగా పర్యవేక్షించుకునేలా సమయాన్ని కేటాయించుకోండి. ఎందుకంటే, అందరు పైలెట్లు ఒకేలా ఉండరు కదా.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను మీ వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.



Click it and Unblock the Notifications
