Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఏప్రిల్ నెలలో 6 గ్రహాల కదలికతో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!
ఏప్రిల్ మాసంలో గ్రహాల కదలికతో ఈ రాశుల వారికి ప్రయోజనాలుంటాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏప్రిల్ 2021 మాసంలో కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో బుధ గ్రహం తన స్థాన దిశను మార్చుకోనున్నాడు.

బుధుడితో పాటు మరో ఆరు గ్రహాలు కూడా తమ కదలికల్లో మార్పు చెందనున్నాయి. గ్రహాల అధిపతిగా భావించే సూర్యుడు, గ్రహాల సేనాధిపతిగా పరిగణించే అంగారకుడు మిధున రాశిలోకి ఆగమనం చేయనున్నారు.

ఈ గ్రహాలతో పాటు గ్రహాలలో అతిపెద్ద గ్రహంగా పిలువబడే గురుడు కుంభరాశిలోకి.. శుక్రుడు మేష రాశిలోకి రవాణా చేయనున్నారు. ఈ గ్రహాల స్థాన చలనం కారణంగా రాశిచక్రాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది.. మరికొన్ని రాశి చక్రాల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ నెలలో ఆరు గ్రహాల పరివర్తనం కారణంగా ఏ రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెలలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. ఆరు గ్రహాల మార్పులు వృషభరాశి వారి లైఫ్ లోని ప్రతి ప్రయత్నంలో విజయవంతం చేస్తాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. మరోవైపు ఉద్యోగులు ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.

మిధున రాశి..
ఈ రాశి బుధ గ్రహం యొక్క స్థాన చలనం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఏప్రిల్ ఆరో తేదీ నుండి గురుడు తన స్థాన దిశను మార్చుకోవడం వల్ల, వీరికి చాలా లక్కీ కలిసి వస్తుంది. మీ ఇంట్లో శుభకార్యక్రమాలు జరగొచ్చు. ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వివాహానికి మీ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు భారీ లాభాలను పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ వంటివి సాధిస్తారు.

తుల రాశి..
ఏప్రిల్ మాసంలో గ్రహాల మార్పు కారణంగా, ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీకు కుటంబ జీవితంలో కొన్ని బాధ్యతలు రావొచ్చు. మీ బంధువుల నుండి మీకు అన్ని రకాల మద్దతు లభిస్తుంది. మీరు పూర్తిగా అంకితభావం, సామర్థ్యంతో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈ సమయంలో ఖర్చులు పెరగొచ్చు. కానీ అవన్నీ ప్రయోజనకరంగానే ఉంటాయి. మీరు మీ పిల్లల గురించి అన్ని బాధ్యతలను చాలా విజయవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి ఏప్రిల్ మాసంలో ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. సమాజంలో మీ ప్రభావం కూడా పెరుగుతుంది. మీరు నూతన ప్రణాళికలు ప్రారంభించుకుంటారు. మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా పూర్తి చేస్తారు. గ్రహాల స్థాన చలనం కారణంగా, ఈ రాశుల వారికి ఈ కాలంలో కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి.

కుంభ రాశి..
ఏప్రిల్ నెలలో గ్రహాల మార్పు వల్ల కుంభరాశి వారికి చాలా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారులు అకస్మాత్తుగా భారీ లాభాలను పొందొచ్చు. మీకు చాలా విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొన్ని మంచి ఒప్పందాలను కుదుర్చుకుంటారు. మీరు పెట్టుబడిలో లాభం పొందాలని భావిస్తే.. అందులో విజయం సాధించొచ్చు. దీంతో పాటు ఉద్యోగులకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి.

మీన రాశి..
ఏప్రిల్ మాసంలో గ్రహాల స్థాన చలనం వల్ల మీన రాశి వారు ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలను పొందుతారు. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీరు ఈ కాలంలో ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో పని విషయంలో పురోగతి లభిస్తుంది. మీరు చేసే పనుల్లో ప్రతి ఒక్కరూ మీకు మద్దతు ఇస్తారు. దీని వల్ల మీరు మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు.



Click it and Unblock the Notifications
