For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాతోనే అందరూ కలవరపడుతుంటే మరో బాంబు పేల్చిన బాల బ్రహ్మ అభిగ్య...!

|

గమనిక : ఈ ఆర్టికల్ ను అభిఘ్య ఆనంద్ అనే బాలుడు తన యూట్యూబ్ లో చెప్పిన విషయాల ఆధారంగా మరియు ఇంటర్ నెట్, సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని అనుసరించి మాకు ఉన్న నాలెడ్జ్ ను జోడించి రాస్తున్నది. ఇందులో ఎవ్వరినీ కించపరిచే.. ఎవరికి పక్షపాతం వహించే కార్యక్రమం వంటివి ఏమి లేవని గుర్తుంచుకోవాలని మనవి.

ప్రస్తుతం కరోనా వైరస్ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాదాపు నెలరోజులకు పైగా దీనిపేరు ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి నిద్రపోయే వరకు తలచుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది. ఎందుకంటే ప్రజలందరినీ ఇది అష్టకష్టాలు పెడుతోంది. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలాంటి పరిస్థితులను గత సంవత్సరంలోనే ఊహించాడో బాల బ్రహ్మ. అతనే అభిఘ్య ఆనంద్.

తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో భవిష్యత్తుకు సంబంధించి తను ఎప్పటి నుంచో వీడియోలను పెడుతున్నా అప్పట్లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. అప్పుడు అందరూ తనని లైట్ తీసుకున్నారు. అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గ్రహాల మార్పుల కారణంగా వచ్చే పరిణామాల గురించి.. ముఖ్యంగా కరోనా వైరస్ గురించి ఎనిమిది నెలల కిందే హెచ్చరించాడు.

అయితే ఈ పిల్లాడు అత్యంత చిన్న వయసులోనే అనేక జ్యోతిష్యశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఇంత చిన్న వయసులోనే ఈ బాలబ్రహ్మ పెద్ద పెద్ద విద్యా సంస్థలకు వెళ్లి క్లాసులు చెప్పేవాడంట. దీన్ని బట్టి తన సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

బాల బ్రహ్మగా బాగా పాపులర్ అయిన అభిఘ్య ఆనంద్ ప్రస్తుతం ఏమి చెప్పినా నెటిజన్లతో పాటు సామాన్య జనం సైతం ఈ కర్నాటక వేద విద్యార్థి వైపు చాలా శ్రద్ధగా చూస్తున్నారు. వీటిని ఇంత కరెక్టుగా ఎలా అంచనా వేశాడా అని అందరూ నోరెళ్లబెడుతున్నారు.

ఈ సంవత్సరం మే నెలఖారులోపు కరోనా వైరస్ తీవ్రత కొంత తగ్గుతుందని చెప్పాడు. అయితే దీని బారి నుండి బయటపడేందుకు చాలా దేశాలు కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుందని కూడా చెప్పాడు.

ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మరో మహమ్మారి..

మరో మహమ్మారి..

ఇది ఇలా ఉండగా అభిఘ్య ఆనంద్ తాజాగా మరో సంచలన విషయం బయటపెట్టడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఇదే సంవత్సరంలో డిసెంబర్ నెలలో కరోనాను మించి మరో భయంకరమైన మహమ్మారి రాబోతుందని చెప్పాడు.

చాలా శ్రమించాలి..

చాలా శ్రమించాలి..

ఇది మానవాళికి పెనుముప్పుగా మారే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తెలిపాడు అభిఘ్య. అది ఎంత కాలం ఉంటుందో మరియు వాటి వివరాలేంటో కూడా చెప్పేశాడు. 2020 డిసెంబర్ నుండి 2021 ఏప్రిల్ నెల వరకు ప్రపంచ మానవాళిని బాగా ఇబ్బంది పెడతాయట. కరోనా వైరస్ కంటే దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించాడు. దీన్ని తట్టుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుందని కూడా చెప్పేశాడు.

అభిఘ్య సూచనలు..

అభిఘ్య సూచనలు..

అయితే ఈ మహమ్మారి నుండి బయట పడేందుకు ఒకేఒక మార్గం ఉందని కూడా చెప్పాడు. అది ఏంటంటే మానవులందరూ తమ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించాడు. ఇదొక్కటే దాని నుండి తప్పించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం అని చెప్పేశాడు.

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

విదేశీ ఆహారాన్ని విడనాడాలని..

విదేశీ ఆహారాన్ని విడనాడాలని..

అలాగే చైనా ఫాస్ట్ ఫుడ్, అమెరికాతో పాటు ఇతర దేశాల ఆహారం అయిన పిజ్జా, బర్గర్లు వంటి వాటిని తినడం మానుకోవాలంట. వాటికి బదులుగా ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకుంటే మేలు జరుగుతుందని చెప్పాడు. ఆయుర్వేదం మరియు పాక శాస్త్రం ప్రకారం కొర్రలు, సజ్జలు, రాగులతో కూడిన పోషకాహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెప్పాడు. ఇదే మనందరికీ దివ్య ఔషధంగా పని చేస్తుందని కూడా చెప్పాడు.

డిసెంబర్ హెచ్చరిక..

డిసెంబర్ హెచ్చరిక..

ఇప్పటికే అభిఘ్య చెప్పిన ప్రకారం చాలా వరకు నిజమే జరిగింది. దీంతో డిసెంబర్ గురించి ఇప్పుడే ఈ బాల బ్రహ్మ హెచ్చరించడంతో చాలా మంది ఇది కూడా నిజమైతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కరోనా విషయంలో ఈ బాల జ్యోతిష్యుడు చెప్పిన విషయాలన్నీ వందశాతం నిజమయ్యాయని చాలా మంది నమ్ముతున్నారు.

అభిఘ్య బాటలోనే..

అభిఘ్య బాటలోనే..

అభిఘ్య ఆనంద్ ఈ హెచ్చరికలు చేయడంతో ఇతర పండితులు కూడా ఈ బాటనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ బగ్ ల దాడి ఎంతవరకు నిజం? ఈ మహమ్మారి ఏ దేశం నుండి ప్రారంభమవుతుంది అనే విషయాలపై ఫోకస్ పెట్టారు.

English summary

Abhigya Anand Latest Prediction on Coronavirus

Here we talking about abhigya anand latest prediction on coronavirus. Read on
Desktop Bottom Promotion