Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Akshaya Tritiya 2023:అక్షయ తృతీయ రోజున మీ రాశిని బట్టి వీటిని కొంటే..అద్భుత ప్రయోజనాలు...!
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.

ఈ ఏడాది అంటే 2023లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు ఉదయం 7:49 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23వ తేదీన తెల్లవారు జామున 12:21 గంటల వరకు కొనసాగనుంది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు.

ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు. అలాగే ఈ పవిత్రమైన రోజున కొత్త పనులు ప్రారంభించడం, శుభకార్యాలు చేయడం, కొత్త వ్యాపారాలు చేయడం వంటివి చేస్తారు.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అలాగే దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ పవిత్రమైన రోజున ద్వాదశ రాశుల వారు ఏమి చేయాలి.. ఏయే వస్తువులను కొనాలి. ఒక్కో రాశి వారు బంగారంతో పాటు ఎలాంటి వస్తువులు కొంటే శుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున ఎర్రని వస్తువులను లేదా ఎర్రని దుస్తులను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విశేష ఫలితాలు రావొచ్చు.

వృషభ రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున చిరు ధాన్యాలు లేదా బియ్యాన్ని కొనుగోలు చేయాలి. దీంతో మీ కుటుంబ జీవితంలో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయి.

మిధున రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజు కొత్త బట్టలను కొనుగోలు చేయాలి. అలాగే తాజా కొత్తిమీరను కొంటే మీకు శుభ ఫలితాలు వస్తాయి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి.. కర్కాటక రాశి వారు అక్షయ తృతీయ రోజున బియ్యం లేదా పాలను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో పురోగతి లభిస్తుంది.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి.. సింహ రాశి వారు అక్షయ తృతీయ రోజున రాగి పాత్రలను లేదా ఎరుపు రంగు వస్తువులను కొనుగోలు చేయాలి. దీని వల్ల మీకు మంచి ఫలితాలొస్తాయి.

కన్య రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున పప్పులు, గింజలను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో కచ్చితంగా పురోగతి లభిస్తుంది.

తుల రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున బియ్యం లేదా చక్కెరను కొనుగోలు చేయాలి. దీని వల్ల మీ జీవితం ఆనందకరంగా మారుతుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున బెల్లం లేదా స్వచ్ఛమైన తాగునీటిని కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విశేష ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి.. ధనస్సు రాశి వారు అక్షయ తృతీయ రోజున అరటిపండును లేదా పసుపు రంగులో ఉన్న బియ్యాన్ని కొనాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి.

మకర రాశి..
ఈ రాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి.. మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున పప్పును కొనాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశి వారికి కూడా శని దేవుడే అధిపతిగా ఉంటాడు కాబట్టి.. కుంభ రాశి వారు అక్షయ తృతీయ రోజున నల్ల నువ్వులను లేదా నల్లని రంగులో ఉండే బట్టలను కొనాలి.

మీన రాశి..
ఈ రాశి వారుడు గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి.. ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున స్వచ్ఛమైన పసుపును కొనడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి.
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది.ఈ పవిత్రమైన రోజున ద్వాదశ రాశుల వారు ఏమి చేయాలి.. ఏయే వస్తువులను కొనాలి. ఒక్కో రాశి వారు బంగారంతో పాటు ఎలాంటి వస్తువులు కొంటే శుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.



Click it and Unblock the Notifications
