For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రాన్స్ జెండర్లకు ఇల్లు అద్దెకు ఇవ్వకుంటే జైలుకు వెళ్లాల్సిందేనా?

ట్రాన్స్ జెండర్స్ వర్గాలపై హింస మరియు వివక్ష కొనసాగుతూనే ఉంది. వారికి ఇంటిని అద్దెకు ఇవ్వడం వంటి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను సైతం తిరస్కరించారు.

|

ట్రాన్స్ జెండర్లకు ఇల్లు అద్దెకు ఇవ్వకుంటే జైలుకు వెళ్లాల్సిందేనా? అదేంటి వారికి ఇల్లు అద్దెకు ఇవ్వకుంటే మేమేందుకు శిక్ష అనుభవించాలి అని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే బీహార్ ప్రభుత్వం హిజ్రాల కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది. లింగమార్పిడి చేయించుకున్న వారిజోలికిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందేనని యజమానులకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు తాము అందరి హక్కులను కాపాడతామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ట్రాన్స్ జెండర్ల(హిజ్రా)పై భారతదేశంలో వివక్షకు హద్దులే లేవు. అందుకే ఎల్ జిబిటిక్యూ సంఘం ఇందుకు వ్యతిరేకంగా గట్టిగా తమ వాదనలు వినిపించింది. 2018 నాటి లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) బిల్లుతో సమాజాన్ని పరిరక్షించాలనే ఉద్దేశాలపై నిరసన వ్యక్తం చేసింది. లింగమార్పిడి చేసేవారిని మూడో లింగం వారిగా గుర్తించవచ్చని 2014లోనే అంటే ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ప్రకటించింది. లింగమార్పిడి సమాజం ఎల్లప్పుడూ భారతీయ సంస్కృతిలో భాగమే కానీ మన దేశంలో ఇలాంటి వాటిని అనుమానస్పదంగా మరియు అసహజంగా, హింసాత్మకంగా కూడా చూస్తారు.

అయినా కూడా ట్రాన్స్ జెండర్స్ వర్గాలపై హింస మరియు వివక్ష కొనసాగుతూనే ఉంది. వారికి ఇంటిని అద్దెకు ఇవ్వడం వంటి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను సైతం తిరస్కరించారు. 2015లో ముంబైలోని జోగేశ్వరిలోని ఒక అపార్ట్ మెంట్ నుండి ఒక హిజ్రాను బలవంతంగా బయటకు పంపేశారు. ఆమెపై లైంగికపరమైన ఆరోపణలు చేశారు. అలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు బీహార్ ప్రభుత్వం పునరాలోచన చేసింది. బీహార్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది.

Bihar - The First State In India Where Denying Housing To Transpersons Is Illegal

అందులో ఏముందంటే ట్రాన్స్ జెండర్లు గృహనిర్మాణాలకు (అద్దెకు ఇవ్వడం లేదా కొనడం) సంబంధించి పూర్తి స్వేచ్ఛను కల్పించింది. ఇలా చేసిన తొలి రాష్ట్రంగా బీహార్ రికార్డు నెలకొల్పింది. వీరి గృహ హక్కులను ఎవరైనా తిరస్కరిస్తే లేదా ఏవైనా షరతులు విధిస్తే వారు ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని సుశీల్ కుమార్ మోడీ గట్టిగా నొక్కి వక్కాణించారు. ట్రాన్స్ జెండర్లకు వారి వర్గంలోని సభ్యులకు ఇళ్లను, ఫ్లాట్లను అద్దెకు ఇవ్వడానికి నిరాకరించే వారందరికీ రెండు నుంచి ఆరేళ్ల వరకు జైలు శిక్ష పడేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. అంతేకాదు ఆ రాష్ట్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్ర లింగ మార్పిడి సంక్షేమ మండలిని కూడా ఏర్పాటు చేసింది. ఈ మండలి ఇతర రాష్ట్రాల్లోని సభ్యులకు అందుతున్న సౌకర్యాలను కూడా పరిశీలిస్తుంది. ఇటీవల ఈ చట్టంతో పాటు 2018లో బీహార్ లింగ మార్పిడి వర్గాలకు సంరక్షణ గృహాలలో నివసించే మహిళలు మరియు బాలికలను రక్షించడానికి అవకాశం కల్పించింది.

ట్రాన్స్ జెండర్లను పదే పదే అసౌకర్యమైన మరియు అనవసరమైన ప్రశ్నలను అడిగే భూస్వాములు మరియు ఆస్తి ఏజెంట్ల నుండి సాధారణ అద్దె రేటుకు రెట్టింపు చెల్లించమని వంటి నిత్యం వేధింపుల కారణంగా బీహార్ ప్రభుత్వం ఈ బలమైన చర్యను తీసుకుంది. వీటన్నింటినికీ అడ్డుకట్ట వేసేందుకు బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. 21వ శతాబ్దంలో సమాజం ఎదుర్కోవాల్సిన నిర్లక్ష్య వివక్షను నిర్మూలించేందుకు, సమాజంలో అందరినీ గౌరవించటానికి ఇతర రాష్ట్రాలు అనుసరించేందుకు ఇదొక చక్కని చర్యగా ఉపయోగపడుతుంది.

English summary

Bihar - The First State In India Where Denying Housing To Transpersons Is Illegal

The Bihar government has taken this strong step due to frequent harassment by landlords and property agents who ask transgender people repeatedly uncomfortable and unnecessary questions. Everybody appreciates the decision of the Bihar government to block all these.
Desktop Bottom Promotion