అత్యాచారానికి పాల్పడిన వారిపై అత్యంత క్రూరమైన శిక్షలు వేసే దేశాలివే..

మన దేశంలోనూ నిర్భయ ఘటన తర్వాత మన పాలకులు మేలుకున్నారు. ఆ ఘటన తర్వాత చట్టంలో మార్పులు చేశారు. మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో లైంగిక దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నారు.

మన దేశంలో నిర్భయ ఘటన తర్వాత హైదరబాద్ లోని డాక్టర్ ప్రియాంక రెడ్డిని రేప్ చేసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో నలుగురు నేరస్తులను అదే సంఘటనా స్థలంలో రీ కన్ స్ట్రక్షన్ పేరుతో ఎన్ కౌంటర్ చేయడంతో భారతవని అంతా తెలంగాణ పోలీసులకు జేజేలు పలుకుతోంది.

Brutal Punishments Against Rape All Over The World

అయితే అత్యాచారానికి సంబంధించి భారతదేశం కంటే ప్రపంచంలోని పలు దేశాల్లోఇంతకంటే క్రూరమైన శిక్షలు ఉన్నాయి. వాటి పేర్లు వింటేనే ఒళ్లు జలధరిస్తుంది. అవి అంత భయంకరంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో బహిరంగంగా తలను నరికేస్తే.. మరికొన్ని దేశాల్లో ఎన్ కౌంటర్లు, బహిరంగ ఉరి శిక్షలు వంటివి వేస్తున్నారు. ఈ సందర్భంగా ఏయే దేశాల్లో ఎలాంటి క్రూరమైన శిక్షలు ఉన్నాయో తెలుసుకుందాం...

నిర్భయ కేసు...

నిర్భయ కేసు...

మన దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత భారతదేశంలోనూ అత్యాచార చట్టాన్ని కఠినంగా మార్చిన విషయం చాలా మందికి తెలుసు. నిర్భయ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా అమ్మాయిలను వెంటాడినా, వేధించినా నేరంగానే పరిగణిస్తారు. అయితే మన దేశంలో అత్యాచారం చేసిన ప్రతి ఒక్కరికి ఉరి శిక్ష విధించే అవకాశం లేదు. అయితే నిర్భయ కేసులో నిందితులకు మాత్రం ఉరి శిక్ష పడింది. అలాగే మరికొన్ని కేసుల్లో తీవ్రతను బట్టి ఉరి శిక్షలు విధిస్తున్నారు. మిగతా అత్యాచార ఘటనల్లో నేరస్తులు సాధారణ శిక్షలు మాత్రమే అనుభవిస్తున్నారు. దీని వల్ల బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదనే భావన భారతదేశంలోని చాలా మందిలో ఉంది. అయితే ‘దిషా‘ ఘటనలో రేపిస్టులను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ప్రపంచంలో ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలు అమలు చేస్తున్నారో ఓ సారి చూద్దాం.

భారత్ లో 14 ఏళ్లు లేదా మరణ శిక్ష..

భారత్ లో 14 ఏళ్లు లేదా మరణ శిక్ష..

మన దేశంలోనూ నిర్భయ ఘటన తర్వాత మన పాలకులు మేలుకున్నారు. ఆ ఘటన తర్వాత చట్టంలో మార్పులు చేశారు. మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో లైంగిక దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో అత్యాచార నేరగాళ్లకు 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. నేర తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఉరి శిక్షను వేస్తున్నారు.

ఆఫ్ఘన్ లో అత్యంత వేగంగా..

ఆఫ్ఘన్ లో అత్యంత వేగంగా..

ఆఫ్ఘనిస్థాన్ దేశంలో మహిళలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వస్తేనే భయం కలిగేలా అక్కడ శిక్షలు అమలు చేస్తారు. ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే అక్కడ పశువు కంటే హీనంగా, ఈ నేరస్తుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఉరి వేస్తారు. లేదా నేరస్తుడి తలకు తుపాకి పెట్టి కాల్చి చంపుతారు. అది కూడా నేరం చేసిన నాలుగు రోజుల్లోనే నేరస్తుడిని యమలోకానికి పంపుతారు.

ఫ్రాన్సులో 15 - 30 ఏళ్లు జైలు శిక్ష..

ఫ్రాన్సులో 15 - 30 ఏళ్లు జైలు శిక్ష..

ఫ్రాన్సు దేశంలో అత్యాచార నేరగాళ్లకు 15 నుండి 30 ఏళ్లు జైలు శిక్ష వేస్తారు. అత్యాచారం తీవ్రత, బాధితురాలు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి ఇక్కడ శిక్షను వేస్తారు. కొన్ని సందర్భాల్లో యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధిస్తారు.

ఉత్తర కొరియాలో గన్ తో కాల్చేస్తారు..

ఉత్తర కొరియాలో గన్ తో కాల్చేస్తారు..

ఈ దేశంలో రేపిస్టులకు చాలా నరకం చూపుతారు. అత్యాచారం చేసినట్లు నేరం రుజువైతే తలపై గన్ పెట్టి కాల్చుతారు. లేదా ఒళ్లంతా బుల్లెట్లు దింపి అత్యంత దారుణంగా చంపేస్తారు.

అగ్ర రాజ్యం అమెరికాలో..

అగ్ర రాజ్యం అమెరికాలో..

అమెరికాలో రెండు రకాల కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. ఇవి రెండు కూడా అత్యాచారాలను తీవ్రంగానే పరిగణిస్తాయి. అవి ఏంటంటే ఒకటి ఫెడరల్ లా, రెండోది స్టేట్. ఈ చట్టాల ప్రకారం అత్యాచారానికి పాల్పడే నేరగాడికి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. నేరం తీవ్రమైనదైతే చనిపోయేంత వరకు శిక్ష విధిస్తారు.

రష్యాలో సాధారణ శిక్షలు..

రష్యాలో సాధారణ శిక్షలు..

ప్రపంచంలో అత్యంత సాధారణ శిక్షలు రష్యా దేశంలో అమలు చేస్తున్నారు. అత్యాచార నేరగాళ్లకు కేవలం 3 నుండి 6 ఏళ్లు మాత్రమే జైలు శిక్ష వేస్తున్నారు. అది మరీ తీవ్రమైన అత్యాచారం అయితే 10 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు.

సౌదీలో తలను నరకడం..

సౌదీలో తలను నరకడం..

ప్రపంచంలోనే అత్యంత దారుణమైన శిక్షలు ఈ దేశంలోనే ఉన్నాయి. సౌదీ అరేబియాలో అత్యాచార నేరాలకు పాల్పడిన వారి తలను బహిరంగంగా నరికేస్తారు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా ఉరి వేస్తారు. డ్రగ్స్ వంటి నేరాలకు పాల్పడినా కూడా అక్కడ అవే శిక్షలను వేస్తారు. విదేశీయులను సైతం వీరు ఏ మాత్రం క్షమించకుండా ఈ శిక్షను అమలు చేస్తారు.

ఇరాన్ లో కాల్చి చంపుతారు..

ఇరాన్ లో కాల్చి చంపుతారు..

అత్యాచార నేరగాళ్లను ఇరాన్ కఠినంగా శిక్షిస్తుంది. నేరం రుజువైతే మూడు రకాలు శిక్షను అమలు చేస్తుంది. నేర తీవ్రతను బట్టి నేరస్తుడికి ఉరి శిక్ష లేదా తుపాకులతో బహిరంగంగా కాల్చడం లేదా కాల్చి చంపడం వంటివి చేస్తుంది.

10. గ్రీసులో జైలు శిక్ష..

10. గ్రీసులో జైలు శిక్ష..

గ్రీస్ దేశంలో అత్యాచారం వంటి నేరాలకు పాల్పడితే అతనికి జీవితాంతం జైలు శిక్ష వేస్తారు.

ఈజిప్టులో బహిరంగ ఉరి..

ఈజిప్టులో బహిరంగ ఉరి..

ఈ దేశంలో అత్యాచారం చేసిన వ్యక్తిని బహిరంగ ప్రదేశాల్లో ఉరి తీస్తారు. తద్వారా ఈ ఘోరమైన నేరం యొక్క పరిణామాల గురించి ప్రజలకు వివరిస్తారు.

నార్వేలో 4 నుండి 15 ఏళ్లు..

నార్వేలో 4 నుండి 15 ఏళ్లు..

నార్వే దేశంలో అత్యాచారం చేసిన వ్యక్తికి, బాధితులకు జరిగిన నష్టాన్ని బట్టి నాలుగు నుండి 15 సంవత్సరాలకు నిర్బంధ శిక్షను వేస్తారు.

ఇజ్రాయెల్ లోనూ నాలుగేళ్లు..

ఇజ్రాయెల్ లోనూ నాలుగేళ్లు..

ఈ దేశంలో అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు నాలుగు సంవత్సరాల నుండి గరిష్టంగా 16 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు.

Desktop Bottom Promotion