Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
నిజజీవితంలో చేసే తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారని చాణక్యుడు వివరించాడు. ఆ తప్పుల వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు గొప్ప జ్ఞాని. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రాల్లో లోతైన జ్ఞాన ఉన్న వ్యక్తి. ఆయన రచించిన చాణక్య నీతిలో ఎన్నో విషయాల గురించి వివరంగా చెప్పారు. జీవితం గురించి, జీవితంలోని ఎన్నో అంశాల గురించి ఎన్నో వివరాలు చెప్పారు. జీవితం సాఫీగా, ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా సాగేందుకు ఎలాంటి పనులు చేయాలో చక్కగా చెప్పాడు.

మనిషి సంతోషకరమైన జీవితానికి, కష్టాలను దూరం చేయడానికి కొన్ని విధానాలను రూపొందించాడు. వాటి గురించి చాణక్య నీతి పుస్తకంలో వివరించాడు. ఈ విధానాలను అవలంబించడం ద్వారా విజయ శిఖరాలను చేరుకోవచ్చు. నిజజీవితంలో చేసే తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారని చాణక్యుడు వివరించాడు. ఆ తప్పుల వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

విచ్చలవిడి ఖర్చు:
ఆచార్య చాణక్యుడి ప్రకారం డబ్బును అనవసరంగా ఖర్చు చేసేవారు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందలేరు. ఆర్థిక సమస్యలు అటువంటి వ్యక్తికి వచ్చినప్పుడు వారు వాటి నుండి అంత సులభంగా బయటపడలేరు. అలాంటి వాళ్లే తమ నాశనానికి దారులు తెరుస్తారని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి ఎప్పుడూ సరైన స్థలంలో, సరైన సమయంలో ఖర్చు చేయాలని చాణక్యుడు సూచించాడు.

వంట గ్యాస్‌పై తప్పుడు పాత్రలు:
చాణక్యుడి ప్రకారం పొరపాటున కూడా వంట గ్యాస్‌పై తప్పుడు పాత్రలు ఉంచకూడదు. లక్ష్మీ దేవికి తప్పుడు సమానులు పొయ్యి మీద లేదా దగ్గర ఉంచినా కోపం వస్తుంది. ఇది ఇంటి ఆనందం, శాంతిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. గౌరవం తగ్గడం మొదలవుతుంది. ఇంట్లో పేదరికం ఉంటుంది. లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

సూర్యాస్తమయం తర్వాత ఇళ్లు ఊడవడం:
సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడిస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట ఇల్లు ఊడ్చకూడదని చాణక్యుడు చెప్పాడు. నిజానికి చీపురు లక్ష్మీ దేవినికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే సాయంత్రం పూట ఊడవడం మానుకోవాలి. ఒకవేళ సాయంత్రం వేళ ఇల్లు ఊడవలసి వస్తే చెత్తను బయట పడేయకూడదని చాణక్యుడు సూచించాడు. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత చెత్తను బయట పడేయవచ్చని చెప్పాడు.

ప్రవర్తన:
ఆచార్య చాణక్యుడి ప్రకారం పెద్దలను, పండితులను, స్త్రీలను, పేదలను వేధింపులకు గురి చేయడం చెడు ప్రవర్తన. అలాంటి ప్రవర్తన వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుందని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారి వద్ద లక్ష్మీ దేవి ఉండటానికి ఇష్టపడదని వెల్లడించాడు. తల్లిదండ్రులు, గురువులతో అనుచిత భాషలో మాట్లాడే వారు కూడా లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారని చెప్పాడు చాణక్యుడు. అందుకే ఎవరిని పలకరించినా పూర్తి గౌరవం ఇవ్వాలని వివరించాడు. తర తమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించినప్పుడు తిరిగి గౌరవం పొందగలుగుతారని, అలాంటి వ్యక్తుల వద్దే లక్ష్మీ దేవి ఉండటానికి ఇష్టపడుతుందని కౌటిల్యుడు చెప్పాడు. లక్ష్మీ దేవికి ఇష్టంలేని ఇలాంటి పనులు చేయడం వల్ల త్వరలోనే ఆర్థిక సమస్యలు వస్తాయని చాణక్యుడు హెచ్చరించాడు.



Click it and Unblock the Notifications
