Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
కరోనా లాక్ డౌన్ : కిక్కు దొరక్క అల్లాడిపోతున్న మందుబాబులు...!
కనీసం చుక్క మందు దొరకకుండా పోయింది. దీంతో తాము ప్రత్యక్షనరకం అనుభవిస్తున్నామని కొందరు మందుబాబులు వాపోతున్నారు.
'మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం.. మందు అంతా దిగేదేకా లోకాలే పాలిస్తాం' అంటూ ఎప్పుడూ ఎంజాయ్ చేసే మందుబాబులకు ప్రస్తుతం పొద్దు అనేదే పోవట్లేదు. ఎందుకంటే కరోనా వైరస్ మందుబాబుల ప్రాణం మీదకు తెచ్చేసింది. చాలా మంది మందుబాబులకు ఆల్కహాల్ దొరక్క అల్లాడిపోతున్నారు. కనీసం బ్లాకులో కొందామన్నా కూడా వారికి ఎక్కడా దొరకడం లేదట.

అందుకే కొందరు సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్ జగన్ లనే విన్నవించుకుంటున్నారు. అంతేకాదు టిక్ టాక్ లు, మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచినట్టే వైన్స్ షాపులు తెరవడానికి కూడా కొన్ని గంటల పాటు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

మందు దొరక్క..
కేవలం ఒక్కరోజే కర్ఫ్యూ అనుకుని మందు బాబులు అడ్జస్ట్ అయితే ప్రధాని మోడీ ఏకంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో మందుబాబుల పరిస్థితి మందు దొరక్క కక్కలేక.. మింగలేక అన్న పరిస్థితిలా తయారయ్యిందట.. ఎక్కడా మందు దొరక్క విలవిలలాడిపోతున్నారు.

వింత ప్రవర్తన..
ప్రతిరోజూ మద్యం తాగే మందు బాబులు అకస్మాత్తుగా అది దొరకకపోవడంతో వింత వింతగా ప్రవర్తిస్తున్నారట. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా మంది మందు తాగకపోవడంతో తమకు ఏమి తోచడం లేదని అంటున్నారు. మరికొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరుతున్నారు.

ఒకరిద్దరు ఆత్మహత్య...
మందుబాబులు మద్యం దొరకకపోవడంతో తమ ప్రాణాలను చేతులారా పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో మందు దొరక్క ఒకరిద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి మందు షాపు వద్దే తన చేయి కోసేసుకున్నాడు.

లూటీ చేసేందుకు..
మందు బాబులు తమకు కిక్కు ఎక్కడం లేదని, తాము ఎంత డబ్బులు చెల్లించడానికి అయినా సిద్ధంగా ఉన్నామని షాపు యజమానులను వేడుకొంటున్నా.. ఎవ్వరూ వైన్స్ షాపులను సాహసం చేయడం లేదు. అయితే సహనం కోల్పోయిన కొందరు మందుబాబులు ఏకంగా షాపులను లూటీ చేసేందుకు కూడా ప్రయత్నించారట. ఇటీవలే ఇలాంటి సంఘటనలు రెండు, మూడు చోట్ల జరిగాయట.

కిక్కు కోసం..
నగరాలు, పట్టణాల్లో ఉండే మందుబాబులు కిక్కు దొరక్క అల్లాడిపోతుంటే.. గ్రామాల్లో, మిగిలిన ఊళ్లల్లో కల్లు, నాటుసారా, గుడుంబా కోసం జనాలు క్యూ కడుతున్నారట. ఇక ఈత కల్లు కోసం అయితే ఉదయాన్నే చెట్ల దగ్గరికి వెళ్లిపోతున్నారట. వీటిలో ఏ ఒక్కటి తాగిని నిషా ఎక్కుతుంది కాబట్టి, తమకు అదే చాలన్నట్టుగా అవే తాగేస్తున్నారట.

వీటికి డిమాండ్...
ఇదే అదనుగా నాటుసారా, గుడుంబా, కల్లు వ్యాపారులంతా వీటి ధరలను అమాంతం పెంచేశారట. సాధారణంగా సుమారు 20 రూపాయలుంటే సీసా లేదా గ్లాసు ధర ప్రస్తుతం 50 రూపాయల వరకు పెంచేశారట. అయినా మందుబాబులు ఆ ధరను ఏ మాత్రం లెక్క చేయకుండా తాపీగా తాగేస్తున్నారట.

కల్తీ కల్లు...!
ఇకపోతే కొన్ని గ్రామాల్లో కల్తీ కల్లు కూడా ఏరులై పారుతోందట. నాటుసారా, గుడుంబా అనే తేడా లేకుండా మందుబాబులు ప్రతిరోజూ గ్రామాలు, ఊళ్లలో గుట్టు చప్పుడు కాకుండా తాగేస్తున్నారట. మరోవైపు ఖరీదైన ఫారిన్ బ్రాండ్లు తాగే వారు కూడా తమకు ఏ చీప్ లిక్కర్ దొరికినా చాలు అని అడ్జస్ట్ అయిపోతున్నారట.

ఓ ఫేక్ న్యూస్ హల్ చల్..
అంతే కాదు సోషల్ మీడియా గ్రూపుల్లో నెల రోజులకు సరిపడా మందు ముందుగానే కొనుక్కోవాలని ఓ ఫేక్ న్యూస్ తెగ చక్కర్లు కొట్టిందట. అయితే ఇది చూసి సంతోషంగా వైన్స్ షాపులకు వెళ్లిన వారందరికీ నిరాశే ఎదురైందట. ఎందుకంటే అది ఓ ఫేక్ సమాచారం. ఈ విషయం తెలియగానే మందుబాబులు తెగ బాధపడిపోయారంట.



Click it and Unblock the Notifications