For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (10-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 10, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

వాస్తు ప్రకారం, మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే స్త్రీలు ఈ విధంగా చేయాలి...వాస్తు ప్రకారం, మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే స్త్రీలు ఈ విధంగా చేయాలి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఈ ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు పనిపై పూర్తి శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. మీ సీనియర్లు మీకు కొంత స్వచ్ఛంద బాధ్యతను మీకు అప్పగించవచ్చు. మీరు మీ సహోద్యోగులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ రోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం బాగుంటుంది. మీరు ఈరోజు మీ కుటుంబంతో చాలా మంచి సమయం గడుపుతారు. ఈ రోజు వినోదం కోసం మీరు ఇంట్లో ఒక చిన్న ప్లాన్ చేయవచ్చు. ఇది మీ ప్రియమైన వారితో ఉన్న అన్ని వివాదాలను తొలగిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు అదనపు ఆదాయాన్ని సంపాదించగలరు. ప్రేమ జీవిత భాగస్వామిలో సంబంధం ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఆత్మ విశ్వాసంతో ఉండాలి. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్థికంగా ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది. ఈ రోజు మీకు మీ తండ్రి నుండి ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. అయితే ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు అదనపు పని భారం ఉండే అవకాశం ఉంది. అయితే మీ ప్రియమైన వారి మద్దతుతో మీరు మీ పనిని ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయగలుగుతారు. అదే సమయంలో, వ్యాపారులు ఈ రోజు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...మీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు వీలైనంతవరకు ఇంటి నుండి బయటకు వెళ్లకండి. కుటుంబ పరంగా ఈరోజు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసరంగా ఖర్చులు చేయకండి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఈరోజు అదనపు ఆదాయాన్ని సంపాదించ డానికి మంచి అవకాశాన్ని పొందవచ్చు. అయితే మీ ఖర్చులను కూడా నియంత్రించుకోవాలి. మీ కుటుంబంలో ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు మీ ఇంట్లోని సభ్యుల భావాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఈరోజు మీరు మానసిక ఆనందం పొందుతారు. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు నిరంతరం చేసే ప్రయత్నాలు విఫలం కావచ్చు. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందలేక పోవచ్చు. అయితే ఈరోజు వ్యక్తిగతంగా కొంత అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో సమస్యలను ఈరోజు మీరు పరిష్కరించగలరు. పని విషయంలో ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అయితే మీరు పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఎక్కువగా ఖర్చులు చేయడం మానుకోవాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి. మీ జీవితంలో ఒక పెద్ద సమస్య ఎదురుకావచ్చు. మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోవడం మంచిది. ఈరోజు వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు లాభదాయకమైన ఒప్పందం చేసుకోవచ్చు. కుటుంబపరంగా ఏదైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించవచ్చు. మీరు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్ంర 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. పని విషయంలో కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీరు పూర్తి ఏకాగ్రతతో పని చేయలేరు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మెరుగుదల ఉంటుంది. పెండింగులో ఉన్న అప్పులను చెల్లించే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రేమ గల జంటలకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు మీ ప్రియమైన వారితో మాట్లాడటానికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు సానుకూల సమాధానం పొందే అవకాశం ఉంది. వివాహితులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆదాయం నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే త్వరలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగం లేదా వ్యాపారం అయినా మీరు మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు తగినంత ఆదాయం లభించవచ్చు. ఆర్థికంగా ఎవరికైనా సహాయం చేయవచ్చు. మరోవైపు ఈ రోజు మీ భాగస్వామి యొక్క మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఈ రోజు వారు మీ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయగలరు. మీరు అవివాహితులైతే, మీ కోసం వివాహ ప్రతిపాదన రావచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 43

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక సమస్యను పరిష్కరిస్తుంది. మీరు ఈ రోజు డబ్బుకు సంబంధించిన ఏదైనా పని చేస్తే, మీకు ప్రయోజనం వచ్చే అవకాశం ఉంది. మీ పని విషయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ కార్యాలయ పనిని శ్రద్ధగా మరియు కష్టపడి చేస్తారు. వ్యాపారులకు ఈరోజు బాగానే ఉంటుంది. ఈ రోజు మీరు ఒకేసారి అనేక పనులను పూర్తి చేయడంలో విజయవంతమవుతారు. మీ కుటుంబ జీవితంతో అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు లాభం పొందటానికి ఏదైనా అవకాశాన్ని పొందవచ్చు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలను కుంటే తొందరపడకూడదు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. పిల్లలకు కూడా ఆనందం లభిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఆరోగ్యం విషయంలో కూడా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 10, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Friday, April 10, 2020, 2:04 [IST]
Desktop Bottom Promotion