మంగళవారం దినఫలాలు : మీన రాశి వారు అనవసరమైన ఖర్చులు నియంత్రిస్తారు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 13, 2021

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు తమకిష్టమైన వారితో ఎక్కువ సమయం గడపొచ్చు. మీరు కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు వేగంగా పనులు చేస్తారు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రత్యేకించి మీ పని హోటల్ లేదా రెస్టారెంట్‌కు సంబంధించినది అయితే, ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు పెద్ద మెరుగుదల ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఓ శుభవార్త వింటారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా చాలా సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో మీకు సహోద్యోగులతో విభేదాలు ఉండొచ్చు. అయితే మీరు ఓపికగా పని చేయాలి. వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా లాభపడతారు. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. మరోవైపు మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే.. మీ కుటుంబం నుండి సానుకూల సమాధానం రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా పని చేయాలి. ప్రత్యేకించి మీ యజమాని మీకు ఏదైనా బాధ్యత అప్పగించి ఉంటే, దాన్ని పూర్తి చేసిన తర్వాత, మరోసారి చెక్ చేసుకోండి. వ్యాపారులు ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రపంచ మహమ్మారి పట్ల పూర్తి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ తల్లిదండ్రులతో గొప్ప సమయం గడుపుతారు. మీరు వివాహం చేసుకుంటే, మీరు మీ జీవిత భాగస్వామిని గౌరవంగా చూడాలి. చిన్న విషయాలపై అనవసరంగా మాట్లాడొద్దు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి సభ్యులతో మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది. బహుశా ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు బహుమతులు కూడా కొనుగోలు చేయవచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మంచి ఆర్థిక ప్రయోజనం పొందొచ్చు. మీరు కష్టమైన పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు కండరాలకు సంబంధించిన ఏదైనా సమస్య ఉండవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఎంత కష్టపడినా మంచి ఫలితం రాకపోవచ్చు. అయితే మీ ప్రతిభను చూపించడానికి మీరు ఒక సువర్ణావకాశాన్ని పొందవచ్చు. మీరు మీ తరపున మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. వ్యాపారులకు ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మీ పనులు పెండింగులో పడొచ్చు. మరోవైపు మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఈరోజు మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన పనుల్లో అంతరాయం ఏర్పడొచ్చు. దీంతో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. అయితే, ఈ సమస్య తాత్కాలికమైనందున మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ సీనియర్ అధికారుల సహాయంతో సమస్య త్వరలోనే ముగుస్తుంది. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువగా ఖర్చు చేయాలనుకునే మైండ్ సెట్ నుండి బయటకు రావాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తే ఈరోజు ఎటువంటి సమస్య ఉండదు. ఇది కాకుండా, మీరు మీ ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయం యొక్క వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు మీరు పని చేయడంలో మంచి ఆనందం పొందుతారు. మీకు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. చిన్న వ్యాపారులు మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు, మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కాబట్టి, మీకు ఇష్టమైన ప్రదేశంలో మీ ప్రియురాలితో పిక్నిక్ కోసం వెళ్ళడం మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు ఒక సమస్య ఉండొచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పవిత్రంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఆదాయం పెరగడం వల్ల, మీరు కొందరికి డబ్బును విరాళంగా ఇవ్వొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఈరోజు మీ కుటుంబంతో చాలా సరదాగా గడుపుతారు. బహుశా ఈరోజు మీరు ఇంట్లో ఒక చిన్న పార్టీని కూడా నిర్వహించవచ్చు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు కూడా ఈరోజు లాభాలను పొందొచ్చు. మరోవైపు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే, ఈరోజు కొన్ని మంచి వార్తలను వినొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించిన వ్యాపారులు ఈరోజు లాభం రాకపోతే, చాలా ఓపికగా ఉండాలి. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగులు తమ జాబ్ మార్పు గురించి ఆలోచిస్తుంటే, దీన్ని వాయిదా వేసుకోవాలి. మరోవైపు విద్యార్థులు ఈరోజు పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నవి. ఈరోజు, మీరు మీ జీవిత భాగస్వామితో వివాదం కలిగి ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ యోగా మరియు ద్యానం చేయండి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఈరోజు వివాహితులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఆలోచించకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే, రాబోయే రోజుల్లో, మీపై ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. ఫ్యాషన్‌ రంగంలో పనిచేసే ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో, చిన్న పనులను కూడా సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే, అకస్మాత్తుగా మీ యజమాని మీ చర్యలను సమీక్షించవచ్చు. మరోవైపు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆఫీసులో పాలిటిక్స్ కు దూరంగా ఉండాలి. మరోవైపు వ్యాపారులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. వివాహితులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కానుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. మీ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు మరియు మీరు వారి ఆశీర్వాదం పొందుతారు. ఆర్థిక పరమైన విషయానికొస్తే.. ఈరోజు రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, దానిని వాయిదా వేసుకోవాలి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మందులను సమయానికి తీసుకోండి మరియు డాక్టర్ సలహాను అనుసరించండి. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో పనిభారం తక్కువగా ఉండటం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది. బంధువులతో చాలా కాలం తరువాత ఈరోజు చాలా మంచి సమయం గడుపుతారు. మీ ప్రియమైనవారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు అర్థమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించవచ్చు.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Tuesday, April 13, 2021, 5:00 [IST]
Desktop Bottom Promotion