Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మంగళవారం మీ రాశిఫలాలు (14-04-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుదంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీ ప్రేమ జీవితం అందమైన మలుపు తీసుకుంటుంది. మీ భాగస్వామి వివాహాన్ని ప్రతిపాదించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ ఆనందం ఆగదు. మీరు వివాహం చేసుకుంటే, ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మంచి రోజు అవుతుంది. దీంతో మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇందుకు తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి అందరికీ మద్దతు లభిస్తుంది. మీరు మీ కుటుంబ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు పొదుపుపై దృష్టి పెట్టగలుగుతారు. పని విషయంలో సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పెద్ద ఆందోళన నుండి ఉపశమనం లభించవచ్చు. ఈ రోజు మీరు మీ బాధ్యతలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేర్చగలరు. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విషయాల్లో తేడాలు సహజంగానే ఉంటాయి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీకు అనుకూల ఫలితాలు రావు. మీ వైవాహిక జీవితంపై ఈరోజు ఎక్కువ శ్రద్ధ చూపాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమస్యలు, పనిభారం మీ ఒత్తిడి పెంచుతాయి. ఈ సమయంలో, మీరు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి, భావోద్వేగంతో కాదు. మీకు ఏదైనా విషయంలో గందరగోళంగా ఉంటే,మీ సమ్యలను ఎవరితో అయినా పంచుకోండి. వీలైతే, ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి, ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఎక్కువ శ్రద్ద చూపాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు తెలుస్తుంది. ఈ రోజు మీరు ఒకరితో ఒకరు కొంత శృంగార సమయాన్ని కూడా గడుపుతారు. మరోవైపు, మీరు ఇంటి సభ్యులతో విభేదాలు కలిగి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, విషయం మరింత ఉద్రిక్తతగా మారకుండా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు సరిగ్గా ప్రవర్తించకపోతే మీరు విమర్శలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు తెలివిగా వ్యవహరించాలి. ఈరోజు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది. తద్వారా పెండింగులో ఉన్న మీ పనులను పూర్తి చేయవచ్చు. ఉద్యోగులు ఈరోజు పనిపై ఎక్కువగా శ్రద్ధ చూపలేరు. వివాదాలలో కూడా చిక్కుకునే అవకాశం ఉంది. రాబోయే కాలంలో మీరు మరింత భారం మోయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలను కొత్తగా చూస్తారు. మీరు ఈ రోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ప్రేమపూర్వక ప్రవర్తన మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఈ రోజు ప్రేమలో ఉన్న జంటలకు కూడా మంచి రోజు అవుతుంది. ఈరోజు మీ ముఖ్యమైన పని ఏదైనా ఆపివేయబడితే, అది ఈ రోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు వారి బాధ్యతలు మరియు లక్ష్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూల ఫలితాలొస్తే నిరాశ చెందకండి. త్వరలో పరిస్థితి మెరుగుపడుతుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంతో గడిపేందుకు మంచిగా ఉంటుంది. మరోవైపు ప్రేమ విషయంలో ఈ రోజు మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు, మీ భాగస్వామి సహాయంతో, మీరు ఏదైనా సంక్లిష్టమైన విషయాన్ని పరిష్కరించగలరు. ఇది మీ భాగస్వామిపై మీ నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు చాలా సందర్భాల్లో మీకు మంచి ఫలితాలు రావు. జీవితంలో హెచ్చు తగ్గులు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచాలి. ఈ రోజు ఆర్థిక రంగంలో మంచి రోజు కాదు. కాబట్టి డబ్బుతో సమస్య ఉండవచ్చు. ఈ రోజు అవసరమైన వస్తువులకు మాత్రమే ఖర్చు చేయడం మంచిది. మరోవైపు ఈరోజు ముఖ్యంగా ఇంటి సభ్యులను ప్రేమతో చూసుకోండి. శృంగార జీవితంలో ఈరోజు కొంత గందరగోళం ఉంటుంది. మీ భాగస్వామి మీతో చాలా కోపంగా ఉంటారు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులుంటాయి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే, ఈ సమయంలో మీరు మీ ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు పని ఒత్తిడి మరియు కుటుంబ బాధ్యతల మధ్య చిక్కుకుపోతారు, తద్వారా మీరు శారీరకంగా మరియు మానసికంగా మంచి అనుభూతి చెందరు. ఉద్యోగులు పెండింగ్ పనులను నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. శృంగార జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు పని విషయంలో ఈరోజు సానుకూలంగా ఆలోచించాలి. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, మీకు సమయం అనుకూలంగా ఉండదు. ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించొచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మీ పోటీదారులకు దూరంగా ఉండాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతు మీకు లభిస్తుంది. శృంగార జీవితంలో ప్రేమ కూడా ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈ రోజు మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు పెద్ద సమస్యను ఎదుర్కొన్నప్పటికీ, మీరు మీ అవగాహనతో దాన్ని పరిష్కరించగలరు. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మీరు ఖర్చు చేస్తారు. వ్యాపారులకు ఈరోజు ఏవైనా ఆందోళన ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 8:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు చాలా గొప్పగా ఉంటుంది. ఈ రోజు మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన రోజు గడుపుతారు. ఈ రోజు మీకు వ్యాపారంలో ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. అయితే, మీరు ఇప్పుడు ఊహించిన విధంగా ఫలితాలను పొందలేరు, కాబట్టి సహనంతో పని చేయండి. త్వరలో విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. ఈ రోజు, జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదు. మరోవైపు ప్రేమ విషయంలో ఈ రోజు సాధారణంగా అవుతుంది. ఆర్థి పరంగా బాగానే ఉన్నప్పటికీ ఎక్కువగా ఖర్చులు చేయకూడదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...



Click it and Unblock the Notifications











