For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (22-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

<strong>ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...</strong>ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఆందోళన పెరగొచ్చు. సమయానికి ఆదాయం అందకపోవడంతో మీకు నిరాశజనకంగా ఉండొచ్చు. ఈ సమయంలోనే మీరు ధైర్యంతో పనిచేయాలి. త్వరలో మీకు పరిస్థితులు అనుకూలంగా మారొచ్చు. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగుదల ఉంటుంది. ఈరోజు మీరు మీ బాధ్యతలన్నీ నెరవేరుస్తారు. అయితే ఆర్థిక పరంగా బలోపేతం అవ్వడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో విశ్రాంతి మరియు నిశ్శబ్దమైన రోజు గడుపుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 12:35 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో మీరు కొంత విశ్రాంతి తీసుకోవాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు కొంత పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

కరోనాతోనే అందరూ కలవరపడుతుంటే మరో బాంబు పేల్చిన బాల బ్రహ్మ అభిగ్య...!కరోనాతోనే అందరూ కలవరపడుతుంటే మరో బాంబు పేల్చిన బాల బ్రహ్మ అభిగ్య...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగుల పోరాటం ఈరోజు కూడా కొనసాగుతుంది. ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ వివాహ జీవితంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మరోవైపు ఈరోజు ఒకరితో ఒకరు సంతోషంగా ఉంటారు. మీ పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : తెల్లవారుజామున 3:30 నుండి 4:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని పరంగా మిశ్రమంగా ఉంటుంది. మీ ఉన్నతాధికారులు మీ పనిని చూసి సంతోషిస్తారు. కాబట్టి మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ

కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు తల్లిదండ్రుల నుండి కొన్ని ముఖ్యమైన సలహాలను పొందుతారు. మీ వివాహ జీవితంలో ఈరోజు కలహాలు ఉండొచ్చు. ఈ సమయంలో మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే అనవసరంగా ఖర్చులు చేయకపోవడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ప్రేమ విషయంలో, మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాలి. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ మనసులో అనేక రకాల ఆందోళనలు ఉంటాయి. ఈ సమయంలో మీరు ధైర్యం మరియు సహనంతో పని చేయాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు వివాహితులకు వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆదాయం బాగుంటుంది. ఈరోజు ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మీకు ఈరోజు పని భారం ఉండకపోవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఉద్యోగులు ఈరోజు ముఖ్యమైన పనిని చాలా సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు ఈరోజు కొన్ని శుభవార్తలు పొందవచ్చు. ఈరోజు మీరు కుటుంబంతో చాలా ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత మెరుగుదల ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7:40 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా కొంత ఆందోళన ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగా తగ్గుతుంది. పని విషయంలో మీరు ఏకాగ్రత సాధించడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారులకు కొంత ఒడిదుడుకలు ఉంటాయి. వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా సరదాగా గడుపుతారు. మీ కోసం మీరు తగినంత సమయం పొందుతారు. ఈ రోజు మీరు మీ గురించి ఎక్కువ శ్రద్ధ చూపగలరు. ఈరోజు మీరు కుటుంబంతో గడుపుతారు. వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ పని విషయంలో మీకు మద్దతు ఇస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు మీరు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీకు ఈరోజు సమయం అనుకూలంగా ఉండదు. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిలో మీరు కోరుకున్న అన్ని లక్షణాలు ఉన్నాయని మీరు భావిస్తారు. శృంగారంలో మీకు అనుకూలంగా ఉంటే, మీ భాగస్వామికి మీరు విధేయులుగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి రాత్రి 7:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఉంటుంది. అయినా కూడా మీరు మీ పనిని ఉత్తమ మార్గంలో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు ఎవరితో అయినా విభేదాలు రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆదాయ పరంగా ఎలాంటి సమస్య ఉండదు. ఈరోజు మీరు ఖర్చులు కూడా తగ్గించుకుంటారు. తల్లిదండ్రుల మధ్య ఆరోగ్యం బాగుంటుంది. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 22, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Wednesday, April 22, 2020, 1:53 [IST]
Desktop Bottom Promotion