For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (25-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటన్నింటిని సులభంగా ఎదుర్కొంటారు. అయితే వ్యాపారులు మాత్రం ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం సకాలంలో సమకూరడంతో మీరు కొన్ని పాత బిల్లులను చెల్లించే అవకాశం ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం మంచిది. లేదంటే, మీ ఆరోగ్యం బాగా దెబ్బతినే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు మంచి రోజుగా అనిపిస్తుంది. అయితే ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సరైన ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు మీరు మీ పురోగతికి సంబంధించిన సంకేతాలను కనుగొంటారు. వ్యాపారులు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, చాలా ఆలోచించాలి. మరోవైపు కుటుంబ సమస్యల వల్ల మీరు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ను బట్టి ఖర్చు చేస్తారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉండాలి. మీరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న మీకు చాలా సమస్యలు ఎదురవుతాయి. అలాగే మీరు ఈరోజు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు ప్రతికూలంగా అనిపిస్తాయి. ఈ సమయంలో మీరు పనిపై మాత్రమే శ్రద్ధ చూపాలి. లేదంటే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావచ్చు. మీ కుటుంబ జీవితంలో అంతా మంచిగా ఉంటుంది. వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

</p><p><strong>కరోనాతోనే అందరూ కలవరపడుతుంటే మరో బాంబు పేల్చిన బాల బ్రహ్మ అభిగ్య...!</strong>

కరోనాతోనే అందరూ కలవరపడుతుంటే మరో బాంబు పేల్చిన బాల బ్రహ్మ అభిగ్య...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో అద్భుతంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే, మీరు తల్లిదండ్రుల సహాయం పొందవచ్చు. వ్యాపారులు ఈరోజు కొన్ని లాభాలను పొందవచ్చు. ఈరోజు కొన్ని సానుకూల మార్పులు కూడా చూస్తారు. మీ ప్రతిభ గురించి అందరికీ తెలుస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి రాత్రి 8:15 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఏ పని అయినా కష్టపడి చేస్తారు. అలాగే పూర్తి విశ్వాసంతో చేయడం వల్ల మీకు విజయం దక్కుతుంది. మరోవైపు ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. ఈరోజు మీ వద్దకు ఎవరైనా పేదవారు వస్తే, వారికి నిస్వార్థంగా సహాయం చేయండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా రిఫ్రెష్ అవుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు ఉండొచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తినడం మానేయాలి. ఈరోజు పని విషయంలో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటాయి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని ఈరోజు కొంత ఆశ్చర్యపరచవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 గంటల వరకు

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీకు ఈరోజు ఏవైనా సమస్యలు ఎదురైతే, మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇది మీ భారాన్ని తగ్గించడమే కాకా, మీ ఇద్దరిలో ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 33

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీరు ఏదైనా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగులు కొన్ని శుభవార్తలను వింటారు. మరోవైపు వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన కలిగి ఉంటారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను వింటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ మీ వైవాహిక జీవితలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఉద్యోగులకు ఈరోజు ఏవైనా సమస్యలుంటే, అధికారుల పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు అంతా అనుకూలంగా బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు దాని నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. అంతేకాదు మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఉద్యోగులు పెండింగ్ పనులను పూర్తి చేయడంలో విజయవంతం అవుతారు. వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం లభించకపోవచ్చు. అయితే మీ ఇద్దరికి పరస్పరం అవగాహన మంచిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు పొదుపుపై కూడా శ్రద్ధ పెడతారు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 7:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఇది మీ ఇంట్లో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి కూడా మీ రోజువారీ కార్యకలాపాలలో మీకు సహాయం చేస్తుంది. దీని వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. ఉద్యోగులకు ఈ రోజు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.

అయితే సకాలంలో పనులు పూర్తి చేస్తే, ఉన్నతాధికారులు సంతోషిస్తారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పొదుపుపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత సమస్య ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే, చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత మీరు కుటుంబంతో కొన్ని సంతోషకరమైన క్షణాలు గడపడానికి అవకాశం పొందొచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరుఈరోజు ఎవరికైనా రుణం కూడా ఇవ్వొచ్చు. ఈరోజు పనిని కాకుండా విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. దీని వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 6:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 25, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Friday, April 24, 2020, 23:53 [IST]
Desktop Bottom Promotion