Just In
- 2 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 3 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
- 7 hrs ago అయోధ్య బాలరాముడిపై సూర్య తిలకం.. కిరణాలు నుదుటిపై పడేందుకు ఏమి చేసారంటే..!
- 8 hrs ago కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
గురువారం మీ రాశిఫలాలు (13-08-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
Independence Day 2020 : పంద్రాగస్టు విషెస్ చెప్పేయండిలా...
మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే, మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. చిన్న విషయాలకే తీవ్రంగా ఆలోచించండం మానుకోవాలి. మరోవైపు ఈరోజు ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యగా ఉంటుంది. అయితే మీరు ఈరోజు ఎలాంటి నిర్ణయాలను తొందరపడి తీసుకోకూడదు. వ్యాపారులు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా, ఈరోజు ఏదైనా సమస్య ఉంటే, మీ ఆందోళనలు మరింత పెరుగుతాయి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు
వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ, మీ పనిలో ఎలాంటి ఆటంకం కలగదు. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. మీరు అకస్మాత్తుగా సంపాదించే అవకాశం ఉంది. ఈరోజు మీ ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుంది. మరోవైపు ఈరోజు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టాలి. ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. అయితే మీరు తేలికపాటి వ్యాయామం చేయాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు
మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో నియంత్రణలో ఉండాలి. లేకపోతే ఈ రోజు మీ కోప స్వభావం మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లో పడేస్తుంది. మీరు మీ ప్రవర్తనను మృదువుగా చేయడానికి ప్రయత్నిస్తారు. కార్యాలయంలో, మీరు ఈ రోజు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతారు. మీ వేగాన్ని చూసి సీనియర్ ఆఫీసర్లు సంతోషం వ్యక్తం చేస్తారు. మీరు వ్యాపారం చేస్తే మరియు చాలా కాలంగా కొత్త పథకాన్ని పరిశీలిస్తుంటే, ఈరోజు దానిపై పనిచేయడం ప్రారంభించడం శుభప్రదమైనది. మీరు భవిష్యత్తులో మంచి లాభాల సంకేతాలు పొందే అవకాశాలున్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సరిగ్గా లేకపోతే, మీరే చొరవ తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : సాయంత్రం 5:55 నుండి రాత్రి 9 గంటల వరకు
మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!
కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, మీరు మీ అవగాహనతో ఈ సమస్య నుండి సులభంగా బయటపడగలరు. మీరు చేసే పనిలో ఈరోజు కొంత మార్పు సాధ్యమే. అయితే, ఈ మార్పు సానుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాపారులు ప్రయోజనం పొందవచ్చు. మీరు విద్యార్థి అయితే, చదువులో ఎక్కువ శ్రద్ధ చూపాలి. మీ ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 గంటల వరకు
సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఏర్పడొచ్చు. ఈరోజు మీరు సమయానికి పనిని పూర్తి చేయకపోతే, కొంత ఆగ్రహానికి గురవుతారు. ఈ రోజు ఎక్కువ సమయం, మీ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరోవైవపు ఈ రోజు కార్యాలయంలో ఉద్యోగులకు యజమాని కొన్ని ముఖ్యమైన సలహాలు ఇవ్వగలరు. మీరు వారి మాటలను విస్మరించకపోవడమే మంచిది. మీరు వ్యాపారం చేస్తే మరియు ఆర్థిక సమస్యల కారణంగా కలత చెందుతుంటే, ప్రయత్నిస్తూ ఉండండి. ఈరోజు కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రం 4:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు
కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంచి సమన్వయాన్ని ఉంచడానికి ప్రయత్నించండి. మీరు వారి నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో మీరు అవగాహన చూపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యాపారులు మంచి విజయాన్ని పొందవచ్చు. ఈ రోజు మీరు కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. ఈ రోజు కుటుంబంతో సంతోషకరమైన రోజు అవుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీరు మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 6 గంటల వరకు
ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...
తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు మీరు ఎక్కువగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీరు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటే, ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే, మీరు దీనిపై మీ తుది నిర్ణయం తీసుకోవాలి. మరోవైపు ఈరోజు మీ ఇంటి వాతావరణం కొంత అల్లకల్లోలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరగొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఆందోళన పెరుగుతుంది. అనవసరమైన వాటికి డబ్బును ఎక్కువ ఖర్చు చేయవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...
వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు మీ తరపున కష్టపడి పనిచేస్తారు. మీ ఉత్తమమైనదాన్ని ఇస్తారు. మీరు మెడికల్ స్టోరుకు సంబంధించిన వారు అయితే, ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు, ఈరోజు నిరుద్యోగులకు ఓ శుభవార్త వినిపిస్తుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం ఉంటుంది. ఈ రోజు స్నేహితులతో చాలా గుర్తుండిపోయే రోజు అవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు
ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి. చిన్న విషయాలపై సహోద్యోగులతో వివాదాలను నివారించండి. మీరు వ్యాపారం చేస్తే ఈ రోజు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయడానికి మంచి రోజు కాదు. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీరు ప్రతికూల పరిస్థితులలో వారి పూర్తి మద్దతు పొందుతారు. మానసిక ఆందోళన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఈరోజు ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపారులకు ఈరోజు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. మీ ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉంటుంది. మీ అభిప్రాయాలను ఇంటి పెద్దలు తిరస్కరిస్తారు. మీరు ఉత్సాహంతో ఏ పని చేయవద్దు. ఆర్థిక పరిస్థితి ఈరోజు బాగానే ఉంటుంది. ఆర్థిక పరిమితుల కారణంగా కొంత నిరాశ ఎదురవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు
కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉండే అలవాటు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. లేకపోతే ప్రతికూలత మిమ్మల్ని ఆధిపత్యం చేస్తుంది. ఈ రోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. మీ యజమాని పెద్ద ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి మీకు అవకాశం ఇస్తాడు. మరోవైపు, మీరు మీ తండ్రి వ్యాపారంలో చేరాలనుకుంటే, మీరు అతని నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఆర్థిక సమస్యను పరిష్కరించవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని తాజాగా ఉంచడానికి, మీరు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు
మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈ రోజు మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మీకు ఆర్థిక పరంగా విజయం సాధించొచ్చు. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయంలో ఈరోజు కష్టమైన పనులు కూడా తేలికగా పూర్తవుతాయి. ఏదైనా వ్యాపార సంబంధిత సమస్య పరిష్కారం వల్ల ఈ రోజు మీకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. అయితే, ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీరు నిరంతరం పనిచేస్తుంటే, వెన్నెముకకు సంబంధించిన సమస్య ఎదురుకావచ్చు. మీరు దానిని విస్మరించకపోవడమే మంచిది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.