For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (04-08-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope August 4, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి, ఆఫీసులో పనిపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయాలి. మరోవైపు వివాహితులకు వారి జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు ఉంటాయి. మీ ప్రియమైన వారిపై ఇతరుల కోపాన్ని చూపడం మానుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆలోచనాత్మకంగా గడుపుతారు. ఈ రోజు ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సందర్భాల్లో ఆశించిన విధంగా ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా వ్యాపారులకు ఈరోజు పెద్ద లాభాలు రావచ్చు. మీ పని విషయంలో మంచిగా ఉంటుంది. మరో విషయమేమిటంటే, మీరు మీ ప్రత్యర్థులకు కఠినమైన పోటీని ఇవ్వగలుగుతారు. మరోవైపు, నిరుద్యోగులు ఈరోజు కూడా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ పనిని శ్రద్ధగా చేయాలి. మీ తప్పులను పునరావృతం చేయవద్దు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈ రోజు తోబుట్టువులతో చాలా సరదాగా ఉంటుంది. మీరు మీ ఆనందాన్ని మీ ప్రియమైనవారితో పంచుకుంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు వారి ఆశీర్వాదం పొందుతారు. పని విషయంలో ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీ ముఖ్యమైన పని ఒకటి పూర్తవుతుంది. ఇటీవల మీకు కొత్త ప్రాజెక్టులో పని చేసే అవకాశం లభిస్తే, అందులో ఈరోజు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉండేందుకు, ఈరోజు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళన తగ్గవచ్చు. పనితీరుకు సంబంధించిన ఏవైనా సమస్యల నుండి మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. మరోవైపు వ్యాపారులకు ఈరోజు మంచి ప్రయోజనాలు రావచ్చు. ఆర్థిక పరంగా నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు దేనిలో అయినా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ సమయంలో పెట్టుబడులను పెట్టేందుకు సమయం అనుకూలంగా లేదు. మరోవైపు ఈరోజు మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. మీ జీవిత భాగస్వామి మీతో కోపంగా ఉండవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

ఆగస్టులో పుట్టిన వారంతా అద్భుత శక్తులను కలిగి ఉంటారా?ఆగస్టులో పుట్టిన వారంతా అద్భుత శక్తులను కలిగి ఉంటారా?

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పనిలో కొన్ని మార్పులుంటాయి. మరోవైపు ఈ రోజు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని పెంచడానికి మీకు అవకాశం లభిస్తుంది. మరోవైపు, మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈ రోజు మీరు శుభవార్త వినొచ్చు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, ఈ రోజు మీరు మీ స్నేహితులతో సరదాగా గడపబోతున్నారు. ఇంకోవైపు మీ భాగస్వామితో మీరు ఈరోజు శృంగార జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని మీరు నిర్ణయించుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. మీ ఆదాయం పెరగవచ్చు. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గొప్ప సమయాన్ని గడుపుతారు. అయితే, ఈ విస్తృతమైన అంటువ్యాధికి వ్యతిరేకంగా మరింత అప్రమత్తంగా ఉండాలి. కార్యాలయంలో ఏదైనా కొత్త మరియు పెద్ద ప్రాజెక్టుకు మీరు బాధ్యత వహిస్తే, మీరు కష్టపడి, శ్రద్ధగా పనిచేయాలి. వ్యాపారులు మరోవైపు వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీకు కొంత నష్టం రావచ్చు. అయితే, ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 4:35 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు మీ వ్యక్తిగత విషయాలలోకి ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వకండి. అలా చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా మారతాయి. మరోవైపు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామిని విస్మరించే పొరపాటు చేయవద్దు. ఈ రోజు మీ ప్రియురాలితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. పని విషయంలో తొందరపడకండి. ప్రశాంతంగా పని చేయండి. ఈ రోజు వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నట్లు అనిపిస్తుంది. మీరు కొత్త వ్యాపార ప్రతిపాదనను కూడా పొందొచ్చు. ఈ రోజు ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పనులను సులభంగా పూర్తి చేయడానికి మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలోని సహోద్యోగులతో ఎక్కువ మాట్లాడటం ద్వారా మీ సమయాన్ని వృథా చేయవద్దు. ఈ రోజు మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయకపోతే, సీనియర్ అధికారులు కఠినమైన వైఖరిని అవలంబించవచ్చు. ఈ రోజు మీరు ఆర్థిక విషయంలో నిరాశ చెందుతారు. మీ ఆర్థిక ప్రయత్నాలు విఫలం కావచ్చు. కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ ప్రియమైనవారి మద్దతుతో, మీరు కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు ఈ రోజు కుటుంబంతో చాలా ఆనందిస్తారు. ఈ రోజు మీ తోబుట్టువులతో సరదాగా ఉంటుంది. మీ తండ్రి మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. మరోవైపు ఈరోజు మీ పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడొచ్చు. వ్యాపారులు ఈరోజు ఏదైనా కొత్త వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, సమయం దానికి అనుకూలంగా లేదు. మరోవైపు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులు ఈరోజు లాభం పొందడానికి తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. అదే సమయంలో, పనిచేసే వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీపై బాధ్యతలు కొన్ని పెరగొచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితుల వల్ల మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో మీ ఆందోళన పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. మరోవైపు ఈ రోజు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం లేదా మీకు ఇష్టమైన పని చేయడం మంచిది. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో అప్పగించిన పనిని చాలా బాధ్యతగా చేయాలి. పని పూర్తయిన తర్వాత, ఒకసారి మళ్లీ తనిఖీ చేయండి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈ రోజు మీరు మీ భాగస్వామితో కలిసి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీ పని కొత్త దిశలో వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు ధూమపానం మరియు మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : సాయంత్రం 5:55 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా పాత స్నేహితుడిని కలవవచ్చు. ఈరోజు మీకు పనికి సంబంధించి తక్కువ ఆందోళన ఉంటుంది. మరోవైపు వ్యాపారులకు ఈరోజు ఊహించని విధంగా లాభాలు రావచ్చు. ఇంకోవైపు మీరు నిరుద్యోగులైతే.. మీరు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగ ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే, మీ ఉద్యోగ ఆఫర్ పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులను నియంత్రించాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు వారి మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope August 4, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Monday, August 3, 2020, 19:32 [IST]
Desktop Bottom Promotion