‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్‌.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?

హెల్తీ లైఫ్‌స్టైల్‌లో భాగంగా చాలా మంది పరగడుపన వెల్లుల్లి తీసుకుంటారు. దీనిని తేనెతో కలిపి తీసుకోవడం లేదా నెయ్యిలో వేయించి తినడం ఇలా చాలా రకాలుగా తీసుకోవడం ట్రెండింగ్‌గా మారింది. అయితే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవడం మంచిదేనా.. ఎలాంటి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల సలహాలు తెలుసుకుందాం..

Is it good to eat garlic on an empty stomach Find out who needs to be careful

వెల్లుల్లి ఏముంటాయి..

ప్రతిరోజూ పరగడుపున వెల్లుల్లి తినడం లేదా వంటకాల్లో ఎక్కువగా వెల్లుల్లి చేర్చుకోవడం, వెల్లుల్లి కారం ఇలా నచ్చిన రీతిలో తీసుకుంటారు. వెల్లుల్లిలో సల్ఫర్‌ సమ్మేళనాలు ఉంటాయి. అందులో ఒకటి అల్లిసిన్‌. కట్‌ చేసినప్పుడు లేదా నలిపినప్పుడు ఈ రసాయనం వెలువడుతుంది. అందుకే తినడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి పోరాడుతుంది. ఇంకా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. మెరుగైన జీర్ణక్రియకు దోహదపడుతుంది. వీటిలో విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలు సైతం ఉంటాయి. అందుకే డాక్టర్లు సైతం వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే ఈ వెల్లుల్లిని సర్వరోగ నివారిణిగా, హోం రెమెడీగా పరిగణించకూడదని చెబుతున్నారు. వెల్లుల్లిని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని, ఆహారంలో సరైన రీతిలో చేర్చుకోవడం తెలుసుకోవాలి.

ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం..ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం..

రక్తపోటును నియంత్రిస్తుందా..

వెల్లుల్లి లేదా గార్లిక్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవడం ద్వారా రక్తపోటులో నియంత్రణ ఉంటుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. అయితే ఈ ప్రభావం ప్రతి వ్యక్తిలో ఉండకపోవచ్చు. బీపీ మందులకు దీనిని ప్రత్యామ్నాయంగా భావించవద్దని నిపుణులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్‌పై ప్రభావం

వెల్లుల్లి వినియోగం ద్వారా LDL కొలెస్ట్రాల్‌లో స్వల్వ మార్పులను గుర్తించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫ్యాట్‌ తగ్గడానికి ఇదే పూర్తి పరిష్కారం కాదు. అందుకే పరగడుపున వెల్లుల్లి తీసుకున్నంత మాత్రం కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌ అవుతుందని చెప్పలేం.

బరువు తగ్గిస్తుందా..

Is it good to eat garlic on an empty stomach Find out who needs to be careful

బరువు తగ్గాలనుకునేవారికి వెల్లుల్లి పూర్తి పరిష్కారంగా భావించలేం. మీరు ఖర్చు చేసే కేలరీలు, సరైన బ్యాలెన్స్‌డ్‌ ఆహారం, శారీరక శ్రమ, సరిపడా నిద్ర, జీవనశైలితో బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్యాలెన్స్‌డ్‌ ఆహారంలో వెల్లుల్లి ఒక భాగం. ఇవేమీ చేయకుండా కేవలం గార్లిక్‌ తీసుకుంటే బరువు తగ్గుతారని అనుకోవద్దు.

బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.?బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.?

దుష్ప్రభావాలు..

కొందరు ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకుంటే గుండెల్లో మంట, గ్యాస్‌, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఘాటైన వాసన, రుచి కారణంగా కొందరిలో నోటి దుర్వాసన రావచ్చు. గార్లిక్‌ తీసుకున్న తర్వాత జీర్ణ సమస్యలు ఎదురైతే పరగడుపున తీసుకోవడం మానేయండి. భోజనంతో పాటు తీసుకోవడం ఉత్తమం. లేదా డాక్టర్ల సలహా మేరకు తీసుకోవడం మంచిది.

వీరు దూరంగా ఉండాలి

రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకుంటున్న వారు వెల్లుల్లి విషయంలో సంబంధిత వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. ఇతర దీర్ఘకాలిక సమస్యలకి మందులు వాడుతున్న వారు వెల్లుల్లి లేదా గార్లిక్‌ సప్లిమెంట్స్‌ తీసుకుంటుంటే డాక్టర్ల సూచన లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 30, 2026, 10:43 [IST]
Desktop Bottom Promotion