అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!

దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను అత్యంత వైభంగా జరుపుకుంటారు. దసరా అనగానే మనకు విజయవాడ కనకదుర్గమ్మ కొండపై, అలాగే ఊరు వాడా వైభవోపేతంగా జరిగే శరన్నవరాత్రుల వేడుకలు, హైదరాబాద్ వంటి చోట్ల జరిగే అలయ్ బలయ్ వేడుకలు కూడా గుర్తుకొస్తాయి.

ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీన ఈ అత్యంత పవిత్రమైన నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ఏడాది నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే... ఈసారి జగన్మాత దుర్గాదేవి ఏనుగు (గజవాహనం) పై భూలోకానికి రానున్నారు. హిందూ సంప్రదాయంలో నవరాత్రులు స్టార్ట్ అయ్యే వారాన్ని బట్టి అమ్మవారి వాహనం నిర్ణయించబడుతుంది.

Sharad Navratri 2026 Goddess Durga Arriving on an Elephant Massive Wealth for These 3 Zodiac Signs

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అమ్మవారు గజవాహనంపై కొలువుదీరడం అత్యంత శుభప్రదం. ఏనుగును సంతోషం, శ్రేయస్సు, అదృష్టం, స్థిరమైన సంపదకు ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల ప్రభావం భక్తుల జీవితాల్లో సిరిసంపదలను, అనంతమైన విజయాలను తీసుకురానుందని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల పుణ్యకాలం మూడు రాశుల వారి తలరాతను మార్చబోతోంది. ఆ అదృష్ట రాశులేవో చూడండి.

వృషభ రాశి

మీరు ఎప్పటి నుంచో పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో దక్కుతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీరు సాధించే విజయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి. లక్ష్మీదేవి కటాక్షం వృద్ధి చెంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు శ్రమకు నూటికి నూరు శాతం ఫలితం దక్కుతుంది. ఏళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యల నుంచి అమ్మవారి దయతో శాశ్వత విముక్తి లభిస్తుంది. ఏది పట్టుకున్నా బంగారం అవుతుందన్నట్లుగా లైఫ్ ఉంటది.

ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

కన్యా రాశి

గతంలో ఆటంకాలు ఎదురై ఆగిపోయిన పనులు ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక స్థితిగతులు క్రమక్రమంగా ఊపందుకుంటాయి. వ్యాపారస్తులకు, వృత్తి నిపుణులకు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా కెరీర్‌ లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. విద్యా రంగంలో ఊహించని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు చేతికొచ్చి భారీ లాభాలను అందిస్తాయి.

ధనుస్సు రాశి

ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టుల ద్వారా విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. అయితే డబ్బు విషయంలో భావోద్వేగాలకు పోకుండా, ఆచరణాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది, భాగస్వామితో బంధం బలపడుతుంది. అంతేకాకుండా, ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్లాలనే మీ కల నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Wednesday, September 30, 2026, 10:29 [IST]
Desktop Bottom Promotion