Latest Updates
-
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే..
శనివారం దినఫలాలు : మీ భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలను వింటారు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, పుష్యమాసం శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశి వారు చాలా విషయాల్లో కలత చెందుతారు. పని విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నించడం మంచిది. ప్రేమికులకు ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈ సమయం మీకు చాలా ముఖ్యం, కాబట్టి మీ దృష్టి పని మీద ఉంచండి. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీరు పెద్దగా ఖర్చు చేయాలనే మానసిక స్థితిలో ఉంటే, మీరు దానిని నివారించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న వారు, విజయం సాధించడానికి బలమైన అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి, ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వారు మీ కొన్ని పనిలో పెద్ద అడ్డంకిని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఆదాయం బాగుంటుంది. మీ ఖర్చులు పెంచే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కలిసి నడవడానికి మీరు అవకాశం పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ఊహించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో ఆనందకరంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులలో మీ ప్రియమైనవారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఈరోజు మంచి మానసిక స్థితి ఉంటుంది. మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఈరోజు మీరు మీ భాగస్వామితో ఏదో ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీ చెవులకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రతికూలత ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న విషయంపై పెద్ద పోరాటం చేయవచ్చు. మీ నిగ్రహాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే అది గణనీయంగా పెరుగుతుంది. శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల ఉంటుంది. ఇవన్నీ మీ సరైన నిర్ణయాల ఫలితమే. ఈరోజు చిన్న వ్యాపారులు బాగా లాభపడతారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 10:35 నుండి సాయంత్రం 7 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజు. మీరు ప్రైవేట్ ఉద్యోగం తీసుకుంటే, మీ పురోగతికి బలమైన అవకాశం ఉంది. ఈరోజు, మీరు మీ చేతుల్లో పెద్ద ప్రాజెక్ట్ను కలిగి ఉండవచ్చు. వ్యాపారులకు ఈరోజు కొన్ని విషయాల్లో గొప్ప ఉపశమనం కలుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఇది కాకుండా, చిన్న పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు మంచిది. వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈరోజు మీ తండ్రి పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మంచిగా ఉంటుంది. శృంగార జీవితంలో కూడా పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తాయి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 35
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు వారి భాగస్వామ్యంతో సమన్వయాన్ని మెరుగుపరచేందుకు ప్రయత్నించాలి. బంగారం మరియు వెండి వ్యాపారం చేసే వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు లభించొచ్చు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో గొప్ప గౌరవం పొందవచ్చు. మరోవైపు, మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, మీకు మంచి అవకాశం లభించే బలమైన అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ తోబుట్టువులతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి సాయంత్రం 5 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారి మనస్సు ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ఈరోజు చాలా కష్టపడి పని చేస్తారు. మీ ఉన్నతాధికారులు మీ కృషిని అభినందిస్తారు. మీరు నిరుద్యోగులైతే ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. అయితే మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధం ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులు, ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే, మీరు కష్టపడి పనిచేయాలి. ఈ సమయంలో చదువుల పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి. పని విషయంలో ఈరోజు సరైన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఊహించిన ఫలితాలను పొందుతారు. మీరు కోరుకున్న బదిలీని పొందవచ్చు. మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. వ్యాపారులకు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో చాలా ముఖ్యమైన రోజు. మీరు వారితో సాధ్యమైనంత ఎక్కువసేపు కలిసి ఉండాలి. ఈరోజు శృంగార జీవితంలో ఒక అందమైన మలుపు ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు ఎక్కువగా షాపింగ్ కూడా చేయొచ్చు. పని విషయంలో ఈరోజు మంచిగా ఉండకపోవచ్చు. మీరు కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీరు మీ ప్రయత్నాలను పెంచుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 44
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండాలి. మీ ముఖ్యమైన పనిపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఈరోజు కొన్ని ప్రతికూల ఆలోచనలు గుర్తుకు రావచ్చు. ఉద్యోగులకు ఈరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీరు ఇటీవల కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే, ఈరోజు మిమ్మల్ని సీనియర్ అధికారులు ప్రశంసించవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 13
లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారులు సుదీర్ఘ ప్రయాణం చేయకుండా ఉండాలి. మీరు అమ్మకాల విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు ఆందోళనలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉంటుంది, ముఖ్యంగా మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు, మీరు జీవిత భాగస్వామి నుండి అందమైన ఆశ్చర్యాన్ని కూడా పొందవచ్చు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి రాత్రి 10:05 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఏదైనా క్రొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈరోజు దానికి అనుకూలమైన రోజు. మీరు మంచి విజయాన్ని పొందవచ్చు. అదే సమయంలో, ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు కూడా చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











