For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (16-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ప్రతికూలంగా ఉంటుంది. అందుకే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. పని విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీకు ఎవరితో అయినా వాదనలు ఉండేే అవకాశం ఉంది. మీ కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 10:45 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు కెరీర్‌కు సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మీ వ్యాపారం కోసం కొత్త ప్రణాళికను రూపొందిస్తుంటే, మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీపూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారులు ఈ రోజు ఏదైనా పెద్ద విజయాన్ని పొందవచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. జీవిత భాగస్వామితో ఉన్న సంబంధం యొక్క మాధుర్యం అలాగే ఉంటుంది. ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి వివాహ ఈరోజు వివాహ జీవితంలో కలహాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో గొడవ ఉంటుంది. మీరు మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. మీకు ఆఫీసులో పని చేయాలని అనిపించకపోవచ్చు. ఈరోజు మీకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం వస్తే, మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించిన తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 4:55 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీరు ఈరోజు కొన్ని శుభవార్తలను ఉంటారు. పని విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీకు ఈరోజు సోమరితనంగా అనిపిస్తుంది. ఈరోజు మీ మనసులో చాలా గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది. ఈ రోజు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు కూడా మంచిగా ఉంటాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 5:10 నుండి రాత్రి 12:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ పనులలో ఎలాంటి ఆటంకం ఉండదు. ఆఫీసులోనూ మీ సీనియర్లు మీ పని పట్ల చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితంలో కొంత గందరగోళంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంలో కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఉద్యోగులు ఈ రోజు మంచి విజయాన్ని పొందవచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ప్రశాంతత ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఆశించిన మద్దతు పొందుతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పవిత్రంగా ఉంటుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రమోషన్ సంకేతాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా శృంగారభరితంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని కొత్త ఆర్థిక ప్రణాళికలను కూడా చేయవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. శృంగార జీవితంలో మీ ప్రేమికుడు / ప్రేయసితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రోజు మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ పెరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు వారి తల్లిదండ్రుల అభినందనలను పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదే సమయంలో జీవిత భాగస్వామి యొక్క మంచి మానసిక స్థితి మీ రోజును మరింత సంతోష పరుస్తుంది. ఉద్యోగం చేసే వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. అయితే, మీ అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ రోజు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టవచ్చు. పని విషయంలో ఈరోజు చాలా ముఖ్యం. మీరు భవిష్యత్తు కోసం సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించవచ్చు. జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం పెరుగుతాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు పనులన్నింటినీ చాలా వేగంగా మరియు మెరుగ్గా పూర్తి చేస్తారు. దీని వల్ల మీరు మీ సీనియర్ల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు మీకు వినోదం కూడా లభిస్తుంది. మీరు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. కుటుంబం పరంగా కొంత గందరగోళంగా ఉంటుంది. మీ తప్పుడు వైఖరి మీ ప్రియమైన వారితో మీ సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు మీ ప్రియుడు / స్నేహితురాలితో కొన్ని శృంగార క్షణాలను ఆస్వాదించగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు లాభం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 10 గంటల వరకు

English summary

Daily Horoscope January 16, 2020

Check out what the stars have in store for you. You need to know whether your luck will favour you or not. Instead of being clueless about your future, read our daily horoscope to know how your day will be.
Story first published:Wednesday, January 15, 2020, 0:53 [IST]
Desktop Bottom Promotion