Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
సోమవారం మీ రాశిఫలాలు (06-01-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ధనుర్మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేషరాశి : 21 మార్చి - 19 ఏప్రిల్
ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండాలి. మితిమీరిన కోపం మీకు మరియు మీ భాగస్వామికి మధ్య దూరాన్ని పెంచుతుంది. మీరు మీ భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకోవాలి. సర్దుకుపోతే సమస్యలు అనేవే ఉండవు. పని విషయంలో ఈరోజు గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. మీ పిల్లలకు బహుమతులు ఇచ్చి వారిని ఆశ్చర్యపరిస్తే అద్భుతంగా ఉంటుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి 12:25 గంటల వరకు

వృషభ రాశి : 20 ఏప్రిల్ - 20 మే
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు మీరు మంచి అవకాశాలను పొందవచ్చు. అవి మిమ్మల్ని బాగా ఆకర్షిస్తాయి. మరోవైపు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. మీ అనియంత్రిత కోపం మీ ఇద్దరి మధ్య వివాదానికి కారణమవుతుంది. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈరోజు మీరు మీకు ఇష్టమైన వంటలను ఆనందిస్తారు.
లక్కీ కలర్: వైట్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : 21 మే - 20 జూన్
ఈ రాశి వారిలో కొందరికి ఈరోజు ప్రేమ జీవితం బాగుంటుంది. మీ భాగస్వామితో బంధం పెరుగుతుంది. వివాహం చేసుకున్న వ్యక్తులకు శృంగారపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించగలుగుతారు. మీరు వ్యాపారవేత్త అయితే మీ పని ఈ రోజు చాలా తేలికగా పూర్తవుతుంది. ఈ రోజు కొన్ని శుభవార్తలను వింటారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలా బాగుంటాయి. అందువల్ల మీరు త్వరగా పని చేస్తారు.
లక్కీ కలర్: డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : సాయంత్రం 6:00 నుండి 10 గంటల వరకు

కర్కాటక రాశి : 21 జూన్ - 22 జూలై
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సంతోషంగా ఉండకపోవచ్చు. అయితే వ్యాపారం లేదా ఉద్యోగంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు మీ అన్ని పనులను నిజాయితీగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈ రోజు ఆరోగ్య విషయంలో ఏదో తప్పు ఉంటుంది. అజాగ్రత్తగా ఉండకండి.
లక్కీ కలర్: బ్లూ
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:20 గంటల వరకు

సింహ రాశి : 23 జూలై - 22 ఆగస్టు
ఈ రాశి వారు ఈరోజు వారి భాగస్వామితో గడపడానికి అనుకూలమైన రోజు. మీ ప్రియమైన వారు ఇష్టపడే ప్రదేశానికి పిక్నిక్ కోసం తీసుకెళ్లండి. దీంతో వారి మానసిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఈరోజు ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు మీ తల్లిదండ్రుల నుండి ఆప్యాయత మరియు మద్దతు లభిస్తుంది. ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఉంది. ఈరోజు పని భారం తక్కువగా ఉంటుంది. మీ కోసం మీకు తగినంత సమయం లభిస్తుంది. మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మంచిది.
లక్కీ కలర్: పింక్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి : 23 ఆగస్టు - 22 సెప్టెంబర్
ఈ రాశి వరకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ నిర్ణయాలన్నింటినీ చాలా ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. పని విషయంలో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. ఈ రోజు మీరు ఏదైనా కష్టమైన పనిని చాలా తేలికగా పరిష్కరిస్తారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు మంచి విజయాన్ని పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అయితే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

తుల రాశి : 23 సెప్టెంబర్ - 22 అక్టోబర్
ఈ రాశి వరకు ఈరోజు మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు. ఈరోజు మీ పిల్లల విషయంలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. ఈరోజు వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. మీ వివాహంలో సమస్యలు ఉంటే, మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు. ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో మీ స్నేహితులు, మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్: మెరూన్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : 23 అక్టోబర్ - 21 నవంబర్
ఈ రాశి వారు ఈరోజు పనులపై పూర్తి శ్రద్ధ చూపుతారు. ఈరోజు సానుకూలంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితిలో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఇతరులను మెప్పించడానికి ఎక్కువ ఖర్చు చేసే మానసిక స్థితిలో ఉంటే, మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ప్రేమ విషయంలో కూడా బాగా ఉంటుంది.
లక్కీ కలర్: బ్రౌన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

ధనుస్సు రాశి : 22 నవంబర్ - 21 డిసెంబర్
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే, నమ్మదగిన వ్యక్తిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకుని అప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు మీరు మరింత భావోద్వేగానికి లోనవుతారు. మీరే బాధ్యత వహించడం మంచిది. ఈ సమయంలో మీరు మీ పని మరియు కుటుంబసభ్యులపై దృష్టి పెడతారు. మీ కార్యాలయంలో అకస్మాత్తుగా పెద్ద సమస్య తలెత్తుతుంది. అలాంటి సమయంలో ధైర్యం మరియు అవగాహనతో పరిస్థితిని నిర్వహించడానికి ప్రయత్నించండి. మీరు ప్రేమలో ఉంటే ఈ రోజు మీకు కొద్దిగా నిరాశగా అనిపించవచ్చు.
లక్కీ కలర్: స్కై బ్లూ
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

మకర రాశి : 22 డిసెంబర్ - 19 జనవరి
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పని భారం తీసుకోకుండా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే సిగరెట్లు, మద్యం నుండి దూరంగా ఉండండి. ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే, మీ ప్రణాళికను కొనసాగించడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు మీ స్నేహితులు మీకు కొన్ని ముఖ్యమైన సలహాలు కూడా ఇవ్వగలరు. మీ శృంగార జీవితంలో అకస్మాత్తుగా పెద్ద సమస్య ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్య సమస్యలు పెరగొచ్చు.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : 20 జనవరి - 18 ఫిబ్రవరి
ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో కలతలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క కఠినమైన ప్రవర్తన మిమ్మల్ని భయపెడుతుంది. వీలైనంత త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. మీ పని స్వభావం కారణంగా మీరు ఈ రోజు మీ కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. కాబట్టి మీరు పనిలో విజయవంతం కావడానికి ఎక్కువ కష్టపడాలి. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ వ్యక్తిగత జీవిత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అది మీ పనిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీ కుటుంబసభ్యుల పట్ల మీ బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
లక్కీ కలర్: పర్పుల్
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మీన రాశి : 19 ఫిబ్రవరి - 20 మార్చి
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఇతరులను మార్చాలని ఆలోచించే ముందు మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. మీ వేగవంతమైన వైఖరి మిమ్మల్ని మీ ప్రియమైన వారి నుండి దూరం చేస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం మీ ఆందోళనను పెంచుతుంది. అందువల్ల, వారు త్వరగా కోలుకోవడానికి మీరు మెరుగైన చికిత్స కోసం ప్రయత్నించాలి. వీలైతే, ఈ రోజు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, జాగ్రత్తగా ఆలోచించండి.
లక్కీ కలర్: ఆరెంజ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి 9 గంటల వరకు



Click it and Unblock the Notifications











