గురువారం మీ రాశిఫలాలు (02-07-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope July 02, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు ప్రతిభ చూపేందుకు పూర్తి అవకాశం లభిస్తుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించేందుకు తీవ్రంగా ఆలోచించాలి. ఆర్థిక పరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే మీకు నష్టాలు ఎదురుకావచ్చు. మీ కుటుంబ జీవితంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆఫీసులో పని చేసేవారికి కొందరు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మీరు ఆందోళన చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు చిన్న ఖర్చులు ఉండవచ్చు. కుటుంబ జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. మీరు ఈరోజు చాలా తెలివిగా మరియు ఓపికగా పని చేయాలి. సాధ్యమైనంతవరకు, మీరు కోపంగా ఉండకుండా మరియు ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రత్యేకమైన వ్యక్తిని కలవొచ్చు. పని విషయంలో ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు కొంత ఆందోళన ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించడానికి మీకు అవకాశం లభిస్తుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో పని చేసేవారికి ఈరోజు గొప్ప రోజు అవుతుంది. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు విశ్వాసం మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. అదే సమయంలో మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఈ రోజు మీరు మీ ప్రియురాలితో గొప్ప సమయాన్ని గడుపుతారు. మరోవైపు, తల్లిదండ్రులు మీతో సంతోషంగా ఉంటారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 10:35 నుండి సాయంత్రం 7 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. డబ్బు లేకపోవడం వల్ల, మీ ముఖ్యమైన పని ఈ రోజు పెండింగులో పడిపోతుంది. వ్యాపారులు ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో పని చేసేటప్పుడు, జాగ్రత్తగా మరియు నిజాయితీగా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ ఇంటి వాతావరణం బాగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి. ఇంటి వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు, మీరు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీకు ఈరోజు సానుకూల శక్తి తోడుగా ుంటుంది. దీని కారణంగా ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో చాలా కష్టమైన పనులను కూడా పూర్తి చేయగలరు. మీ కృషితో సీనియర్ అధికారులు చాలా సంతృప్తి చెందుతారు. మరోవైపు, వ్యాపారులకు మంచి రాబడి లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఉత్సాహంతో నిండి ఉంటుంది. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీరు చాలా రిఫ్రెష్ అవుతారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి సాయంత్రం 5 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు కొత్త ఆలోచనలను చేస్తారు. ఇది మీ పనిపై కూడా ప్రభావం చూపుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారం అయినా, మీ పని సజావుగా సాగుతుంది. వ్యాపారులకు ఈరోజు కొంత పెద్దలాభం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవిగా కనిపిస్తాయి. ఈ రోజు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొంచెం పనిభారం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. వ్యాపారులు ఈరోజు చాలా ఓపికగా ఉండాలి. దీని వల్ల మీకు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీ కుటుంబ జీవితంలో బాధ్యతల్ని భారంగా భావించొద్దు. మీరు వివాహం చేసుకుంటే, చిన్న చిన్న విషయాలపై మీ జీవిత భాగస్వామితో వాదించడం మానుకోండి. లేకపోతే మీ మధ్య దూరం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైనది. ఉద్యోగులకు ఈరోజు కొన్ని కొత్త బాధ్యతలు రావచ్చు. అయితే, మీరు ఏ పని చేయడానికీ తొందరపడకూడదు. మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పని అంతా ఓపికతో చేయడానికి ప్రయత్నించండి. మరోవైపు, వ్యాపారులు తమ పోటీదారులతో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే ఈ రోజు మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా తక్కువ అనుభూతి చెందుతారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు అనేక ప్రయోజనాలు దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. వివాహితులు ఈరోజు కొంత ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు అజాగ్రత్తగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి 12:45 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. మీకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీరు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం మానుకోవాలి. మరోవైపు ఈ రోజు మీరు ఇంటి సభ్యుల ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు. ఇతరుల విషయంలో ఎక్కువ మాట్లాడటం మానుకోండి. లేకపోతే మీరే పెద్ద ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి రాత్రి 10:05 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు యజమానితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు చాలా విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. త్వరలో మీ కష్టాలన్నీ తొలగించబడతాయి. ఈ రోజు మీకు కొన్ని ప్రతికూల ఆలోచనలు గుర్తుకు రావచ్చు. వ్యర్థమైన వస్తువులకు దూరంగా ఉండటం మరియు మీ ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడం మీకు మంచిది. వ్యక్తిగత జీవితంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు.. శారీరక సమస్యల నుండి బయట పడేందుకు మీరు యోగా మరియు ధ్యానాన్ని చేయాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Thursday, July 2, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion