అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

సెప్టెంబర్ నెల దాటేసి అక్టోబర్ లోకి అడుగుపెట్టాం. ఆధ్యాత్మిక పరంగా ఈ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇదే నెలలో దసరా పండగ, శరన్నవరాత్రులు ఉంటాయి.

ఇదిలాఉంటే, పుట్టిన నెలను బట్టి వ్యక్తుల గుణగణాలను, వారి మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చని జ్యోతిష్య, మనస్తత్వ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటే అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి.

october born girls personality traits in telugu

అందానికి చిరునామా ..ఆకర్షణీయమైన మాట తీరు

అక్టోబర్‌ లో పుట్టిన అమ్మాయిలు సహజంగానే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిలో ఒక ప్రత్యేకమైన హుందాతనం ఉట్టిపడుతుంది. కేవలం బయటకి కనబడే అందమే కాదు, మాట తీరు కూడా ఎదుటివారిని ఇట్టే కట్టిపడేస్తుంది. తమ మృదువైన, ఆకర్షణీయమైన సంభాషణలతో ఎవరి మనసునైనా ఇట్టే గెలుచుకోగలరు. నలుగురిలో ఉన్నప్పుడు వీరే హైలెట్ అవుతుంటారు.

అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!

పాజిటివ్ ఎనర్జీ

వీరి చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. జీవితంలో ఎంతటి కష్టాలు ఎదురైనా బెదిరిపోరు, వెనకడుగు వేయరు. ఏ సమస్యనైనా తమ ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ఎంతటి గడ్డు పరిస్థితినైనా సునాయాసంగా తమకు అనుకూలంగా మార్చుకునే అద్భుతమైన నేర్పు వీరి సొంతం.

విలాసాల పట్ల మక్కువ

అక్టోబర్ అమ్మాయిలకు విలాసవంతమైన జీవితం గడపడం అంటే చాలా ఇష్టం. కాంప్రమైజ్ కావడం వీరికి అస్సలు నచ్చదు. కొత్త ప్రదేశాలను అన్వేషించడం, విపరీతంగా ప్రయాణాలు చేయడం, ట్రెండీగా ఉండే వస్తువులను కొనుగోలు చేయడం వీరి హాబీలు. తమకు నచ్చిన వాటి కోసం, తమ సంతోషం కోసం డబ్బు ఎంతైనా ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. తమకంటూ ఒక అందమైన కలల ప్రపంచాన్ని సృష్టించుకుని, అందులో రాకుమారిలా విహరించడానికి వారు ఇష్టపడతారు.

దాపరికాలు లేని మనసు

బంధాల విషయంలో అక్టోబర్ అమ్మాయిలు బ్రాడ్ మైండెడ్ కలిగి ఉంటారు. తమ మనసులోని ప్రేమను దాచుకోకుండా, ఎలాంటి సిగ్గు, భయం లేకుండా స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. అది ప్రాణ స్నేహమైనా, స్వచ్ఛమైన ప్రేమ వ్యవహారమైనా..ఒకసారి మనసు ఇస్తే ఎదుటివారిని సంపూర్ణంగా, గుడ్డిగా నమ్ముతారు. బంధాలకు వీరు ఇచ్చే విలువ చాలా గొప్పది.

అన్యాయాన్ని ఎదిరించే తత్వం

వీరు చాలా సున్నితమైన మనసున్నవారు అయినప్పటికీ, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అస్సలు సహించరు. వీరిలో ఒక విప్లవాత్మకమైన కోణం దాగి ఉంటుంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే ధైర్యంగా నిలదీస్తారు. వీరికి కోపం, భావోద్వేగాలు కొంచెం ఎక్కువగానే ఉన్నా..వాటిని సరైన సమయంలో ఎలా అదుపులో ఉంచుకోవాలో వీరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Thursday, October 1, 2026, 10:31 [IST]
Desktop Bottom Promotion