అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.!

జ్యోతిష్య శాస్త్రంలో కేతువును ఒక క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. కేతు గ్రహం తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా, దాని ప్రభావాలు 12 రాశుల వారిపై చూపిస్తాయి. కాగా, ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉండగా.. అక్టోబర్ 3న అదే రాశిలోని మాఘ నక్షత్రంలోని మొదటి స్థానంలోకి ప్రవేశించనుంది. ఈ మార్పు కొన్ని రాశులకు శుభప్రదం కానుండగా.. మరికొన్నింటికి కష్టాలను తీసుకురానుంది. ముఖ్యంగా మూడు రాశులపై కేతు ప్రభావం తీవ్రంగా పడనుంది. ఆ రాశులేంటో చూద్దాం..

October 3rd planet Ketu enters Magha Nakshatra brings difficulties for these zodiac signs

వృషభ రాశి

కేతువు నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి ఊహించని కష్టాలను తీసుకురానుంది. కుటుంబం, ఆస్తి, మానసిక శాంతి విషయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఇంట్లో ఉన్నా కూడా మీరు ఒంటరిగా, అశాంతిగా ఫీలవుతారు. వాహనాలకు సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదని పండితులు సూచిస్తున్నారు. ఇల్లు మారాలని చూస్తున్నా, ఆస్తి క్రయవిక్రయాలపైన పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి. లేదంటే మోసపోవచ్చు. కుటుంబంలో మీ పిల్లలు చేస్తున్న పనులపై దృష్టి సారించండి.

సింహరాశి

ప్రస్తుతం కేతువు ఇదే రాశిలో ఉన్నాడు. రెండు రోజుల్లో నక్షత్ర మార్పు ఉండటంతో ఈ రాశి వారు తమ జీవితానికి సంబంధించిన విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం తగ్గిపోతున్న కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏ పనైనా ఉత్సాహంగా మొదలుపెట్టినా తర్వాత ఆసక్తి కోల్పోతారు. కుటుంబీకుల్లో ఒకరు సడెన్‌గా అనారోగ్యం బారిన పడవచ్చు. బడ్జెట్‌ విషయంలో ఊహించని ఖర్చులు వస్తాయి. ఇతరులతో వివాదాల్లో దూరంగా ఉండటం శ్రేయస్కరం.

October 3rd planet Ketu enters Magha Nakshatra brings difficulties for these zodiac signs

వృశ్చిక రాశి

కేతువు నాల్గవ దృష్టి ప్రస్తుతం ఈ రాశిపై ఉండటంతో వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలిగే ప్రమాదం ఉంది. ఇది డబ్బు, పొదుపు, కుటుంబ విషయాలపై ప్రభావం చూపిస్తుంది. అనుకోని ఖర్చులు మీ బడ్జెట్‌ క్షీణించేలా చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలో ఉండాలి. కుటుంబీకులతో గొడవ లేదా వివాదంలో భాషను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే చిన్న విషయాలు కూడా అపార్థాలకు దారితీయవచ్చు. చేసే పనుల్లో, సంభాషణలో ఆచీతూచీ వ్యవహరించండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Thursday, October 1, 2026, 7:26 [IST]
Desktop Bottom Promotion