Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా?
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు!
రోజూ ఉదయాన్నే అవే ఇడ్లీలు, అవే దోసలు తిని మీకు విసుగొచ్చేసిందా? పోనీ కొత్తగా ఏదైనా చేద్దామంటే ఇంట్లో దోస పిండి లేదా? మీ వంటగదిలో కాస్త బొంబాయి రవ్వ ఉంటే చాలు.. నిమిషాల్లో నోరూరించే రవ్వ బన్ దోస తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకునే ఈ మృదువైన బన్ దోసకు జోడీగా కమ్మని టమాటా చట్నీ ఉంటే ఆ మజాయే వేరు. ఈ రెండు కలిస్తే అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పక తప్పదు.
వంట రాని వారు సైతం ఈ బన్ దోసను చాలా సులభంగా చేసేయొచ్చు. ఒక్కసారి మీ ఇంట్లో ఈ సూపర్ కాంబోను రుచి చూశారంటే, ప్రతి వారం కచ్చితంగా దీన్నే కావాలని అడుగుతారు. నోరూరించే రవ్వ బన్ దోస, దానికి సరిపోయే టమాటా చట్నీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

రవ్వ బన్ దోస, టమాటా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ - 1 కప్పు
పచ్చి బంగాళదుంప - 1
ఉల్లిపాయ - 1
టమాటా - 1
క్యారెట్ తురుము - 1 కప్పు
కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా
బేకింగ్ సోడా - 2 చిటికెలు
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - తగినన్ని
నూనె - కాల్చుకోవడానికి
టమాటా చట్నీ కోసం
టమాటాలు - 3
పచ్చిమిర్చి - 3
వెల్లుల్లి రెబ్బలు - 3
వేయించిన పల్లీలు - ఒక గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టీస్పూన్లు
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్
రవ్వ బన్ దోస, టమాటా చట్నీ తయారీ విధానం
-ముందుగా టమాటా చట్నీ తయారీ కోసం.. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో రెండు టీస్పూన్ల నూనె వేడి చేయండి. అందులో కట్ చేసిన టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయి, టమాటాలు మెత్తబడే వరకు బాగా వేయించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి.
-చల్లారాకా ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని, అందులో గుప్పెడు పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి. అంతే దోసలోకి అదిరిపోయే కమ్మని చట్నీ రెడీ. దీనిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు రవ్వ బన్ దోస తయారీ కోసం..ఒక మిక్సీ జార్ లో బొంబాయి రవ్వ, చెక్కుతీసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ముందుగా ఒకసారి మిక్సీ పట్టండి. ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి దోస పిండిలా మెత్తగా రుబ్బుకోండి. ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని.. అందులో రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, రెండు చిటికెల బేకింగ్ సోడా వేసి పిండిని బాగా కలపండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి తడ్కా పాన్ లేదా చిన్న పాన్ పెట్టుకోండి. చిన్న గిన్నె అయితే దోసలు బన్ ఆకారంలో గుండ్రంగా, లావుగా వస్తాయి. అందులో ఒక టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక.. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడు వేయండి. మరీ పల్చగా రుద్దకుండా కాస్త మందంగా ఉంచాలి. దానిపై మూత పెట్టి మీడియం మంట మీద 2 నిమిషాల పాటు ఉడికించండి.
-ఒకవైపు కాలిన తర్వాత, మూత తీసి నెమ్మదిగా రెండో వైపుకు తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోండి.
-అంతే.. ఎంతో మృదువుగా, కమ్మగా ఉండే వేడివేడి రవ్వ బన్ దోస రెడీ.దీనిని చేసుకున్న టమాటా చట్నీతో అద్దుకుని తింటే అమృతంలా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
