Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు?
పొద్దున్నే లేవగానే ఒక కప్పు ఛాయ్ వేడి వేడిగా గొంతులో పడితే కానీ చాలామందికి రోజు మొదలవ్వదు. పొద్దున లేచినదగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా కొందరు అయితే కప్పుల మీద కప్పుల ఛాయ్ తాగేస్తుంటారు.
ఆఫీసులో డెస్క్ జాబ్ చేసే ఉద్యోగులు అయితే చాలామంది గంటకొకసారి టీ తాగేస్తుంటారు. అయితే అసలు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగడం ఆరోగ్యానికి మంచిది? మోతాదు మించితే ఏమవుతుంది?

అందరికీ ఒకే లెక్కన..
రోజుకు ఎన్ని కప్పులు తాగొచ్చు అనే ప్రశ్నకు అందరికీ సరిపోయే ఒకే సమాధానం లేదు. ఎందుకంటే మనం తాగే టీ రకం, కప్పు సైజు, అందులో ఉండే కెఫిన్ పరిమాణం, మన శరీరం దాన్ని స్వీకరించే తీరు.. ఇవన్నీ వ్యక్తిగతంగా మారుతూ ఉంటాయి.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నివేదిక ప్రకారం.. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ తీసుకోవచ్చు. దీనివల్ల పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ 400 మిల్లీగ్రాముల పరిమితి కేవలం టీకే కాదు. మీరు తీసుకునే కాఫీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్... ఇలా కెఫిన్ ఉండే అన్ని పదార్థాలూ ఈ లెక్కలోకి వస్తాయి.

ఒక కప్పు టీలో ఏముంటుంది?
సాధారణంగా మనం తాగే ఒక కప్పు టీలో సుమారు 75 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. అయితే మీరు టీ ఆకులను ఎంతసేపు మరగబెట్టారు, ఎంత స్ట్రాంగ్ గా చేసుకున్నారు అనేదానిపై ఈ పరిమాణం ఆధారపడి ఉంటుంది.
కాబట్టి రోజుకు 3 నుంచి 4 కప్పుల తేలికపాటి టీ తాగితే పెద్దగా ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ మీరు టీతో పాటు రోజులో ఒకట్రెండు కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ కూడా లాగించేస్తుంటే మాత్రం, మీ శరీరంలోకి వెళ్లే కెఫిన్ స్థాయి ప్రమాదకరంగా పెరిగిపోతుంది.
ఎక్కువైతే వచ్చే చిక్కులు..
అమృతమైనా విషమే అన్నట్లు... కెఫిన్ ఎక్కువైతే శరీరంలో అసౌకర్యం మొదలవుతుంది. తరచూ తలనొప్పి రావడం, ఆందోళన, చేతులు వణకడం, కడుపులో గడబిడ వంటి లక్షణాలు కనిపిస్తాయని FDA హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు టీ తాగే అలవాటు ఉన్నవారు కచ్చితంగా జాగ్రత్త పడాలి. కెఫిన్ మీ మెదడును యాక్టివ్ గా ఉంచి, మీ సహజమైన నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది.
గ్యాస్, గుండెల్లో మంట ఉందా?
గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి టీ ఒక విలన్ లాంటిది. నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతున్న దాని ప్రకారం.. కెఫిన్ ఎక్కువగా ఉండే పానీయాలు కడుపులో యాసిడ్స్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల ఛాతీలో మంట, అజీర్తి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. కాబట్టి మీకు తరచుగా గ్యాస్ సమస్యలు వస్తుంటే టీ తాగడాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
