Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
గురువారం మీ రాశిఫలాలు (16-07-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అయితే మీరు ప్రణాళిక ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. ముందుగా పెండింగులో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడాలి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రోజు మీరు ఎవరితో అయినా మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. అయితే మీరు ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు ఆర్థిక పరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 35
లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి ఉదయం 9 గంటల వరకే

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు బలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి అవకాశం పొందుతారు. అంతేకాదు అందులో టీమ్ లీడర్ గా ఎన్నుకోబడతారు. ఈ రోజు మీరు చాలా ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక పరంగా ఆకస్మిక వ్యయం పెరుగుతుంది. మీకు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి మీ నుండి కొన్ని శుభవార్తలు పొందవచ్చు. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు మీరు చేసే పనిలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు మీ సామర్థ్యాన్ని చూపుతారు. మీకు అభినందనలు కూడా వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్య ఉండదు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు చాలా కాలం తరువాత మీరు మీ స్నేహితుడితో సరదాగా గడుపుతారు. మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడటంతో, మీ చింతలు తొలగిపోతాయి. అయితే, ఈ సమయంలో వారిని ఒత్తిడి నుండి దూరంగా ఉంచడం మీకు మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే వ్యాపారులు ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా ఆందోళన చెందకపోవడమే మంచిది. మీరు దేవుడిపై నమ్మకం ఉంచండి. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఓవర్ టైం కూడా పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ రోజు వ్యాపారవేత్తలు పెద్ద సవాలును ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతుతో, మీరు మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : లైట్ రోజ్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం బాగుండదు. మీరు ప్రతి విషయంలోనూ కోప్పడుతూ ఉంటారు. మీ కుటుంబంలో కొంత గొడవలు జరుగుతాయి. అయితే ఉద్యోగులు ఈరోజు తమ కృషికి మంచి సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులు సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి లాభాలను సంపాదించవచ్చు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో, మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 38
లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. అనవసరమైన పనులకు డబ్బు ఖర్చు చేయకూడదు. ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్ ఆశిస్తున్నట్లయితే, మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందలేరు. అయితే మీరు నిరాశపడకుండా, కష్టపడి పనిచేస్తే, త్వరలో మీకు సరైన ఫలితాలు వస్తాయి. మరోవైపు, వ్యాపారం చేసే వ్యక్తులు తమ వ్యాపార విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు మీరు మీ కోపాన్ని మరింత నియంత్రించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు హెచ్చు తగ్గులు ఉంటాయి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈసారి మీరు చదువుల పట్ల చాలా అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదు. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఒక సువర్ణావకాశాన్ని పొందవచ్చు. భవిష్యత్తులో మీకు మరిన్ని ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో బంధువులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈ రోజు మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు ఆందోళన నుండి విముక్తి పొందుతారు. మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసించబడుతుంది. మీకు ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. మరోవైపు, వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్ట్ కోసం పనిని ప్రారంభించాలనుకుంటే, ఈరోజు మంచిది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది. మీరు అవివాహితులైతే, మీ కోసం ఏదైనా వివాహ ప్రతిపాదన రావచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. అయితే, ఆర్థిక పరంగా ఈరోజు రుణాలు తీసుకోకుండా ఉండటం మంచిది. అలాగే మీరు ఒత్తిడితో కూడిన ఏ పనిని చేయకూడదు. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీ ఇంటి వాతావరణం ఉంటుంది. మీరు మీ కుటుంబానికి పూర్తి మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలోపేతం అవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పని చేసే సమయంలో బాగా ఆలోచించాలి. లేకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ రోజు ఉద్యోగం చేస్తున్న వారు పెండింగ్ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీనియర్ అధికారులు ఈ రోజు మీ పనిని తనిఖీ చేయవచ్చు. మరోవైపు, ఈరోజు వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే, ఈరోజు సమయం మంచిగా ఉండదు. మీరు తొందరపడకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో మీకు మంచి సంబంధం ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7:45 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











