For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం మీ రాశిఫలాలు (04-06-2020)

Rashi phalalu, today rashi phalalu, telugu rashi phalalu, daily rashi phalalu, daily horoscope in telugu, రాశి ఫలాలు, ఈరోజు రాశి ఫలాలు, తెలుగులో రాశి ఫలాలు, ప్రతిరోజూ తెలుగులో రాశి చక్రం

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

చంద్ర గ్రహణం రోజున ఈ రాశుల వారిపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మీ రాశి ఉందేమో చూడండి...చంద్ర గ్రహణం రోజున ఈ రాశుల వారిపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మీ రాశి ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా ఓపికగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు చాలా కఠినమైన రోజు అవుతుంది. మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఎటువంటి ప్రమాదకర నిర్ణయం తీసుకోకపోతే మంచిది. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఎక్కువ సమస్యలు ఉంటాయి. అయితే మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది. మీకు కండరాలకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురుకావచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీ విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఇటీవల తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు పని విషయంలో కష్టంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 45

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

పెళ్లికి ముందే తల్లి అయిన ప్రముఖు సెలబ్రెటీలెవరో తెలుసా....పెళ్లికి ముందే తల్లి అయిన ప్రముఖు సెలబ్రెటీలెవరో తెలుసా....

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో ఆనందించడానికి మీకు అవకాశం లభిస్తుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు మీరు గొప్ప సమయాన్ని వెచ్చిస్తారు. మరోవైపు ఈరోజు మీ పనులన్నింటినీ ఈరోజు సులభంగా పూర్తి చేసేస్తారు. అయితే వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకూడదు. విద్యార్థులు విద్యలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఏకాగ్రతను కొనసాగించడానికి, మీరు ధ్యానాన్ని చేయాలి. అదే సమయంలో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మంచి రోజు అవుతుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు ఆదాయం పెంచడానికి ప్రయత్నిస్తే ఈరోజు మీకు నిరాశ ఎదురవుతుంది. అయితే మీరు ప్రయత్నిస్తూ ఉంటే, కచ్చితంగా త్వరలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ఈరోజు పని చేసే సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 39

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు అప్పగించిన ఏ పని అయినా చాలా నిజాయితీగా చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ముఖ్యమైన రోజు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు సహాయం లభిస్తుంది. మీరు ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఎక్కువ ఆందోళన చెందడం వల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఇబ్బంది పడతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 4:55 నుండి ఉదయం 11 గంటల వరకు

జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు సానుకూల అంశాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే, ప్రతికూల విషయాలను నివారించవచ్చు. మీరు మీ మనసు మార్చుకోవడం మంచిది. ఇతరుల మాటలతో ప్రభావితం అవ్వకండి. మీరు మీ మంచిని చెడుగా భావిస్తారు. వ్యాపారవేత్తలు వారి కృషిని పొందడమే కాకుండా, ఈ రోజు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. మీ పనులు ఏవైనా సులభంగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలరు. ఉద్యోగం లేదా వ్యాపారం అయినా, మీరు ఈ రోజు విజయం సాధిస్తారని భావిస్తున్నారు. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా సమస్య రావచ్చు. మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీరు ఈ రోజు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే, అందుకు సమయం అనుకూలంగా లేదు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుంటే, ఈ రోజు మీకు కొంత ఉపశమనం లభిస్తుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 5:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయితే మీరు స్వతంత్రంగా వ్యవహరిస్తే పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఈ సమయంలో మీరు అదనంగా కష్టపడాలి. మరోవైపు ఈరోజు కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. ఆరోగ్య పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:35 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కెరీర్ విషయంలో కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు ఉంటుంది. మీ పనిలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ఉన్నతాధికారుల సహాయంతో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందవచ్చు. తల్లిదండ్రుల నుండి ఆప్యాయత మరియు ఆశీర్వాదం పొందడం ద్వారా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కలహాలు ఉంటాయి. ఈరోజు మీ ఇంట్లో పెద్ద గొడవ ఉండొచ్చు. ఈరోజు మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. అనవసరంగా వాదించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు ఈ విషయాన్ని శాంతియుతంగా నిర్వహించడానికి ప్రయత్నించడం మంచిది. ఈరోజు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు పూర్తి ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 04, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Thursday, June 4, 2020, 0:38 [IST]
Desktop Bottom Promotion