For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (10-06-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope June 10, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

విదుర నీతి ప్రకారం, డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ ఆదా చేయడం ముఖ్యం..ఎందుకో తెలుసా..విదుర నీతి ప్రకారం, డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ ఆదా చేయడం ముఖ్యం..ఎందుకో తెలుసా..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యల విషయంలో, నమ్మకంగా ఉండే వ్యక్తుల సహాయం తీసుకోవచ్చు. అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని లేదు. మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. మీరు ధైర్యంతో మరియు సహానంతో పని చేయాలి. త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి.

ఈ రోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. త్వరలో మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడి తీసుకోకండి. అయితే ఆర్థిక ప్రయత్నాలు మాత్రం కొనసాగించాలి. మీరు మీ కుటుంబ జీవితంపై కూడా శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కానీ మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. సాయంకాలం వేళ స్నేహితులతో కొంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో సానుకూలంగా ఉంటారు. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ పని విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే, మీరు ఈరోజు దాన్ని కొత్త మార్గంలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. సహోద్యోగులతో సమన్వయం కూడా ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలో వారి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారులు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీకు కుటుంబంతో తగినంత సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మీ బాడీలోని ఈ 8 భాగాలలో మచ్చలుంటే మీ చేతిలో డబ్బే నిలబడదంట... అవెక్కడో చూసెయ్యండి...మీ బాడీలోని ఈ 8 భాగాలలో మచ్చలుంటే మీ చేతిలో డబ్బే నిలబడదంట... అవెక్కడో చూసెయ్యండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు మనసులో అనేక ఆలోచనలు వస్తాయి. ఈరోజు మీ స్వభావం కారణంగా ఇతరులతో తగాదా పడొచ్చు. కాబట్టి ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగులు ఈరోజు పని విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏదైనా పొరపాటు చేస్తే, అంగీకరించడమే మేలు. ప్రత్యేకించి ఉన్నతాధికారులతో లేదా సహోద్యోగులతో వాదించడం మానుకోండి. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ప్రభుత్వ విభాగంలో పని చేసే వారికి ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీ ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. మీరు మీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. తద్వారా మీరు తొందరపాటు మరియు భయాందోళనలను నివారించవచ్చు. మరోవైపు, వ్యాపారులు కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు మరింత జాగ్రత్త వహించండి. మీరు డబ్బు విషయంలో ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, ఈ రోజు మీరు నిరాశ చెందుతారు, కానీ మీరు ప్రయత్నించడం మానేయమని దీని అర్థం కాదు. ప్రతిరోజూ ఒకేలా ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల, మీరు ఈ రోజు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మీ ప్రియమైన వారికి ఈ సమయంలో మంచి సంరక్షణ అవసరం.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన సమస్యలు ఏవైనా ఉండొచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు ప్రశాంతంగా ఆలోచించాలి. మీరు తెలివిగా పని చేయాలి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మీ సమన్వయాన్ని చక్కగా ఉంచడానికి మరియు భవిష్యత్తులో అలాంటి ప్రయోజనాలను పొందడానికి మీరిద్దరూ ప్రయత్నిస్తే మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

బల్లి మీ బాడీలోని ఆ పార్ట్ పై పడితే అదృష్టమా... దురదృష్టమా? ఇప్పుడే తెలుసుకోండి...బల్లి మీ బాడీలోని ఆ పార్ట్ పై పడితే అదృష్టమా... దురదృష్టమా? ఇప్పుడే తెలుసుకోండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా మంచి అనుభూతి కలుగుతుంది. మీ మనస్సును దగ్గరి వారితో పంచుకోవడం ద్వారా, మీ ఒత్తిడి తగ్గుతుంది. మీరు సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మీ నిర్ణయాలన్నింటినీ జాగ్రత్తగా తీసుకోండి. తద్వారా మీరు మీ సమస్యలను వీలైనంత త్వరగా వదిలించుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు విజయం సాధించవచ్చు. ఈరోజు మీ కుటుంబంతో సరదాగా ఉండే రోజు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా గుర్తుండిపోయే రోజు గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి సమస్య ఉండదు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు పనిలో చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు సీనియర్ల నుండి కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. వ్యాపారులు చిన్న పెట్టబడులు పెట్టడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. అంతేకాకుండా, మీరు కొత్త వ్యాపార ప్రణాళికకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మరోవైపు ఈరోజు మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాల్లో కొంత ఒత్తిడికి లోనవుతారు. వారుమీ అంచనాలను అందుకోకపోతే మీరు వారికి మార్గనిర్దేశం చేయాలి. కఠినంగా ప్రవర్తించవద్దు. ప్రేమతో ప్రవర్తించండి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రవర్తన సాధారణంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా బిజీగా ఉండటం వల్ల వారితో ఎక్కువ సమయం గడపలేరు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. ఈరోజు సాయంత్రం మీరు ఒక శుభవార్త వినొచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో పెద్ద ప్రయోజనాలు పొందొచ్చు. దీని వల్ల మీ ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగుపడుతుంది. అయితే మీరు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీ చేతిలో నుండి డబ్బు సులభంగా చేజారిపోతుంది. ఈరోజు మీరు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను పొందుతారు. మీరు గొప్ప విజయాన్ని పొందుతారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పవిత్రంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలను లేవనెత్తకండి. ఎందుకంటే ఇలాంటివి మీ ఇద్దరి మధ్య గొడవలకు కారణం కావచ్చు. పని విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనిని పూర్తి శ్రద్ధతో చేస్తారు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు అలసిపోవచ్చు. మీరు మానసిక శాంతిని కాపాడుకోవాలంటే, ప్రతిరోజూ ధ్యానం చేయాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో గొడవలు పెంచుకునే అవకాశం ఉంది. అయితే మీరు దీని గురించి తర్వాత చింతిస్తారు. అంతేకాదు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతుతో, మీ విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు కూడా పెద్దగా ఉండకపోవచ్చు. మీ ఆదాయం మరియు ఖర్చులను సమతుల్యం చేసుకోవడం మంచిది. పని విషయంలో ఈరోజు వాతావరణం సాధారణంగా ఉంటుంది. కానీ మీ యజమాని వైఖరి కఠినంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు బయట తినడం మానుకోండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 10, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Tuesday, June 9, 2020, 18:19 [IST]
Desktop Bottom Promotion