For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (20-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

<strong>విదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండి...</strong>విదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక చిన్న పొరపాటు కూడా చేయకూడదు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే మీరు వారి సహాయం తీసుకోవాలి వ్యాపారులు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకూడదు. మీకు ఏదైనా లాభం వచ్చే అవకాశం ఉంటే, అస్సలు వదులుకోవద్దు. విద్యార్థులు బద్ధకాన్ని వదిలేయాలి. మీరు విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 4:15 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీరు వాటినన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతిమంగా విజయం సాధిస్తారు. వ్యాపారులు కూడా ఆర్థిక లాభాలను పొందుతారు. చాలా కాలంగా ఉన్న అప్పులను కూడా తీర్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, మీరు మీ ప్రణాళికపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు పెరుగుతాయి. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:10 నుండి రాత్రి 9:50 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. ఈరోజు కొంతమంది కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగులకు ఈరోజు కొత్త ప్రాజెక్టులో పని చేసే అవకాశం లభిస్తే, ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. వ్యాపారులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యల వల్ల మీ పనులు పెండింగులో పడొచ్చు. అయితే అలాంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు, కాబట్టి ఎక్కువగా చింతించకండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

సూర్య గ్రహణం 2020 : జూన్ 21న చేయాల్సిన, చేయకూడని పనులేంటో చూడండి...సూర్య గ్రహణం 2020 : జూన్ 21న చేయాల్సిన, చేయకూడని పనులేంటో చూడండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు రుణాలు తీసుకోకూడదు. అలాగే అనవసరమైన వాటికి ఎక్కువగా ఖర్చు చేయకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు మీ ఉద్యోగం గురించి చాలా ఆందోళన చెందుతారు. మీరు మీ పనిపై మాత్రమే ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వ్యాపారులు తమ వినియోగదారులతో సన్నిహితంగా ఉండాలి. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:55 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పనిలో పవిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు సీనియర్ అధికారుల నుండి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. మీరు మీ పనితీరులో మెరుగుదల చూస్తారు. ఈరోజు మీ పనితో సంతృప్తి చెందుతారు. వ్యాపారులకు ఈరోజు ఏవైనా కొత్త ఒప్పందాలు జరగొచ్చు. వ్యాపారులు ఈరోజు ప్రయాణం చేసేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా వినొచ్చు. విద్యార్థులు ఈరోజు పెద్ద విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా బాధపడతారు. మీరు ఈరోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈ సమయంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అయితే పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను ఆశించవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీకు చాలా ఒత్తిడిని కలిగిస్తుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

Solar Eclipse 2020 : ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం... మీ రాశి ఉందేమో చూడండి...Solar Eclipse 2020 : ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం... మీ రాశి ఉందేమో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు పనిలో చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధించే అవకాశం ఉంది. మీకు ఈరోజు అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పనిని శ్రద్ధగా, నిజాయితీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు కూడా ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మీరు ఈ రోజు పెట్టుబడి పెట్టకుండా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. అయితే మీరు ప్రతికూల విషయాలకు ప్రభావితం కాకూడదు. కార్యాలయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఎలాంటి వివాదాల్లో తలదూర్చకండి. లేకపోతే మీరు అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్టు కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, సమయం అనుకూలంగా లేదు. మరోవైపు మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీ పట్ల మంచిది. మీరు ఈరోజు వారి నుండి కొన్ని ప్రయోజనాలు కూడా పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య ఉండొచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరమైన విషయాలపై ఆవేశం పడటం మానుకోవాలి. ఉద్యోగులు ఈరోజు అకస్మాత్తుగా పెద్ద సమస్యను ఎదుర్కోవచ్చు. మీకు పనిలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. దీని సకాలంలో మీ పనులు పూర్తి కావు. మీరు చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు లాభాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఈరోజు ఉద్యోగులు సోమరితనాన్ని నివారించాలి. మీరు మీ పని పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు చాలా కష్టపడాలి. ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మనస్సులో ఏదైనా సమస్య ఉంటే, మీరు దానిని మీ ప్రియమైన వారితో పంచుకోవాలి. బహుశా మీ సమస్య పరిష్కరించబడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీ సంపద కూడా పెరుగుతుంది. అలాగే మీ ఖర్చులు కూడా తగ్గిపోతాయి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పొరపాటు కూడా చేయకూడదు. మరోవైపు విద్యార్థులు విద్యలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటు ఉంటే, మీరు ధ్యానాన్ని ఆశ్రయించాలి. మీరు మీ అభ్యాసాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో మీపై ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, సిగరెట్లు మరియు ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 10:20 నుండి రాత్రి 7:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి పెద్దలకు మార్గదర్శకత్వం లభిస్తుంది. ఈ రోజు, మీ తమ్ముడు లేదా సోదరి కోసం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. ఈ కారణంగా ఇంటి వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనిలో వేగం పెంచుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఈ రోజు మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : సింక్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:45 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 20, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Friday, June 19, 2020, 22:17 [IST]
Desktop Bottom Promotion