For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (30-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

<strong>జూలై ఉపవాసాలు-పండుగలు-గ్రహణాలు, జూలైలో జన్మించిన వారి వ్యక్తిత్వాలు..!!</strong>జూలై ఉపవాసాలు-పండుగలు-గ్రహణాలు, జూలైలో జన్మించిన వారి వ్యక్తిత్వాలు..!!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు అనేక విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీరు ప్రశాంతంగా ఉంటే, అన్నింటిని సులభంగా అధిగమించవచ్చు. మరోవైపు మీ వైవాహిక జీవితం శృంగారంతో నిండి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఈరోజు పని విషయంలోనే బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెట్టాలి. తద్వారా మీరు భవిష్యత్తులో సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు తేలికపాటి వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : రాత్రి 9:20 నుండి రాత్రి 10 గంటల వరకే

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈరోజు సమయం మీకు అనుకూలంగా లేదు. మీ సమస్యలు కూడా పెరుగుతాయి. ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. కానీ సమయానికి మీ పని అంతా పూర్తవుతుంది. ఆఫీసులో పని చేసే ఉద్యోగులకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టబోతుంటే, చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు ఒకేసారి ఎక్కువ పనులను చేయడంతో, కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి సమయంలో ఒక విషయంపై దృష్టి పెడితే మంచిది. అదే సమయంలో, ఉద్యోగం చేసేవారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తుంటే సమయం అనుకూలంగా ఉండదు. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. మరోవైపు, జీవిత భాగస్వామితో వైరాన్ని వీలైనంత త్వరగా అంతం చేయడానికి ప్రయత్నించండి. మీ మధ్య మనస్పర్దలు, మీ ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు

<strong>కుబేరుడిని ఇలా పూజిస్తే ధనవంతులు అవ్వడం ఖాయం, సుఖ సంపదలు మీ సొంతం! అప్పుడు ఈ మంత్రాలను జపించండి!</strong></p><p>కుబేరుడిని ఇలా పూజిస్తే ధనవంతులు అవ్వడం ఖాయం, సుఖ సంపదలు మీ సొంతం! అప్పుడు ఈ మంత్రాలను జపించండి!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు జీవితంలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా శక్తివంతంగా మరియు సానుకూలంగా ఉంటారు. మీ విశ్వాసం బలంగా ఉంటుంది. మీరు మీ పనిని చాలా హృదయపూర్వకంగా చేస్తారు. మీరు ఉద్యోగం చేసి, పెద్ద ప్రాజెక్ట్‌లో పనిచేస్తుంటే, మీ సహోద్యోగుల ఆలోచనలకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇది మీకు ఎంతో సహాయపడుతుంది. వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీరు ప్రశాంతమైన మనస్సుతో మీ పనిపై దృష్టి పెడితే, అప్పుడు మీ సమస్యలు తగ్గుతాయి. మీరు వ్యాపారం చేస్తే, వస్తువులను అప్పుగా ఇవ్వకుండా ఉండాలి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. అయితే, మీరు డబ్బు గురించి ఆందోళన చెందుతూనే ఉంటారు. ఈ రోజు వివాహితులకు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు మానసికంగా బలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ యజమాని యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆలోచిస్తుంటే, మీ కృషి ఫలితాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మంచి సంబంధాన్ని ఉంచడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

అక్షయ పాత్ర గురించి మనం నమ్మలేని నిజాలు...అక్షయ పాత్ర గురించి మనం నమ్మలేని నిజాలు...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే, అనవసరమైన చింతలకు దూరంగా ఉండాలి. అందుకే మీరు ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. పని విషయంలో ఈరోజు కొంత నెమ్మదిగా ఉంటుంది. మీ పనులలో చాలా వరకు పెండింగులో పడిపోతాయి. వ్యాపారులు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఆదాయం కంటే ఎక్కువ ఖర్చవుతుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఈరోజు నిరుద్యోగులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు, మీ పని అంతా సమయానికి పూర్తయ్యేలా, మీరు మీ రోజును ప్లాన్ చేసుకోవడం మంచిది. నిర్లక్ష్యాన్ని మానుకోవాలి. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు గొప్పగా ఉంటుంది. మీకు ఆకస్మికంగా డబ్బు అందుతుంది. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. పెండింగు పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ పనిని చూసి మీ యజమాని ప్రశంసిస్తారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా, మీ వ్యాపారం కూడా వేగంగా పెరుగుతుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ మరియు పరస్పర బంధం కుటుంబంతో సంబంధాన్ని పెంచుతుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్ల భద్రతతో పాటు, మీరు మీ భద్రతను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రత్యేకంగా మెడిసిన్ వంటి వ్యాపారంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఈరోజు మీరు కష్టపడి పని చేస్తే, మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. అయితే అనవసరంగా చింతించడం మానుకోవాలి.ఎందుకంటే ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఈ రోజు ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. ఆరోగ్య పరంగా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగులు, ఉన్నతాధికారులతో మంచి సంబంధాల కొనసాగిస్తే, మీకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది. మరోవైపు, వ్యాపార వ్యక్తులు ఈరోజు విజయం సాధించే అవకాశం ఉంది, ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు మీకు శుభవార్త లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో సంతోషకరమైన రోజు అవుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులు తమ వ్యాపారాన్ని నెమ్మదిగా విస్తరించడానికి ప్రయత్నించాలి. మీరు మీ వ్యాపార నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి. అలా చేస్తే లాభానికి బదులు నష్టం రావచ్చు. ఉద్యోగులకు ఈరోజు పని విషయంలో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. కానీ అలాంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. ఉన్నతాధికారుల సహాయంతో ఈ సమస్య త్వరలోనే పరిష్కరించబడుతుంది. ఆర్థిక పరంగా సాధారణంగానే ఉంటుంది. అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ఆప్యాయత మరియు మద్దతుతో, మీరు మీ సొంత విశ్వాసాన్ని కొనసాగిస్తారు. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 30, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Monday, June 29, 2020, 19:41 [IST]
Desktop Bottom Promotion