For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (21-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శనివారం వారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీకు ఆర్థిక పరమైన ఆందోళనలు తొలగిపోతాయి. మీరు ఈరోజు అదనపు ఆదాయం సంపాదించవచ్చు. అయితే మీరు ఈరోజు బాధ్యతగా పని చేయాలి. ఉద్యోగులు ఈరోజు కొంచెం బిజీగా ఉంటారు. దీని వల్ల మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. మరోవైపు, ఈ రోజు పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఆరోగ్య పరంగా అంతా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మీరు మంచిగా ఊపిరి పీల్చుకుంటారు. మీ కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీకు తల్లిదండ్రుల మద్దతు కూడా లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరమైన విషయాలలో సొంత నిర్ణయాలను తీసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందొచ్చు. మీ పెరిగిన విశ్వాసం మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ కోసం, మీరు తీసుకున్న నిర్ణయాలు ఇతరుల కన్నా ఎక్కువ ముఖ్యమైనవి. ఈ రోజు మీరు మీ భాగస్వామితో లాంగ్ డ్రైవ్‌ను ఆనందిస్తారు. మరోవైపు, మీరు ఒంటరిగా ఉంటే మరియు మీకు ప్రేమ ప్రతిపాదన వస్తే, మీరు వాటిని విస్మరించకూడదు కానీ వారికి అవకాశం ఇవ్వండి. ఈ రోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందుల్లోెకి నెట్టేస్తాయి.

ఉద్యోగులు ఉన్నతాధికారుల సలహా నుండి పెద్ద ప్రయోజనం పొందవచ్చు. మీరు ఏ కష్టమైన పనిని అయినా సులభంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా పనిచేస్తే మీ వ్యాపారం వేగంగా పెరుగుతుంది. భవిష్యత్తులో మీకు సరైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రోజు మీరు వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రోజు, జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంట వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెట్టకుండా ఉంటేనే, మీ విలువైన సమయం మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు, మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు సంతోషకరమైన వివాహ జీవితాన్ని పొందుతారు. అయితే ప్రేమలో ఉన్న జంటలు ఈరోజు కొంత ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారు. మరోవైపు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మీ పాత బకాయిలను చెల్లించవచ్చు. మీ సమస్యలు ఈరోజు కొంత పరిష్కరించబడతాయి. పనిలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 7:20 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు నిజాయితీగా కష్టపడాలి. పని విషయంలో మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనే మీ కల త్వరలో నెరవేరుతుంది. అయితే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకపోతే మంచిది. ఆర్థిక విషయానికొస్తే, మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఇతరుల మాటలను పట్టించుకోకపోవడమే మంచిది. కుటుంబ సమస్యలు మీపై ఒత్తిడిని పెంచుతాయి. అయితే పనికి సంబంధించిన విషయాలలో ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకండి. ఈ రోజు మీరు మీ సమస్యలను మీ జీవిత భాగస్వామితో కలిసి పంచుకోవచ్చు. అలాగే, మీరు ఈ రోజు మీ భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. వివాహితులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి. మీరు మీ ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించడం మంచిది. కుటుంబ సభ్యులతో సమస్యలను చర్చించవచ్చు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 5:05 నుండి సాయంత్రం 3:10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అకస్మాత్తుగా పెద్ద లాభం రావడంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో ఈరోజు కొంత ఇబ్బందులు ఉంటాయి. మీరు పనిలో చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ మీకు సరైన ఫలితాలు రాకపోతే, మీరు కొంత ఓపిక పట్టాలి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. పని విషయంలో ప్రతి ఒక్కరూ మీ సామర్థ్యాన్ని మెచ్చుకుంటారు. ఈ రోజు మీరు మీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంత అద్భుతమైన సమయాన్ని వెచ్చిస్తారు. అది మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు విజయవంతంగా ఉంటుంది. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్: మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంతరం 4:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీ ఖర్చులను నియంత్రించుకుంటే పరిస్థితి కొంత అదుపులో ఉంటుంది. మీరు మీ కుటుంబ సమస్యలపై కొంచెం శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామిని అభిప్రాయాన్ని విస్మరించవచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:20 గంటల వరకు

English summary

Daily Horoscope March 21, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Saturday, March 21, 2020, 1:24 [IST]
Desktop Bottom Promotion