For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (02-05-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మే నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా బాగుంటుంది. ఈరోజు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీరు ఈరోజు అదనపు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో మీకు అందరి మద్దతు లభిస్తుంది. దీని వల్ల మీరు ఆనందంగా ఉంటారు. అయితే మీ జీవిత భాగస్వామితో ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. మీరు పని విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ పేలవమైన పనితీరు కారణంగా మీ సీనియర్లు మీతో చాలా నిరాశ చెందుతారు. వ్యాపారులకు ఈరోజు కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. దీని వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. మరోవైపు మీ కుటుంబంతో ఈరోజు మంచిగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సహాయంతో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం ఈరోజు బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా బాగానే ఉంటారు. మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఉద్యోగులు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీపై ఒత్తిడి ఉంటే, మీరు ఉద్యోగాన్ని మార్చడం గురించి ఆలోచించవచ్చు. మీ కుటుంబ జీవితంపై ఈరోజు మీరు శ్రద్ధ చూపాలి. అప్పుడే మీకు తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. అలాగే ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో గడిపేందుకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు వారి స్నేహితులు లేదా వారికి ఇష్టమైన వారితో సంతోషకరమైన క్షణాలు గడిపేందుకు ఇష్టపడతారు. ఈరోజు అవివాహితులు వివాహం గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీకు పని విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు కష్టపడి పని చేయాలి. ఇది మీ బాధ్యతలను పెంచుతుంది. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీకు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఏవైనా కొత్త పనులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు. మీరు తగిన సమయం కోసం వేచి ఉండాలి. అయితే ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఈరోజు వివాహితులకు చాలా మంచి రోజు అవుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ బాగా ఉంటుంది. శృంగార జీవితంలో మీ భాగస్వామితో మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు విద్యార్థులకు ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో విభేదాలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి మీరు ఊహించిన విధంగా సహకారం ఉండదు. ఇది మీ భావాలను చాలా బాధపెడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీకు ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. పని విషయంలో అలసట ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు గందరగోళంగా ఉంటుంది. మీరు తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ముందుగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 9:55 గంటల వరకు

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించాలి. వీలైతే, ఈరోజు వారితో ఎక్కువ సమయం గడపాలి. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే, మీరు ఇప్పటినుండే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల విషయంలో సమతుల్యత పాటించాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మానసిక శాంతి ఉండకపోవచ్చు. మీకు ఏ సమస్య అయినా, వెంటనే దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఇలాంటి స్థాయిలో మీరు ధైర్యంగా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధంలో సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రణాళికలలో కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. స్నేహితులు మీ ఉత్సాహాన్ని పెంచుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది. దీని ప్రభావంతో కొన్ని పనులను పూర్తి చేయగలరు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. మీరు పురోగతి సాధించే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు మీ సీనియర్ల నుండి శుభవార్తలను వింటారు. వ్యాపారులకు ఈరోజు మెరుగుదల ఉంటుంది. చాలా కాలం తరువాత ఈరోజు మీరు మీ కుటుంబంతో ఉత్తేజకరమైన రోజు గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలోపేతం అవుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా, మీరు మానసికంగా కూడా శాంతి మరియు ఆనందాన్ని పొందుతారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మీ మానసిక స్థితి కూడా మారుతుంది. మీరు కొంచెం ప్రయత్నిస్తే, మీ మధ్య దూరం ముగుస్తుంది. పని విషయంలో, మీరు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది. మీరు ఉన్నతాధికారుల సహాయం తీసుకోవాలి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఈరోజు మీరు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన నిర్ణయాలలో ఇతరుల సలహాలను, ఆదేశాలను పాటిస్తే, మీకు నష్టం ఎదురుకావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. చాలా విషయాల్లో మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సంబంధాలు బాగుంటాయి. మీకు పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు కొంత ఆర్థిక నష్టాలను చూడాల్సి ఉంటుంది. పని విషయంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మరోవైపు ఈరోజు కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ప్రేమ విషయంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీరు ఈరోజు అందమైన క్షణాలను గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope May 2, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Saturday, May 2, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more