For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

మే 2020 రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి..! ఇలాంటి అంచనాలన్నీ వేద జ్యోతిష శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి.

|

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు మే నెలలో ఈ విధంగా ఉన్నాయి. ఈ నెలలో ఓ రాశి వారికి ఆదాయ పరంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఆదాయ పరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో గొడవలు పెరగొచ్చు. కొన్ని రాశుల విద్యార్థులకు ఈ నెలలో చాలా కష్టంగా ఉంటుంది.

May 2020 Monthly Horosocope in Telugu

కొన్ని రాశుల ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓ రాశి ఉద్యోగులకు ఈ నెలలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఇలా మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను గురించి తెలుసుకోండి. మరి ఆలస్యం చేయకుండా మే మాసంలో ఏయే రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

ఈ రాశి వారు ఈ నెల ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అయితే క్రమంగా మీకు ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో కూడా చిన్న సమస్యలు వస్తాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఈ నెలలో మెరుగయ్యేందుకు ఈ నెలలో బలమైన అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ నెలలో కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ నెల ఉపాధి చేసుకునే ప్రజలకు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మీరు ఇటీవల ఉద్యోగ మార్పు చేసుకుని, ఉంటే మీరు కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో వివాహ జీవితం మిశ్రమంగా ఉంటుంది.

రాశిచక్ర మూలకం: అగ్ని

రాశి చక్ర గ్రహం: మార్స్

లక్కీ నంబర్లు : 2, 11, 23, 35, 44, 56

లక్కీ డేస్ : శుక్రవారం, ఆదివారం, బుధవారం, గురువారం

లక్కీ కలర్స్ : ఎల్లో, గ్రీన్, వైట్, స్కై బ్లూ

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈ నెలలో చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే అన్నింటిలోనూ మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. పని పరంగా, మీ నిరంతర ప్రయత్నాల వల్ల, మీరు సరైన ఫలితాలను పొందవచ్చు. ఈ సమయంలో మీ ప్రతిభ అందరికీ తెలుస్తుంది. ఈ నెలలో వ్యాపారులు ఎక్కువగా కష్టపడాలి. ముఖ్యంగా మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. వివాహితులు ఈ నెలలో కొన్ని విభేదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈ నెలలో మంచిగా ఉంటుంది. అయితే ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

రాశిచక్ర మూలకం: భూమి

రాశి చక్ర గ్రహం: శుక్రుడు

లక్కీ నంబర్లు : 2, 8, 15, 22, 32, 40, 54

లక్కీ డేస్ : సోమవారం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం

లక్కీ కలర్స్ : మెరూన్, డార్క్ బ్లూ, ఆరెంజ్, క్రీమ్

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈ నెలలో మంచిగా ఉంటుంది. అయితే మీరు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు తెలివిగా వ్యవహరించి సమస్యలను అధిగమించాలి. అప్పుడే మీరు ఊహించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు వారి సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడకండి. అలాగే మీరు పూర్తి ధైర్యంతో మరియు విశ్వాసంతో పని చేయాలి. వ్యాపారులకు ఈ నెలలో మిశ్రమంగా ఉంటుంది. మీ పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి కావచ్చు. ఆర్థిక పరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎందులో అయినా పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీకు ఉపశమనం లభిస్తుంది. అయితే కుటుంబ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు పెరగవచ్చు.

రాశిచక్ర మూలకం: గాలి

రాశి చక్ర గ్రహం: మెర్క్యూరీ

లక్కీ నంబర్లు : 2, 18, 20, 33, 48, 51

లక్కీ డేస్ : గురువారం, ఆదివారం, శనివారం, సోమవారం

లక్కీ కలర్స్ : బ్రౌన్, పర్పుల్, రెడ్, పింక్

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

ఈ రాశి వారికి ఈనెలలో పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. ఈ నెలలో మీ కెరీర్‌లో కొన్ని మార్పులు సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అనిపిస్తుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీరు ఈ నెలలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ నెల మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీరు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నెలలో విద్యార్థులకు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ బలహీనతలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఎటువంటి సమస్య ఉండదు. అలాగే సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.

రాశిచక్ర మూలకం: నీరు

రాశి చక్ర గ్రహం: చంద్రుడు

లక్కీ నంబర్లు : 4, 19, 27, 36, 43, 58

లక్కీ డేస్ : మంగళవారం, సోమవారం, గురువారం, ఆదివారం

లక్కీ కలర్స్ : రెడ్, వైట్, ఆరెంజ్, డార్క్ బ్లూ

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అయితే ఈ నెల ప్రారంభంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే నెల మధ్యలో పరిస్థితులు కొంత మారే అవకాశం ఉంది. చాలా కష్టం తర్వాత మీకు డబ్బు సంపాదించడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ఈ నెలలో విద్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. వ్యాపారులకు ఈ నెలలో మంచి లాభం వస్తుంది. అయితే ఉద్యోగులకు ఈ నెలలో కొంత కఠినంగా ఉంటుంది. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం: సూర్యుడు

లక్కీ నంబర్లు : 2, 8, 17, 31, 45, 52

లక్కీ డేస్ : శుక్రవారం, గురువారం, మంగళవారం, సోమవారం

లక్కీ కలర్స్ : లైట్ ఎల్లో, క్రీమ్, స్కై బ్లూ, గ్రీన్, మెరూన్

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈనెలలో కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. చిన్న చిన్న విషయాలకే కుటుంబసభ్యుల మధ్య తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ సోదరులతో ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావచ్చు. ప్రేమ విషయంలో ఈనెల చాలా ముఖ్యమైనది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. మీరు కష్టపడి పని చేస్తారు. ఉద్యోగులకు అకస్మాత్తుగా బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరంగా మీకు పెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది. అందుకే మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

రాశిచక్ర మూలకం: భూమి

రాశి చక్ర గ్రహం: మెర్క్యూరీ

లక్కీ నంబర్లు : 5, 14, 23, 30, 49, 50

లక్కీ డేస్ : శనివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం

లక్కీ కలర్స్ : క్రీమ్, ఆరెంజ్, పర్పుల్, గ్రీన్

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈ నెలలో అనేక విషయాల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఈ నెలలో మంచి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు పొందాలనుకునే వారికి, ఉద్యోగం మార్పు చేయాలనుకునే వారికి సానుకూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్నంత జీతం కూడా లభిస్తుంది. ఈ నెలలో వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ నెలలో కొన్ని లాభాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమ మరియు ఐక్యత కూడా ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

రాశిచక్ర మూలకం: గాలి

రాశి చక్ర గ్రహం: శుక్రుడు

లక్కీ నంబర్లు : 1, 7, 14, 24, 30, 45, 59

లక్కీ డేస్ : శనివారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం

లక్కీ కలర్స్ : వైట్, పర్పుల్, ఎల్లో, రెడ్

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈ నెలలో ఎలాంటి పని అయినా చాలా శ్రద్ధగా చేస్తారు. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. అంతేకాదు, మీరు చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఈ సమయంలో మీరు గొప్ప అనుభూతి చెందుతారు. వ్యాపారుల సమస్యలు పరిష్కరించబడతాయి. మీ వ్యాపారం పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై చాలా జాగ్రత్త వహించాలి. వ్యక్తిగతంగా అయితే ఈ నెలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు. మరోవైపు ఆర్థిక పరంగా ఈ నెలలో మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక నిర్ణయాల విషయంలో తొందరపడకపోవడమే మంచిది.

రాశిచక్ర మూలకం: నీరు

రాశి చక్ర గ్రహం: మార్స్ అండ్ ఫ్లూటో

లక్కీ నంబర్లు : 6, 18, 29, 33, 40, 54

లక్కీ డేస్ : సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం

లక్కీ కలర్స్ : బ్లూ, వైట్, డార్క్ గ్రీన్, రోజ్

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈ నెలలో కుటుంబ సమస్యల గురించి చాలా ఆందోళన చెందుతారని మీ గ్రహాలు స్థానాలు సూచిస్తున్నాయి. దీని వల్ల మీ ఇంట్లో వాతావరణం మంచిగా ఉండదు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటమే మంచిది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో మంచిగా వ్యవహరించాలి. లేదంటే అక్కడ కూడా ఇబ్బందులు తప్పవు. ఈ నెలలో ఉద్యోగులు చాలా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఈ నెలలో చాలా నిరాశకు గురవుతారు. అయితే మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు. మీరు నిరంతర ప్రయత్నాలు కొనసాగించాలి. లేదంటే మీకు విజయం అనేది దక్కదు. అలాగే ఈ సమయంలో మీ ప్రత్యర్థులు బాగా చురుకుగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈ నెలలో సాధారణంగా ఉంటుంది.

రాశిచక్ర మూలకం: అగ్ని

రాశి చక్ర గ్రహం: గురుడు

లక్కీ నంబర్లు : 3, 5, 17, 21, 36, 48, 50

లక్కీ డేస్ : మంగళవారం, శనివారం, గురువారం, సోమవారం

లక్కీ కలర్స్ : మెరూన్, డార్క్ బ్లూ, క్రీమ్, ఆరెంజ్

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ముఖ్యమైనది. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వాటిని అధిగమించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది. అయితే పెట్టుబడులు మాత్రం అస్సలు పెట్టకుండా ఉండాలి. విద్యార్థులు ఈ నెలలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు. మీరు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ నెలలో ఏదైనా సమస్య ఉంటే, మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ప్రేమ మరియు చనువు అందరిలోనూ ఉంటాయి. వివాహితులకు ఈ నెలలో మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాలు బాగానే ఉంటాయి.

రాశిచక్ర మూలకం: భూమి

రాశి చక్ర గ్రహం: శని

లక్కీ నంబర్లు : 6, 18, 24, 36, 44, 54

లక్కీ డేస్ : సోమవారం, గురువారం, మంగళవారం, శనివారం

లక్కీ కలర్స్ : క్రీమ్, పర్పుల్, రెడ్, కుంకుమ

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈ నెలలో పని పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు ఈ నెలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతికూల ఫలితాలు వస్తాయి. అయితే ఉద్యోగులకు మాత్రం అదనపు బాధ్యతలు వచ్చి పడతాయి. అయితే మీరు ఒత్తిడిని అనుభవిస్తుంటే, ఉన్నతాధికారుల సహాయం తీసుకునేందుకు ప్రయత్నించాలి. వారితో మంచి సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి. వ్యాపారులకు ఈ నెలలో కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాంటి రిస్క్ వంటివి తీసుకోకుండా ఉండాలి. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు అంతమవుతాయి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

రాశిచక్ర మూలకం: గాలి

రాశి చక్ర గ్రహం: యురేనస్, సాటర్న్

లక్కీ నంబర్లు : 9, 17, 22, 39, 46, 52

లక్కీ డేస్ : గురువారం, సోమవారం, శుక్రవారం, మంగళవారం

లక్కీ కలర్స్ : డార్క్ రెడ్, ఎల్లో, బ్లూ, బ్రౌన్

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ కుటుంబంతో చాలా సరదాగా గడుపుతారు. మీ కుటుంబం పట్ల మీ ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది ముఖ్యంగా తోబుట్టువులతో. ఈ నెల విద్యార్థులకు చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అధ్యయనాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరంగా కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చులు పెరుగుతాయి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. పని విషయంలో ఈ నెలలో ఎలాంటి ప్రత్యేకత ఉండదు. మీరు నిజాయితీగా మరియు కష్టపడి పనిచేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈ సమయం మీకు మంచిగా ఉంటుంది.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం: నెఫ్ట్యూన్, గురుడు

లక్కీ నంబర్లు : 4, 14, 26, 34, 45, 55

లక్కీ డేస్ : మంగళవారం, గురువారం, శనివారం, సోమవారం

లక్కీ కలర్స్ : గ్రీన్, పర్పుల్, రెడ్, ఎల్లో

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

May 2020 Monthly Horosocope in Telugu

For some zodiac signs, the month of May will be auspicious and for others it will be inauspicious. However, there is only one way to find out what the stars have in store for you, that is by reading your monthly horoscope.
Desktop Bottom Promotion