Latest Updates
-
ఈరోజు రాశి ఫలాలు (29.03.26): ఆదివారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి! -
సమ్మర్ స్పెషల్..ఎలాంటి కృత్రిమ రంగులు లేని స్వచ్ఛమైన రాజస్థానీ మట్కా కుల్ఫీ..టేస్ట్ కేక! -
డెలులు డేటింగ్ అంటే ఏంటీ?..డేటింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే! -
బ్రెడ్ లేకుండానే బ్రెడ్ పకోడీ..టీ టైమ్లో దీని మజాయే వేరు..జస్ట్ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
అచ్చం బేకరీ రుచితో.. ఇంట్లోనే శాండ్ విచ్ చేసుకోండిలా..పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా.. -
డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్! -
పప్పు నానబెట్టే పనే లేదు..మిగిలిపోయిన బ్రెడ్ తో 15 నిమిషాల్లో కరకరలాడే వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
April 2026 Festivals: హనుమాన్ జయంతి నుండి అక్షయ తృతీయ వరకు..ఏప్రిల్ నెల పండుగల పూర్తి జాబితా! -
ముంబై స్పెషల్ బటాటా పోహా.. ఉదయం పూట నోరూరించే, కడుపు నింపే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్! -
ఈరోజు రాశి ఫలాలు (28.03.26): శనివారం నాడు మీ అదృష్టం ఎలా ఉండబోతోంది?
గురువారం మీ రాశిఫలాలు (07-05-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మరోవైపు, ఈ రోజు మీ పిల్లల విద్యకు సంబంధించి కొంత ఒత్తిడికి లోనవుతారు. మీరు మీ వివాహ జీవితం గురించి మాట్లాడితే, మీ జీవిత భాగస్వామి మీ సమస్యలను అర్థం చేసుకుంటారు. మీకు మద్దతు కూడా ఇస్తారు. ఇది మీ ప్రేమను పెంచుతుంది. ఈ రోజు మీరు పూజలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఆర్థిక విషయానికొస్తే, ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే మీరే నష్టపోతారు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:05 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈరోజు భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాలు ఈ రోజు
మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దీని వల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు. మీరు మీ వ్యక్తిగత విషయాలను వీలైనంత త్వరగా పరిష్కరించడం మంచిది. లేకపోతే అది మీ పనితీరుపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కొంత గొప్ప సమయాన్ని గడపగలుగుతారు, ఇది మీకు కొంత శాంతిని ఇస్తుంది. ఈ రోజు ప్రయాణించకుండా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 33
లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు. మీరు ఈరోజు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగులు ఉన్నతాధికారులను మెప్పించడానికి అదనపు పని చేస్తారు. కానీ దీని వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు వైవాహిక జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకుని ఉంటారు. మీ ఇద్దరి మధ్య వివాదానికి అత్తమామల జోక్యం కారణమవుతుంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మానుకోవాలి.ఆర్థిక పరంగా ఈరోజు గొప్పగా ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9:45 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీరు ఖాళీ సమయంలో పని లేకుండా కూర్చోవడం కంటే మంచి పుస్తకం చదవడం మంచిది. ఈరోజు మీరు కుటుంబానికి దూరంగా ఉండటానికి ఉద్యోగ మార్పు చేసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈరోజు ఓ శుభవార్త వినిపిస్తుంది. మరోవైపు వివాహితులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి మీ విలువైన సమయాన్ని వెచ్చిస్తే మంచిది. ఈ రోజు మీరు మీ అడుగడుగునా ఆలోచిస్తూ ముందుకు సాగాలి ఎందుకంటే ఒక తప్పు నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. వ్యాపారులు ఈరోజు మంచి ప్రణాళిక చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు అన్ని విషయాల్లో విశ్వాసం ఉంటుంది. మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ ఇంటి వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. కుటుంబం నుండి ఆప్యాయత పొందడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. అయితే ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, మీ ఉన్నతాధికారుల నుండి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడంపై శ్రద్ధ పెట్టాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి సాయంత్రం 4 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. దీని వల్ల మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు మీరు వివాహ జీవితం యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకుంటారు. మీ ప్రియమైన వారు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తారు. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే, మీ సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవడానికి వెనుకాడరు. బహుశా మీ సమస్య పరిష్కరించబడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు పవిత్రంగా ఉంటుంది. కొత్త పెట్టుబడికి సమయం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి యోగా చేయాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:50 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, బెట్టింగ్ చేయడం మానుకోవాలి. మీ ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఈరోజు మీరు చాలా అలసటతో ఉంటారు. ఇది మీ కోపానికి కారణమవుతుంది. మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ సమస్యలకు ప్రశాంతమైన మనస్సుతో పరిష్కారం కనుగొనడం మంచిది. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు సహకారం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీకు సహాయం చేస్తుంది. మీరు మీ భాగస్వామితో ఆనందాన్ని అనుభవిస్తారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఈ రోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సన్నద్ధమవుతుంటే మరియు మీకు ఏదైనా సబ్జెక్టులో ఇబ్బంది ఉంటే, గురువుల సహాయం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కాకుండా. అధ్యయనాలపై మీ ఆసక్తి మరింత పెరుగుతుంది. మీకు తండ్రి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరిమితుల కారణంగా మీ పనులు పెండింగులో పడిపోతాయి. మరోవైపు ఈ రోజు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వలేరు. మీ ఇద్దరికీ కొంత సమస్య వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు సౌకర్యవంతమైన విషయాల కోసం కూడా ఖర్చు చేయవచ్చు. వ్యాపారులకు కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా కాలం తర్వాత ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. అయితే మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మంచిగా గడుపుతారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు శృంగార పరంగా ఒత్తిడి ఉంటుంది. మీరు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈరోజు మీరు మీ కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి. మీ పనిపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఆర్థిక పరంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల శక్తులకు ప్రభావితమవుతారు. దీని వల్ల ఏవైనా పనులు చేయడానికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మరోవైపు తల్లిదండ్రుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. ఇది మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. తండ్రి సహాయంతో మీరు కొంత పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. మీ సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. మీరు ఒకరికొకరు దగ్గరవుతారు. ఉద్యోగులు ఈరోజు కష్టపడి పని చేస్తారు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 5:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











