Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గురువారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, నిజ అశ్వీయుజమాసం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీకు ఎక్కువ బాధ్యతలు కూడా ఉండొచ్చు. తక్కువ సమయం కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. తల్లిదండ్రులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకూడదంటే మీరు మీ భాగస్వామితో వాదనలు మానుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీరు ఈరోజు ప్రశాంతంగా పని చేయాలి. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో ప్రశంసలను అందుకుంటారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు జలుబు దగ్గు లేదా కఫ సమస్యతో బాధపడతారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:05 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. దీని వల్ల మీరు చాలా కలత చెందుతారు. ఈరోజు మీరు ఇంట్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఆలోచించాలి. అప్పుడే మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మరోవైపు ఆర్థిక పరంగా మెరుగయ్యేందుకు మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య పరంగా ఒక సమస్యతో ఇబ్బంది పడతారు.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4:25 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీరు ఈరోజు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీ వైవాహిక జీవితం కూడా ప్రేమ, ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉండాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉద్యోగులు ఊహించిన ఫలితాలు రాకపోతే, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు సహోద్యోగులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి. ఈరోజు వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ఒక సమస్యను ఎదుర్కొంటారు.
లక్కీ కలర్ : మెరున్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 10:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు అధ్యయనాల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు విద్యలో విజయం సాధించాలంటే, మరింత ఎక్కువ కష్టపడాలి. వ్యాపారులు ఈరోజు ఏదైనా పెద్ద ప్రయోజనం పొందొచ్చు. మరోవైపు ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో ఈరోజు మీకు కొంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అప్పుడే మీరు రుణాలను సులభంగా తిరిగి చెల్లించగలుగుతారు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు పవిత్రంగా ఉంటుంది. మీరు సానుకూల ఫలితాలను పొందొచ్చు. ప్రతికూల పరిస్థితులలో కూడా సులభంగా పని చేసి అందరి మనసులను గెలుచుకుంటారు. వ్యాపారులు కూడా ఈరోజు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యక్తిగత జీవితంలో ప్రతి సమస్యను సులభంగా ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితంలో మాత్రం కొంత సమస్య ఉండొచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క అవగాహనతో, మీ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది. మీ ప్రియమైన వారితో కలిసి ఉంటే మీరు మంచి అనుభూతి పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి రాత్రి 8:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఒత్తిడిని అధిగమించి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉంటాయి. అయితే మీకు కుటుంబంతో గడిపేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. మీరు పాత విషయాలను మరచిపోయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ ప్రియమైన వారితో రిలేషన్ మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మరోవైపు ఈరోజు మీరు మీ పనులను వేగంగా చేయాలి. ఉద్యోగులకు కార్యాలయంలో పని భారం పెరుగుతుంది. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఆనందమైన క్షణాలను గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. దీని వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. అయితే కొంతమంది మీ పనులకు అంతరాయం కలిగించొచ్చు. అలాంటి పరిస్థితిలో మీరు చాలా తెలివిగా పని చేయాలి. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు తేలికపాటి వ్యాయామం చేయాలి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో, మీరు ఆర్థిక పరంగా బోనస్ సంపాదిస్తారు. అంతేకాదు మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కూడా ప్రయోజనం పొందొచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి ఈరోజు మారుతుంది. మీ ప్రియమైన వారి ప్రేమ పూర్వక ప్రవర్తన మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. పని విషయంలో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఓ ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ తరపున మీరు ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. దీని వల్ల మీ పురోగతి కల నెరవేరుతుంది. ఔషధ వ్యాపారులు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం కూడా ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరగొచ్చు. దీని వల్ల మీకు భారం పెరిగినట్టు అనిపిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి మీకు ప్రత్యేక మద్దతు లభించదు. దీని వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు పెరగొచ్చు. ఈ సమయంలో మీరు పిల్లలపై కూడా శ్రద్ధ చూపాలి. ఆర్థిక పరంగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. లేకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు మీ మాటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఈరోజు ఒక మంచి అవకాశం రావచ్చు. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9:15 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











