Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆదివారం దినఫలాలు : తుల రాశి వారికి భాగస్వామితో బంధంలో సన్నిహితంగా ఉంటుంది..
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, నిజ అశ్వీయుజమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ల సలహాలు పాటించాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు వారితో ఎక్కువ సమయం గడపడానికి కూడా అవకాశం పొందుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో సమయం మంచిగా ఉంటుంది. మీరు మీ పనితో పాటు మీ కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి. ఉద్యోగులు ఈరోజు చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. కానీ, త్వరలో పరిస్థితి సాధారణంగా మారుతుంది. మీరు మీ పనిని శ్రద్ధగా చేయగలుగుతారు. నిరుద్యోగులు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరంగా మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఆర్థిక పరమైన నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ అన్నయ్య లేదా సోదరి సహాయంతో మీ జీవితంలో ఏదైనా పెద్ద సమస్య ముగుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది. క్లిష్ట పరిస్థితులలో మీ ప్రియురాలి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆఫీసులో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. సహోద్యోగులతో మంచి సంబంధాలు పెట్టుకోండి. వ్యాపారులకు ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందొచ్చు. ఈరోజు మీరు సులభంగా డబ్బు సంపాదించగలరు. మీరు ఏదైనా చిన్న రుణం నుండి ఉపశమనం పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు వివాహం చేసుకుంటే, ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ రొమాంటిక్ గా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. వ్యాపారులు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఒక సమస్యతో ఇబ్బంది పడతారు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ఏదైనా సానుకూల మార్పు రావచ్చు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, మీ మార్గంలో కొన్ని అడ్డంకులు వస్తున్నట్లయితే, త్వరలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు మీ ఇంటి సభ్యులతో చాలా ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు డబ్బు కోల్పేయే అవకాశం ఉంటుంది. ఈరోజు రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు మీ ఒత్తిడిని పెంచుతాయి. ఉద్యోగులు ఈరోజు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. సీనియర్లు మీపై కోపం తెచ్చుకుని మీ పురోగతిని వాయిదా వేయాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు తమ దినచర్యను క్రమబద్ధీకరిస్తే, ఆరోగ్య సమస్యల నుండి బయటపడొచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ ద్రుష్టి పెట్టాలి. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీరు పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారులు ఈరోజు లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్య ఉండదు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని అనవసరమైన విషయాల గురించి ఇబ్బంది పెట్టొచ్చు. ఇలాంటి ప్రతికూల విషయాలు మిమ్మల్ని మీ లక్ష్యం నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి. ఉద్యోగులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతు మీకు లభిస్తుంది. మీరు మీ ప్రియురాలితో గొప్ప సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు తొందరపడకపోవడమే మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా ఒక పెద్ద సమస్య తలెత్తవచ్చు. ఈ కారణంగా మీ మనసు చాలా కలత చెందుతుంది. మీరు ఈరోజు చాలా ధైర్యంగా పని చేయాలి. మీరు ప్రశాంతమైన మనసుతో మీ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాలి. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో ఈరోజు కొన్ని గొడవలు రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి కావాలంటే, మీరు మీ జీవిత భాగస్వామిని గౌరవించాలి. మీరు మీ రిలేషన్ షిప్ లో పారదర్శకంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీరు వారి ఆతిథ్యంలో చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు. మీరు ఇతరులను సంతోషపెట్టడానికి మీరు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఉద్యోగులు ఈరోజు లభించే ఓ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, మీ కెరీర్ కు కొత్త దిశ లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీ విద్యకు సంబంధించి, మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే, మీరు ఈరోజు విజయం సాధించే అవకాశం ఉంది. మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు అధ్యయనాలలో కూడా మంచి అనుభూతి చెందుతారు. మీ కుటుంబ జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. మీ ఇంటి వాతావరణంలో మెరుగుదల చూస్తారు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో కొంత అదనపు పనిని చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు పని నిమిత్తం ప్రయాణించాల్సి ఉంటుంది. మీ ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:45 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు అకస్మాత్తుగా పెద్ద ప్రయోజనాన్ని పొందొచ్చు. మీరు ఎక్కడైనా కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో తీపి ఉంటుంది. మీ ప్రియమైన వారు రోజు వారీ పనులలో మీకు సహాయపడగలరు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు చాలా చురుకుగా ఉంటారు.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











