For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం మీ రాశిఫలాలు (29-09-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిష్యం, సెప్టెంబర్ 29వ తేదీ

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, భాద్రపదమాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, తదితర విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి వారికి ఈరోజు కొన్ని ఊహించని సంఘటనలు ఎదురుకావచ్చు. కానీ మీ స్వాగతించే సంభాషణల ద్వారా పరిస్థితులు మీ దారికి రావచ్చు. ఈరోజు మీరు మీ సన్నిహితుడితో కలిసి ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన ప్రయాణం చేయొచ్చు. పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు. ఈజీ మనీ కోసం అన్వేషించి ఇబ్బంది పడే అవకాశముంది. వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నష్టాలొచ్చే అవకాశాలున్నాయి. కోర్టుకు సంబంధించిన విషయాలలో ఆలోచనలు ఎక్కువగా అవుతాయి. విద్యార్థులు ఆటలపై ఆసక్తి చూపుతారు. రోజు మీరు ఇతరులతో బాగా సంబంధం కలిగి ఉంటారు. స్నేహితుల సంబంధాలు సైతం దగ్గరవుతాయి. శృంగార సంబంధాలు సైతం మరింత సన్నిహితంగా మారతాయి. మొత్తానికి అన్ని రంగాల వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు హనుమాన్ చాలిసా చేస్తే ప్రయోజనం ఉంటుంది.

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

మీరు కొత్త ఆలోచనలను స్వీకరిస్తారు. వాటిని మీ కోసం ఉపయోగించుకునే ప్రయత్నిస్తారు. మీకు తెలియని కొత్త ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంది. సృజనాత్మకత మరియు సాంకేతికతను కలిపే ప్రయోగాలు మీ ఆదాయాన్ని పెంచేందుకు అవకాశాలున్నాయి. మానసికపరమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, సంతోషంగా ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొని అందరితోనూ సరదాగా ఉంటారు. రుణపరమైన అప్పులు తగ్గిపోతాయి. కుటుంబంతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారం పెంచుకోవాలనే ప్రయత్నాలు జరుగుతాయి. మీ భాగస్వామి వల్ల ఈరోజు కలిసొచ్చే అవకాశం ఉంది. వేధింపుల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి అనుకూలతలు కనబడుతున్నాయి. ఈ రాశివారు ఆదిత్య పారాయణం చేసుకుంటే మంచిది.

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈరోజు మీరు అసాధారణమైన కళారూపాలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. స్థానిక కళాకారుల ప్రదర్శనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు అంచనాలు పెంచుకున్న సినిమాలు మీకు నచ్చుతాయి. ఆహార నియమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలి. అనవసరమైన గొడవల్లో తలదూర్చి వివాదం పెంచుకునే అవకాశాలున్నాయి. మీ ఎదుగుదలను ఓర్వలేని వారు ఎక్కువగా ఉన్నారు. ఐటి రంగంలో ఉన్న వారికి కొంచెం నష్టాలున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు నీళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశముంది. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం, మొండి బకాయిల వల్ల మీరు కొంత ఇబ్బంది పడొచ్చు స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశముంది. ఈ రాశివారు నారాయణ స్త్రోత్రాన్ని పారాయణం చేసుకోవాలి.

కర్కాటక రాశి : జూన్ 21 - జులై22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై22

మీరు చాలా కాలంగా చూడని పాత స్నేహితుడు ఈరోజు మిమ్మల్ని చూడటానికి రావచ్చు. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ మీరు ఈ వ్యక్తిని చూడటం వల్ల మీకు ఆనందంగా అనిపిస్తుంది. మీరు ఒక రకమైన కొత్త పరికరాలను కొనుగోలు చేయొచ్చు. దేవాలయ దర్శనాలు చేస్తారు. ప్రభుత్వ అనుమతులు, పెన్షన్లు, లోన్లు, సబ్సిడీలు వచ్చే అవకాశాలున్నాయి. ఆర్థిక విషయాలు మెరుగుదలగా కనిపిస్తున్నాయి. కొంచెం స్వార్థంగా ఉంటారు. మంచి తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు కూడా పని ఒత్తిడి తగ్గుతుంది. సుఖంగా ఉంటారు. విద్యార్థులు ఆటలు ఎక్కువగా ఆడే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులు సాహసోపేత నిర్ణయాలను తీసుకుని ముందడుగు వేస్తారు. శివపంచాక్షరి స్త్రోత్రాన్ని పఠించాలి.

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

స్నేహితుడి నుండి ఊహించని ఆహ్వానం లభిస్తుంది. మీరు ఒక చిన్న యాత్రకు వెళ్లొచ్చు. ఆ వ్యక్తిని కలిసేందుకు, మాట్లాడేందుకు ఆసక్తికరంగా ఉంటారు. స్నేహితుల సంభాషణలు జ్ఞానోదయం కలిగిస్తాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కళ్లు, కాళ్లకు, ఉదరానికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈరోజు మీకు బాగా ఇష్టమైన వారిపై కోప్పడవచ్చు. క్రయ విక్రయాల్లో నష్టాలు రావొచ్చు. స్త్రీలకు అత్తమామలతో, చుట్టుపక్కల వారితో గొడవలు వచ్చే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఇన్ కమ్ ట్యాక్సులకు సంబంధించిన కొంత సమస్యలు రావచ్చు. విద్యార్థులకు తోటి విద్యార్థులతో కొంత ఇబ్బంది కలగొచ్చు. లేదా అపార్థాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు బిజీగా ఉన్నప్పటికీ సంతృప్తికరంగా ఉంటారు. మీకు దగ్గర్లో ఉన్న శివాలయాన్ని సందర్శించండి.

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

మీ ఆశయాన్ని తిరిగి పొందడానికి కొత్త కెరీర్ అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పురోగతి కోసం కొన్ని అసాధారణ అవకాశాలు రావొచ్చు. ఇది కొంచెం భయపెట్టేదే అయినా ఉత్తేజకరంగా ఉంటుంది. మీకు ఈరోజు రావాల్సిన మొండి బకాయిలన్నీ వచ్చేస్తాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు. సినిమా, టివి, మీడియా రంగాల వారికి లాభాలు వస్తాయి. కష్టపడటానికి ఇష్టపడతారు. అందరిలోనూ గౌరవం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సర్దుకుపోయే మనస్తత్వంతో ఆనందంగా ఉంటారు. ఖరీదైన వస్తువులు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్త్రీలకు భర్త గురించి సుఖం లభిస్తుంది. విద్యార్థులకు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన వస్తుంది. ఈ రాశివారు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే మంచిగా ఉంటుంది.

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈరోజు మీరు ఎన్నడూ వెళ్లని ప్రదేశానికి సుదీర్ఘ ప్రయాణానికి ప్లాన్ చేయవచ్చు. బహుశా ప్రేమికుడు లేదా సన్నిహితుడితో ఏర్పాట్లు చేయడంలో మీలో ఉత్సాహం పెరిగిపోతుంది. మీకు మరియు మీ ప్రత్యేక వ్యక్తికి మధ్య కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. దీంతో శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తారు. పురుషులు స్త్రీలపై, స్త్రీలకు పురుషులపై వ్యామోహం పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా వాయిదా పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కష్టానికి తగ్గ ఫలితం ఉండకపోవచ్చు. విదేశీ ప్రయత్నాల విపత్తులు, ఇబ్బందులు రావొచ్చు. కుటుంబంలో కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో మాత్రం ఉత్తేజకరంగా ఉంటారు. ప్రేమించిన వారితో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతారు.

ఈ రాశి వారు మంగళ చిండికా స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే కొంత ఫలితం ఉంటుంది.

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

మీరు కొంతకాలంగా చూడని ఓ స్నేహితుడి నుండి మీకు ఊహించని సందర్శన ఉంటుంది. ఇది మీరు చాలా కాలంగా మరచిపోయిన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. మీరు భావోద్వేగ సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది ఉత్సాహం కలిగించినప్పటికీ, వాటిని మళ్లీ అణచివేయడానికి ప్రయత్నించొద్దు. ఈరోజు మీరు మీ స్నేహితుడిని మళ్లీ చూడటం వల్ల మీకు చాలా ఆనందం కలుగుతుంది. అనుకున్న పనిని సాధిస్తారు. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. ఈ రాశి వారు ఈరోజు ఆనందంగా ఉంటారు. ఎదుటివారిని ఆకర్షిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకు కూడా శాంత గుణం పెరుగుతుంది. భార్య, భర్తల కలయికలు ఉంటాయి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయానికి లేదా దగ్గర్లోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించాలి.

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈరోజు మీరు మొదటి చూపులోనే ప్రేమలో పడొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మీకు శృంగారానికి అద్భుతంగా ఉంటుంది. వీలైతే ఈ రాత్రి మీ భాగస్వామితో బయటకు వెళ్లండి! ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో నష్టాలు కనబడుతున్నాయి. మీ ప్రవర్తన వల్ల మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఈరోజు స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీవితాలు నాశనమయ్యే పనిని చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఈరోజు ప్రశాంతత లేని కారణంగా సమస్యలు ఎదురు కావచ్చు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గి, ఇంటర్నెట్ వంటి వాటిపై వ్యామోహం పెరిగే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి ఈరోజు పెద్దగా విశేషంగా ఉండదు. అందుకే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వెళ్లి దర్శనం చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది.

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఉత్తేజకరమైన కొత్త పరిమాణాలు మీ కెరీర్ కు ఉత్సాహంగా అనిపిస్తాయి. అంతేకాదు ఉత్సాహభరితమైన సంభావ్య భాగస్వామి కనిపిస్తుంది. మీరు ఆసక్తికరమైన ప్రాజెక్టులు మరిు పురోగతి కోసం ఎదురు చూడొచ్చు. విదేశీ పర్యటన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఐటి రంగంలోని వారానికి లాభాలొస్తాయి. ఇంటి నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు మంచి లాభాలొస్తాయి. కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా కనబడుతుంది. విద్యార్థులు కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. గాయత్రి కవచాన్ని పారాయణం చేసుకుని దగ్గర్లోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి.

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

సుదూర దేశాలలో ఉండే కళలు మిమ్మల్ని ఆకర్షించవచ్చు. బహుశా స్నేహితుల సహాయం ద్వారా ప్రయాణించాలనే మీ కోరిక పెరగొచ్చు.

దూర ప్రాంతాలతో సందర్శించాలనే ఆలోచనతో మీరు మీ ప్రేమికుల చిత్రాలను వేయవచ్చు. విహార యాత్రలను ప్లాన్ చేయడానికి ఇది ఒక గొప్ప రోజు అవుతుంది. చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల కొంత ఇబ్బందులు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ధన నష్టం జరిగే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఖర్చులు అధికమయ్యే ప్రమాదముంది. ఉద్యోగస్తులకు కూడా అంతగా మంచిగా లేదు. విద్యార్థులు చెడు స్నేహాల బాట పట్టే అవకాశముంది. ఈ రాశివారు ఆంజనేయ దండకాన్ని పారాయణం చేసుకుంటే మంచిగా ఉంటుంది.

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీ సౌందర్య భావం ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. మీరు మాములు కంటే అసాధారణమైన వాటికి ఎక్కువగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనం వచ్చే పనులు చేసేందుకు ప్రయత్నిస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు కనిపిస్తున్నాయి. పురుషులు, స్త్రీలు ఇద్దరికీ ఆనందంగా ఉంటుంది. స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అపనిందలు తొలగి అద్భుతంగా ఉండే రోజు అవుతుంది. కుటుంబంలో కూడా స్త్రీలకు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు కూడా తోటి వారితో పోటీ పడి చదవాలని అనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి లేదా గణపతి ఆలయాన్ని దర్శించుకోవాలి.

Read more about: astrology horoscope zodiac signs
English summary

Daily Horoscope September 29, 2019

Which signs are better if they postpone things? Do job efforts result? Can students excel in education? Is it convenient to express love? Travels & Travels Overseas Is it better to postpone? Investing in Business or Not? Read the full details of today's Bold Sky offerings in order to get a detailed look at the legal, court proceedings, property disputes, fortune teller, fortune teller, fate.
Story first published:Saturday, September 28, 2019, 19:28 [IST]
Desktop Bottom Promotion