Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
పెళ్లి పీటలెక్కబోతున్న కుమారుడికి ఆ విషయంలో ట్రైనింగ్ ఇచ్చిన తల్లి...
త్వరలో పెళ్లి చేసుకోబోయే కుమారుడికి దాల్ గురించి ట్రైనింగ్ ఇస్తున్న తల్లి.
ఇటీవలే ఆషాఢ మాసం వెళ్లిపోయింది.. శ్రావణ మాసం కూడా వచ్చేసింది.. కరోనా వైరస్ తో చాలా మంది సహజీవనం చేసేందుకు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో కళ్యాణం వంటి కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.

ఈ సమయంలోనే ఓ వరుడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కి.. వధువు మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. అయితే తనకు కాబోయే కోడలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఆ తల్లి భావించింది
అందుకే తన కుమారుడికి ఆ విషయంలో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. దీంతో ఆ తల్లి చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ తల్లి ఏమి చేసింది.. ఏ విషయంలో తన కుమారుడికి ట్రైనింగ్ ఇచ్చింది అనే విషయాలు తెలియాంటే ఈ స్టోరీని పూర్తి చూడాల్సిందే...

కళ్యాణం గురించి కంగారు..
కళ్యాణం అంటేనే చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిల్లో ఏదో తెలియని కంగారు మొదలవుతుంది. తాము అడుగుపెట్టే అత్తారింట్లో ఎలాంటి పద్ధతులు, ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయో.. వాటికి తాము సర్దుకుంటామో లేదో అని భయపడుతుంటారు..

ప్రతి ఒక్కరూ ఉచిత సలహాలు..
అయితే ఇదంతా ఒకప్పటి మాట.. ప్రస్తుతం ఆడపిల్లలే కాదు.. మగవారు కూడా అన్నీ నేర్చుకోవాలంటూ ప్రతి ఒక్కరూ ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు.

తన కుమారుడికి..
ఇదే పరిస్థితి తన కుమారుడికి రాకూడదని.. మగవారికి కూడా ఈ విషయాలపై కచ్చితంగా అవగాహన ఉండాలని భావించింది ఆ తల్లి. త్వరలో పెళ్లి పీటలెక్కి.. మూడు ముళ్లు వేసి.. ఏడడుగులు నడిచి కొత్త కాపురం పెట్టే తన కొడుకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని భావించింది.

వంట చేయడం వచ్చినా..
ఇప్పటితరం కుర్రాళ్లలో చాలా మంది మగవారికి వంట చేయడం వచ్చినప్పటికీ.. పప్పుల విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక వంటగది వైపు చూడని వారికి అది మరింత కష్టమనే చెప్పాలి. అందుకే ఆ తల్లి తన కుమారుడికి అర్థమయ్యేలా నేర్పించేందుకు వినూత్నంగా ప్రయత్నించింది.

ఓ పేపరు మీద..
ఆ తల్లి ఓ పేపరు మీద పప్పుదినుసుల పేర్లు రాసి.. ఆ పప్పులను ఓ కవర్ లో ఏర్పాటు చేసి వాటిని ఆ పేపరుకి అంటించి మరీ తన కొడుక్కి ఇచ్చింది. కాగా.. ఆ పేపర్ ని ఫోటో తీసి.. ఓ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

వైరల్ గా మారిపోయింది..
దీంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది. ఆ తల్లి చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు విపరీతంగా మెచ్చుకుంటున్నారు. పెళ్లికి ముందు ఇలాంటి శిక్షణ ఆడవారికే కాదు.. మగాళ్లకు కూడా కచ్చితంగా అవసరమే అని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క తల్లి ఈ విషయంలో తమ పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.



Click it and Unblock the Notifications