Latest Updates
-
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..
Shukra Rashi Parivartan 2022:వృషభంలోకి శుక్రుడి సంచారం.. రాశిచక్రాలపై పడే ప్రభావం...!
2022లో జూన్ 18న వృషభరాశిలోకి శుక్రుడి సంచారం వల్ల రాశిచక్రాలపై పడే ప్రభావం ఎలా ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క గ్రహం ప్రతి నెల తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. గ్రహాలన్నింటిలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

శుక్రుడు ఆనందం, ఐశ్వర్యానికి కారకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే 2022లో జూన్ 18వ తేదీన అంటే శనివారం రోజున శుక్రుడు మేషరాశి నుండి వృషభరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు అంటే జులై 18వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు.

ఆ తర్వాత తన సొంత రాశి అయిన మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడనుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు రెండో స్థానం నుండి వృషభరాశిలోకి అడుగుపెట్టే సమయంలో మేష రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులు లాభాలను స్వీకరిస్తారు. మీ వ్యాపారాన్ని పెంచుకునేందుకు పెట్టుబడి కూడా పెట్టొచ్చు. మీకు కొత్త సంబంధాలు వస్తాయి. ఉద్యోగులు ఆఫీసులో తెలివిగా వ్యవహరిస్తారు. ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో మంచిగా ఉంటుంది. వివాహానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు.

వృషభ రాశి..
శుక్రుడు మేష రాశి నుండి ఈ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారుల ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. మీకు అనేక మార్గాల నుండి ఆదాయం వస్తుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఈ కాలంలో కొత్త ఉద్యోగం సంపాదించే అవకాశం కూడా ఉంది.

మిధున రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 12వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశిలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. దీని వల్ల మీకు మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి సానుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు కొన్ని విలువైన వస్తువులను కొంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 11వ స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారులు కూడా ఆశించిన ఫలితాలను పొందుతారు. అంతేకాదు మీరు చాలా సొమ్మును ఆదా చేస్తారు. మీ జీవితంలో సౌకర్యాలు కూడా పెరుగుతాయి.

సింహ రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 10వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారిలో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఉద్యోగులు అయితే చాలా కాలంగా ట్రాన్స్ ఫర్ కోసం చూస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం మంచిగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో బలంగా ఉంటుంది. మీకు కుటుంబ పెద్దల సహాయం కూడా లభిస్తుంది. మీకు భాగస్వామ్య పనులు కూడా బాగా సాగుతాయి.

కన్య రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 9వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు అనేక మార్గాల నుండి డబ్బును పొందొచ్చు. మీ పూర్వీకుల ఆస్తుల వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏదైనా కోర్టు కేసుల గురించి ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, గొప్ప విజయాన్ని పొందొచ్చు.

తుల రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 8వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో తుల రాశి వారు ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబం ఆరోగ్యం పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 7వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారులకు అనేక లాభాలు వస్తాయి. ఈ కాలంలో మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా కలవొచ్చు. మీరు తక్కువ సమయంలో ధనవంతులయ్యే అవకాశం కూడా వస్తుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 6వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు సమస్యలు పెరుగుతాయి. సీనియర్లకు మంచి అవకాశాలు వస్తాయి. మీకు ఆదాయ పరంగా సానుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 5వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు సానుకూలంగా ఉంటుంది. మీరు చాలా ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో అంతా మంచిగా ఉంటుంది. మీరు ప్రమోషన్ కూడా పొందొచ్చు.

కుంభ రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 4వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు. ఆదాయ పరంగా అంతా మంచిగా ఉంటుంది. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి.

మీన రాశి.
ఈ రాశి నుండి శుక్రుడు 3వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలొస్తాయి. ఆర్థిక పరంగా చాలా లాభం రావొచ్చు. మీ బంధువులతో బంధం మరింత బలంగా మారుతుంది. కళా రంగంలో ఉండే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహితుల కోసం ఖరీదైన వస్తువులు చేయొచ్చు. ఈ సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మరోవైపు వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేయాలి.



Click it and Unblock the Notifications











