Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం:త్రివర్ణ పతాకం గురించి తెలుసుకోవలసిన విషయాలు
భారత జాతీయ జెండా అంటే అదో గర్వం.. త్రివర్ణ పతాకం అంటే బాధ్యత. నేషనల్ ఫ్లాగ్ అనగానే ప్రతి ఒక్క భారతీయుడిలో ఒక రకమైన భావన కలుగుతుంది. అది భక్తి, శ్రద్ధ, నిబద్ధత, బాధ్యతతో కూడిన ఫీలింగ్. దేశాన్ని బానిస సంకెళ్ల నుండి విముక్తి చేసేందుకు ప్రతి ఒక్కరిని ఒక్కతాటిపైకి తెచ్చింది ఆ త్రివర్ణ పతాకం. ఈ మూడు రంగుల జెండాను స్వీకరించిన రోజు జులై 22.

అసలేంటి ఈ జెండా స్వీకరణ దినోత్సవం?
ప్రతి భారతీయ ప్రజల హృదయంలో భారతదేశ జాతీయ జెండాకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. 1947, జూలై 22న త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ జెండాగా ఆమోదించారు. 15 ఆగస్ట్ 1947, 26 జనవరి 1950 మధ్య భారతదేశ డొమినియన్ జాతీయ జెండాగా... ఆ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ జెండాగా పరిగణించారు.

త్రివర్ణ పతాకం అంటే ఏమిటి
మన భారతీయ జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయి. అందుకే దానిని త్రివర్ణ పతాకం అంటారు. జాతీయ పతాకంలో పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. ఈ రంగులకు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. మధ్యలో నీలిరంగులో అశోక చక్రం ఉంటుంది. ఇందులో 24 చారలు ఉంటాయి.

కాషాయం:
ఇది ధైర్యం, నిస్వార్థత మరియు బలానికి చిహ్నం

తెలుపు:
సత్యం, శాంతి, స్వచ్ఛతకు చిహ్నం

ఆకుపచ్చ:
సమృద్ధి, పెరుగుదల, సంతానోత్పత్తికి చిహ్నం.

అశోక చక్రం:
దీనిని ధర్మ చక్రం అని కూడా పిలుస్తారు. అశోక చక్రంలో ఉండే 24 చారలు చలనశీలతను సూచిస్తాయి.

త్రివర్ణ పతాకం చరిత్ర
భారతదేశ త్రివర్ణ పతాకం స్వతంత్ర భారత గణతంత్ర చిహ్నం. మన దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు.. 1947 జూలై 22న తొలి సారిగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించిన సందర్భంగా స్వతంత్ర భారత రాజ్యాంగంపై ఒక సమావేశం ఏర్పాటు చేశారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు త్రివర్ణ పతాకాన్ని ఎన్నుకున్నారు. ఆగష్టు 15, 1947 నుండి జనవరి 26, 1950 వరకు, త్రివర్ణ పతాకాన్ని భారత దేశం యొక్క ఆధిపత్యంగా ప్రదర్శించారు. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఇది స్వతంత్ర గణతంత్రానికి జాతీయ జెండాగా ప్రకటించబడింది. త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు.

జాతీయ జెండా మరిన్ని విషయాలు:
* జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు కాషాయ రంగు పైన ఉండాలి.
* జాతీయ జెండాలో మరే ఇతర జెండా లేదా చిహ్నం ఉండకూడదు.
* జాతీయ జెండా పక్కన ఏదైనా ఇతర జెండాను ఎగురవేయాలనుకుంటే, జాతీయ జెండాకు ఎడమ వైపున వరుసలో ఎగురవేయాలి.
* జాతీయ జెండాను ఊరేగింపులో తీసుకెళ్తుంటే, జాతీయ జెండా కుడి వైపున లేదా జెండాల వరుస మధ్యలో ఉండాలి.
* ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్, సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో జాతీయ జెండాను ప్రతి రోజూ ఎగురవేయాలి.
* వ్యక్తిగత వ్యాపారం కోసం జాతీయ జెండాను ఎగురవేయకూడదు.
* సూర్యాస్తమయం సమయంలో జాతీయ జెండాను అవనతం చేయాలి.
* చిరిగిన లేదా కుట్టిన జెండాను ఉపయోగించకూడదు.
* ప్లాస్టిక్ జెండాను వాడకూడదు.

జాతీయ జెండా కావాలని ఎందుకు అనిపించింది?
జాతీయ జెండా రూపకల్పన చేసింది తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య. 1906లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ ప్రారంభానికి ముందు బ్రిటిష్ వారి పతాకమైన యూనియన్ జాక్ కు గౌరవం వందనం చేశారు. అప్పుడే పింగళికి మనకెందుకు జాతీయ జెండా ఉండకూడదన్న ఆలోచన మెదిలింది. ఆ సభలోనే ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆనాటి నుండి జాతీయ జెండా ఉండాలన్న విషయంపై దేశంలో ప్రచారం చేశారు పింగళి. ప్రతి సభలోనూ జాతీయ జెండా ఆవశ్యకత గురించి చెప్పేవారు. 1916 లో భారత దేశానికి ఓ జాతీయ పతాకం అనే ఆంగ్ల పుస్తకాన్ని రాశారు పింగళి. తర్వాత అదే సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు.



Click it and Unblock the Notifications