Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయినా కొన్ని పనులను అసంపూర్తిగా వదిలివేయకూడదు. వాటిని అలా మధ్యలోనే వదిలివేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని గరుడ పురాణంలో పేర్కొనబడింది. ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గరుడ పురాణం 18 మహాపురాణాల్లో ఒకటి. ఇది విశ్వోద్భవం, వంశవృక్షం, పురాణాలు, ఆలయ నిర్మాణం,తీర్థయాత్ర సహా ఇతర ఎన్నో విషయాల గురించి చెప్పే పురాణం. ఇది మహావిష్ణువు, గరుత్మంతుడిపై ఆధారపడి ఉంటుంది. జీవితం గురించి, మరణం గురించి అనేక గొప్ప సత్యాలను బోధిస్తుంది. గరుడ పురాణంలో నరకంలో వేసే శిక్షల గురించి ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ ఇంకా ఎన్నో విషయాల గురించి గరుడ పురాణంలో వివరించారు.

వేద వ్యాసుడు గరుడ పురాణాన్ని రచించాడు. మనిషి చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది. మనిషి చేసిన పాపాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయనే పలు రకాల ప్రశ్నలను గరుత్మంతుడు మహావిష్ణువు అడగ్గా ఆయన సమాధానాలు చెప్పాడు. గరుత్మంతుడికి చెప్పడం వల్లే దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయినా కొన్ని పనులను అసంపూర్తిగా వదిలివేయకూడదు. వాటిని అలా మధ్యలోనే వదిలివేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని గరుడ పురాణంలో పేర్కొనబడింది. ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పు పూర్తిగా చెల్లించాలి:
గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకున్న వ్యక్తులు తమ అప్పును త్వరగా చెల్లించాలి, అది కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి. అప్పు చెల్లించడం వల్ల సంబంధాలు బలపడటంతో పాటు తిరిగి అప్పు ఇవ్వడానికి ఎదుటివారికి నమ్మకం కుదురుతుంది. అప్పు తీర్చకపోయినా లేదంటే సగమే తీర్చినా సమస్యే అని గరుడ పురాణం చెబుతోంది.

శత్రుత్వాన్ని పూర్తిగా అంతమొందించాలి:
జీవితంలో శత్రువులు ఉండొచ్చు. వారిపై పగ ఉండొచ్చు. అయితే శత్రుత్వాన్ని పూర్తిగా అంతమొందించాలని గరుడ పురాణం చెబుతోంది. దీనర్థం శత్రువులను చంపడం కాదు, మీకు వారికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని పూర్తిగా తొలగించడం. అది పూర్తిగా తొలగిపోతే ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుందని గరుడ పురాణం చెబుతోంది.

అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించాలి:
ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే అతను పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందించాలి. వ్యాధి మూలం నుండి నిర్మూలించబడకపోతే అది మళ్లీ వచ్చే అవకాశం ఉంది. మరోసారి వచ్చినప్పుడు అది మరింత తీవ్రంగా ఉండొచ్చు. అందుకే వైద్యులు రాసిచ్చే మందులను పూర్తి స్థాయిలో వేసుకోవాలి. వ్యాధి పూర్తిగా తగ్గిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలని గరుడ పురాణం చెబుతోంది.

మంటలను పూర్తిగా ఆర్పేయాలి:
ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినా, అడవిలో కార్చిచ్చు చెలరేగినా మంటలను పూర్తిస్థాయిలో ఆర్పివేయాలి. చిన్న స్పార్క్ ను కూడా విడిచి పెట్టకూడదు. ఎందుకంటే చిన్న నిప్పు రవ్వ చాలు తిరిగి అగ్ని రాజుకోవడానికి, పూర్తిగా కాలిపోవడానికి. అందుకే మంటలను పూర్తిగా ఆర్పేయాలని గరుడ పురాణం చెబుతోంది.

అంత్యక్రియలు చేయడం:
మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు చేయడం జీవించి ఉన్న కుటుంబసభ్యుల యొక్క కీలకమైన బాధ్యత. ఈ కర్తవ్యాన్ని విస్మరించడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మ భూమిపైనే ఉండిపోయి అనేక ఇబ్బందులు పడుతుందని గరుడ పురాణంలో వివరించబడి ఉంది.

మొక్కులు:
దేవతలకు చాలా మంది మొక్కుతుంటారు. ఏదైనా పని జరిగితే కొబ్బరికాయలు కొడతామని, మరోసారి వచ్చి దర్శించుకుంటామని, భోజనాలు పెడతామని, బలిదానం సమర్పిస్తామని ఇలా ఎన్నో రకాలుగా మొక్కుతుంటారు. అయితే ఆ పని పూర్తయిన తర్వాత కొందరు ఈ మొక్కులను మర్చిపోతుంటారు. అయితే ఇలా మర్చిపోవడం వల్ల మరణానంతర జీవితంలో ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని గరుడ పురాణం చెబుతోంది. బతికున్నప్పుడు మొక్కిన మొక్కులు, చేసిన ప్రమాణాలు అన్నింటిన చనిపోయేలోపు నెరవేర్చాలని గరుడ పురాణంలో వివరించబడి ఉంది.



Click it and Unblock the Notifications