Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Viral: చపాతిని ఇంత ఈజీగా చేయొచ్చా... అదెలాగో మీరూ చూడండి...
చపాతి బేలన్ లేకుండానే రౌండ్ గా చేయడం చాలా సులభమని తెలుసా.
వంట చేయడం అన్నది ఒక కళ. ఆ కళ అందరికీ రాదు. అందరూ నలభీములు కావాలంటే కష్టమే. అయితే కొందరు వ్యక్తులు మాత్రం ఏది చేసినా.. చాలా రుచికరంగా ఉంటుంది. మనం నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతుంది. అంతేకాదు వారి చేయి పడితే ఎలాంటి క్లిష్టమైన వంట అయినా చాలా సులభంగా మారిపోతుంది.

అంతేకాదు కొందరు వంటలు చేసేటప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు.. వాటిని వెంటనే ఆచరణలో పెట్టేస్తారు. వాటి వల్ల వంటగదిలో వంట చాలా త్వరగా రెడీ అయిపోతుంది. అలా తాజాగా ఓ వీడియో వైరల్ అయ్యింది. అదెంటంటే.. ఓ అమ్మాయి చపాతి బేలన్ లేకుండానే చపాతి పిండితో రౌండ్ గా చేసేసింది. అది కూడా అత్యంత సులభంగా. అదెలాగో మీరు కూడా చూడండి.. ఈసారి మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఎందుకంటే దీని వల్ల సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ఇదే వీడియో ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది.

మన దక్షిణ భారతదేశంలో చపాతీలు కంటే అన్నంకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే చపాతీలు చేయడానికి చాలా సమయం పడుతుంది. పిండి నానబెట్టాలి. అందులో ఉండే గులకరాళ్లను తొలగించాలి. ఆ తర్వాత వాటిని సరైన ఆకారంలో చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని పెన్నంపై వేసి కాల్చాలంటే చాలా సమయం పడుతుంది. అంతేకాదు అవి కరెక్టుగా రావడానికి కొందరికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఉత్తర భారతంలో మాత్రం బియ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, నిరంతరం చపాతీలు, రోటీలు తింటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ అయిన వీడియో ప్రకారం, ఆ అమ్మాయి చేసిన పద్ధతిలో చేస్తే, చపాతీ చేయడం అంత సులువా అని మీరే అంటారు. ఎందుకంటే ఇది చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

ముందుగా చపాతిని రౌండ్ గా చేయాలంటే.. పిండిని బాగా కలిపి నీటిలో నానబెట్టాలి.. ఆ తర్వాత మీరు చపాతి పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని బేలే పని లేదు. ముందుగా కొద్దిగా చపాతీ పిండి తీసుకుని దానిపై ఒక ప్లాస్టిక్ కవర్ వేయండి. దాని కింద ఒక ప్లేటులో ఆయిల్ వేసి ఉంచండి. అంతే దాని మీద మరో పాత్ర వేసి ట్రేతో నొక్కండి చాలు. చపాతీ మీరు కోరుకున్న ఆకారానికి వచ్చేస్తుంది. పైన ఫొటోల్లో చూపిన విధంగా మీరు కూడా ప్రయత్నించి చూడండి.



Click it and Unblock the Notifications
