Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
National Doctors Day 2022: మనకు కష్టమొచ్చినప్పుడు కాపాడే వైద్యులను ఇలా అభినందిద్దాం...
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సంబంధించి కొన్ని కోట్స్, మెసెజ్, విషెస్ లను షేర్ చేసుకుందాం.
మన దేశంలో ప్రతి సంవత్సరం జులై 1వ తేదీన జాతీయ వైద్య దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచంలోనే గొప్ప వైద్యుడు, పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బీదన్ చంద్ర రాయ్ జ్ణాపకార్థం దినోత్సవాన్ని జరుపుకుంటారు.

విశేషమేమిటంటే.. ఆయన పుట్టినరోజు మరియు మరణించిన రోజు ఒకే రోజు కావడం. ఇలా రెండింటిని ఒకేరోజు సూచించే ఈరోజున మన సమాజంలో వైద్యులు పోషించిన ముఖ్యమైన పాత్రాలతో పాటు డాక్టర్ బిధాన్ సహకారాన్ని గుర్తించాల్సిన రోజు ఇది.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా, ఈ రంగంలో ఉండే వైద్యులందరికీ మీరు విషెస్ తెలిపేందుకు కొన్ని కోట్స్, మెసెజెస్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన వాటిని షేర్ చేయండి. కనిపించే దేవుళ్లకు మీ శైలిలో శుభాకాంక్షలు తెలపండి. ఇవి వైద్యుల పట్ల మీకు ఎంత గౌరవం ఉందో తెలియజేసేందుకు కచ్చితంగా ఉపయోగపడతాయి...

అహర్నిశలు శ్రమిస్తూ
‘‘కరోనా వంటి తీవ్రమైన మహమ్మారి సమయంలో మన ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తూ, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క వైద్యునికి ధన్యవాదాలు''
జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు

ఏకైక వ్యక్తి వైద్యుడే..
‘‘మీకు తలనొప్పి, దగ్గు లేదా ఫ్లూ వంటి ఏ వ్యాధి వచ్చినా,
మీకు నయం చేసే ఏకైక వ్యక్తి వైద్యుడే''
నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు..

వైద్యులే అసలే దేవుళ్లు
‘కనిపించని ఆ దేవుడు ఊపిరిపోస్తాడు..
కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారు..
వైద్యులే అసలే దేవుళ్లు''
హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే

ప్రాణాలను కాపాడటానికి..
ఇతరుల ప్రాణాలను కాపాడటానికి ఎల్లప్పుడూ
రెడీగా ఉండే వారే మన వైద్యులు
అలాంటి వైద్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. "
హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే

నిజమైన హీరోలు..
‘‘ప్రజలందరి ప్రాణాలను కాపాడటానికి మరియు ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమించే మీరే
సమాజంలో నిజమైన హీరోలు''
జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు..

గొప్ప పని..
"మీరు రోగులకు వ్యాధి నయం చేసే విధానం మరియు వారికి ఉత్తమమైన మరియు అవసరమైన చికిత్సలు ఇచ్చేలా చూసుకోండి, ప్రతిరోజూ మీరు చేసే గొప్ప పని ఏమిటో చూపించండి''
హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే

ఎల్లప్పుడూ అంకితభావంతో..
‘‘ఎల్లప్పుడూ అంకితభావంతో మరియు బాధ్యతాయుతమైన ఆరోగ్య కార్యకర్తగా, మీరు మీ రోగాలను నయం చేయడానికి ముందుంటారని మాకు తెలుసు..
అందుకే మీకు వేల వేల వందనాలు''

నా కృతజ్ఞతలు..
"మీలాంటి గొప్ప వైద్యులకు నా కృతజ్ఞతలు తెలియజేయడానికి నా బిజీ జీవితం నుండి ఈ క్షణం తీసుకుంటున్నాను. మీకు జాతీయ డాక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు. "

వ్యాధితో పోరాడేందుకు..
"మందులు ఒక వ్యక్తికి రోగం నయం చేస్తాయనడంలో సందేహం లేదు, కానీ మీలాంటి శ్రద్ధ గల వైద్యుడు రోగులను వ్యాధితో పోరాడటానికి ప్రేరేపిస్తాడు''
జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు

దయగల మానవుడు..
"మీరు అద్భుతమైన డాక్టర్ అని చెప్పే ముందు, మీరు అద్భుతమైన మరియు దయగల మానవుడని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మాకు అవసరమైన సంరక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్''.
మీకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications
